3.29.2011

ఆధార్ గురించి..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన,  దేశమంతటా చెల్లుబాటు అయ్యేలా రూపొందించిన ఆధార్ కార్డులను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి.  ఆధార్ కార్డ్ సామాన్య మానవుడి జన్మ హక్కు.    ఆధార్ వల్ల భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, తమ వద్ద ఎటువంటి గుర్తింపు, ధృవీకరణ కార్డు లేనివారికి ఇది మరింతగా ఉపకరిస్తుంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు సైతం ఈ కార్డు పొందొచ్చు . పూర్తి ఉచితంగా లభించే ఈ కార్డు ద్వారా వివిధ సౌకర్యాలను పొందడం సులభం అవుతుంది.    ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఉండే ఈ కార్డు పొందడానికి సంబంధిత  క్యాంపు వద్ద ఇచ్చే ఫారం పూర్తి చేసి ఏదైనా ఒక గుర్తింపు కార్డు తమ వెంట తీసుకువెళ్ళాలి.  


ప్పుడు మీరు ఆధార్ సంఖ్యతో బ్యాంకు ఖాతా తెరవవచ్చు.
భారతదేశ  విశిష్ట గుర్తింపు జారీ  సంస్థ ( యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా-UIDAI) చే జారీ చేయబడిన ఆధార్ సంఖ్యను  కేంద్ర ఆర్ధిక  మంత్రిత్వ శాఖ గుర్తించింది. “ బ్యాంకు ఖాతాలు తెరవడానికి మీ ఖాతా దారు గురించి తెలుసుకో –  కె వై సి నిబంధనలకు అనుగుణంగా ఈ ఆధార్ సంఖ్యలు అధికారికంగా అమలుచేయడానికి గుర్తిస్తారని భారతదేశ  విశిష్ట గుర్తింపు జారీ  సంస్థ (యు ఐ డి ఎ ఐ)  విడుదల చేసిన ప్రకటనలో తెల్పింది. పేదవారికి మరియు బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో లేని జనాభాకు ఈ సంఖ్య అమలు చేయడం వలన వారి గుర్తింపు సులభతరమై వారిని ఆర్ధిక రంగంలో చేర్చడానికి ఈ సంఖ్య   సత్వర వీలు కల్పిస్తుంది.
ఆధార్ సంఖ్య కోసం నమోదు చేసుకునే సమయంలోనే తమ భాగ స్వామ్య బ్యాంకులతో ఆధార్ సంఖ్యను కె వై సి నిబంధనలను సంతృప్తి పరచే విధంగా ఆమోదింప చేయడం వలన పౌరులు బ్యాంకు ఖాతాలు తెరుచుకునే వీలు కల్పించి ఖాతాలు తెరచే ప్రక్రియను యు ఐ డి ఎ ఐ సులభతరం చేస్తుంది” . “ బ్యాంకులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని యు ఐ డి సంఖ్యలు అందిస్తాయి. ఈ సంఖ్య బ్యాంకులో కొత్తఖాతాలు తెరచుకోవడానికి మరియు ఆర్ధిక తోడ్పాటుకు ఖచ్చితమైన సహాయం అందిస్తుందని ,” ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మాజీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హెచ్.  రత్నాకర్ హెగ్డే అన్నారు.

 

 



దేశంలో 6,00, 000 జనావాసాలు ఉండగా అందులో 100 లేక అంతకంటే ఎక్కువ మంది జనాభా ఉన్న ప్రాంతాలు  30,000 లలో మాత్రమే  వాణిజ్య బ్యాంకు శాఖలు ఉన్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు అందించిన వివరాల ప్రకారం దేశలోని మొత్తం జనాభాలో సగం కంటే తక్కువ జనాభాకు మాత్రమే బ్యాంకు ఖాతాలు  ఉన్నాయి.  కొన్ని బ్యాంకుల్లో   కె వై సి నిబంధనలకనుగుణంగా యు ఐ డి సంఖ్యలను ఉపయోగించడం ఇప్పటికే ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వ సమాచారం. బ్యాంకు ఖాతా తెరవడానికి ఉపయోగించే కొత్త దరఖాస్తు ఫారాలలో యూనిక్ సంఖ్య కోసం ఒక ప్రత్యేక గడి ఇవ్వబడింది. 12 అంకెలతో కూడిన గుర్తింపు సంఖ్య, ఆధార్ ను ప్రభుత్వం పౌరుల యొక్క విశిష్ట గుర్తింపు కోసం జారీ చేస్తోంది. ఈ సంఖ్య పౌరుని నివాసం మరియు అతని గుర్తింపు కోసం అవసరమైన వేలి ముద్రలు, పుట్టుమచ్చలు, ఫొటోలు మొదలైన భౌతిక అంశాలతో కూడిన పూర్తి సమాచారం అందిస్తుంది. పౌరులు దేశ వ్యాప్తంగా ఈ సంఖ్యను ఏ ప్రాంతంలో ఉన్నను వాడుకోవచ్చు.  ఈ సంఖ్య వల్ల పౌరులు వారికి రావలసిన ప్రయోజనాలు, కావలసిన సేవలు పొందవచ్చు.
కె వై సి నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు బ్యాంకులు గుర్తింపు పత్రాలుగా పాస్ పోర్ట్ , డ్రైవింగ్ లైసెన్స్ ,మరియు  ఓటరు గుర్తింపు కార్డులను  కోరుతున్నాయి. ఈ పత్రాలు ఖాతా తెరిచే వ్యక్తి గుర్తింపును మరియు అతని చిరునామా వివరాలను ధృవపరుస్తాయి.

 


ఆర్ధిక రంగంలో చేర్చేందుకు కె వై సి నిబంధనల ప్రక్రియలో ఈ గుర్తింపు అంశం అతి పెద్దదైన అడ్డంకిగా మారడంతో ఆ గుర్తింపుకు ఆమోదం తెల్పేలా ఈ యు ఐ డీ సంఖ్య పనికి వస్తుందని యు ఐ డి ఎ ఐ చైర్మన్ శ్రీ నందన్ నిలేకని అన్నారు. “12 అంకెలు కల్గిన యు ఐ డి సంఖ్య ఖచ్చితమైన మరియు సూక్ష్మమైన ఎ టి ఎమ్ గా పని చేయక పోతే ఈ ప్రాజెక్ట్( పథకం) ను కొనసాగించడంలో అర్ధంలేదని”  ఆయన అన్నారు. “ఆర్ధిక రంగంలో చేరికకు వ్యక్తిగత వివరాలు పెద్ద అడ్డంకిగా మారడంతో కె వై సి నిబంధనల కనుగుణంగా ఈ యు ఐ డి సంఖ్య రూపొందించామని ఆయన అన్నారు. ప్రస్తుతం  పట్టణం లేదా గ్రామాలలోని పేదలకు ఈ కె వై సి నిబంధనలు పెద్ద అడ్డంకిగా ఉన్నాయని”  నిలేకని అన్నారు.

మూలం: ది ఎకనామిక్ టైమ్స్


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...