11.08.2010

ఉనికి కోల్పోయిన (ఉత్తరం ముక్క) ఉత్తరాల రాయుడు(POST MAN)

"లేఖలు అందించే చినవాడ ప్రేమలేఖలు రాసావా ఎపుడైనా??"

ఓ ప్రేయసి.. తన ప్రియుడి కోసం పాడుకొన్న పాట అది... ఒక్క ఆ ప్రేయసికేనా ఈ లేఖలు అందించే చినవాడు.. అందరికి ప్రియమైన అపరిచితుడే... మధ్యాహ్నం ఒంటిగంట నుండి మొదలు...(మా ఊర్లో మధ్యాహ్నమే ఉత్తరాల బట్వాడ ఉండేది).... ఎప్పుడెప్పుడు వస్తాడా ఈ చినవాడు॥ ఏమేమి కబుర్లు మోసుకొస్తాడో.... అన్న ఆతృత.. రాగానే ఆనందం..

తెచ్చేది ఏ వార్త అయినా.. తనకేమి పట్టనట్లుగా వుండగలిగేది కూడా ఒక్క ఈ పోస్ట్ మాన్ మాత్రమే.. ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరగడంవల్ల... అందరూ.. మొగ్గు చూపేది... సెల్ ఫొన్ సంభాషణలు.. లేదా చాటింగ్ ముచ్చట్లు.. ఎవరికి ఉత్తరం విలువ అసలు తెలీదు.. సాహిత్యం కనుమరుగవుతోంది. ఎవరిని తరచి చూసినా.. e-mails... sms ...అసలు ఉత్తరం ఎలా రాయలో కూడ తెలియని వాళ్ళున్నారు.. "ఉభయకుశలోపరి" అంటే ఏంటి అని అడుగుతారు..అప్పట్లో మేము (నేను మా అక్క) పోటీలు పెట్టుకొనే వాళ్ళము.. ఎవరెక్కువ ఉత్తరాలు రాస్తారో చూద్దామా అని... "వెళ్ళగానే క్షేమంగా చేరినట్లు ఉత్తరం రాయమ్మా " అనేవారు అప్పట్లో... ఇప్పుడు ... ఫొన్ చెయ్యి.. లేదా ఓ మిస్డ్ కాల్ ఇవ్వు...
ఇలా కట్టె , కొట్టే , తెచ్చే... లా వుండే ఈ సెల్ సమాచారాలు.. మిస్డ్ కాల్స్.. వల్ల భాషలకి.. భావాలకి.. మంచి భావనలకి...ఆఖరికి బంధుత్వాలకి దూరమై పొతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో.. అప్పట్లో ఉత్తరాల ద్వారా తమ సాహిత్యాభిలాషను చాటుకొనే వారు.. సాంకేతికంగా మార్పు మంచిదే... కాని మానవ సంబంధాలు ప్రశ్నగా మారేంతగా కాదు.. ఎక్కడో విదేశాలలో వున్నవాళ్ళకి ఎలాగు తప్పదు.. ఫొటోలు .. విడియోలు పంపించి.. తమ క్షేమ సమాచారలు తెలుపుకొవడం.. ఇక్కడే వున్నవాళ్ళు తప్పనిసరిగా అప్పుడప్పుడు కలుస్తూ .. ఉత్తరాల ద్వారా క్షేమ సమాచారలు తెలుపుకొన్నట్లయితే పిల్లలికి మనము బంధుత్వం గురించి వాటి విశిష్టత గురించి నేర్పిన వాళ్ళమవుతాము..... మొన్న మా కజిన్ వాళ్ళ బాబుకి... నన్ను పరిచయం చెయ్యడం.. "అత్త" నాన్న... మా పెళ్ళి విడియోలో లెఫ్ట్ నుండి.. 2nd ఫొటొ.. నీకు చెప్పానుగా....ఇలా వున్నాయి ఇప్పటి పరిచయాలు.. ఉండేది ఒకే ఊర్లో మళ్ళీ.. కలవడం తక్కువ... పరిచయాలు అంతకన్నా తక్కువ.. ఇలా అయితే పిల్లలికి ఎలా??
మొన్నామధ్య.. ఈ శ్రీజ .. శిరీష్ ల పెళ్ళిగురించి ఏదో విషయంలో ఒక పెద్దాయనని ఇంటర్వ్యూ చేసిందో ప్రైవేట్ ఛానెల్ ఆయన అన్న మాటలు నాకు చాలా నచ్చాయి.."ఇప్పటి యువత.... సినిమా మోజు లో పడిపోయింది.. మంచి సాహిత్యం చదవరు... విలువలు తెలీవు ... ఆవేశం... ఆతృత...ఆకర్షణల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు... ఆలోచన తక్కువ... మంచి పుస్తకాలు చదివి వాటిని ఉత్తరాల ద్వార ఒకరికొకరు తెలియజేసుకొంటే ఆలోచన పరిజ్ఞానం పెరుగుతుంది అని నా అభిప్రాయం.. "
అంతే కదా మరి... చక్కటి సాహిత్య విలువలు కల పుస్తకాలు మన ఆత్మ వికాసానికి .. సోపానాలు..అలాగే భావపూరితమైన లేఖలు కూడా అంతే స్థానాన్ని పొందుతాయి..

5 comments:

 1. రమ గారు!

  ఈ ఒక్క టపా చాలు మీరేంటో తెలియడానికి, చాల బాగ చెప్పారు, Post Man ఔన్నిత్యం గురించి, నేను ఒకప్పుడు Post man కాని మేము మా ఉద్యోగం మేము చేసెవాళ్ళము. కాని మేము ఉత్తరాలు అందుకునేప్పుడు, మీరు చెప్పిన ఆ రసాస్వాదనలోనే వుండేవాళ్ళము, ఇచ్చెప్పుడు వుండే ఆనందంకన్న సమాచారం అందుకునేప్పుడు ఎక్కువ ఉద్వేగానికి గురి అయ్యేవాళ్ళము. థాంక్స్ మా గురించి మీ అమూల్యమైన కాలాన్ని వినియోగించినందుకు.

  నేను సాధారణంగా అందరి బ్లాగులు చదువుతూ వుంటాను, మాగురించి రాసిన మీది చదవడం ఇదే మొదటిసారి, మీ బ్లాగులో అన్నీ టపాలు చదివాను, కొన్ని చిచ్చు బుడ్డ్లు, కొన్ని సీమటపాకాయలు, ఇంకొన్ని తారాజువ్వలు, మొత్తానికి ఒకరకమైన భావోద్వేగానికి లోనయ్యాను, కొంచం వెరైటీ గా రాస్తారు. గుడ్ లక్

  ReplyDelete
 2. @Radhika gaaru: Thank u

  @ anomymous : Thaks a lot.. marosaari deepawali choosaanu mee vyaakyalo..

  ReplyDelete
 3. బాగా చెప్పారు. ఆర్.కే నారాయణ్ మాల్గుడీ డేస్ లో - పోస్ట్ మేన్ గురించిన మంచి కధ వుంది. ఇలానే, ఈ మధ్య నవతరంగం పోస్ట్ మేన్ ప్రధాన పాత్రగా తీసిన ఒక లఘు చిత్రానికి జాతీయ ఎవార్డు వచ్చింది. ఆ సినిమా అక్కడ చూసాను. చాలా నచ్చింది.

  కానీ పోస్ట్ మేన్ ఉనికి కోల్పోవడం ఇంకా జరగలేదనే చెప్పాలి. మా ఆఫీసు కి రెగ్యులర్ గా వచ్చే పోస్టు మేన్, ఇంటికి వచ్చే పోస్ట్ మేన్ - నా జీవితంలో ముఖ్యమైన పార్ట్ ఇంకానూ. నా లానే చాలా మందికి కూడా.

  ఈ మధ్య పోస్ట్ ఆఫీసు కి ఒక పార్సిల్ తీసుకోవడానికి వెళ్ళాను. మా ఇంటిదగ్గర పెద్ద సీన్ లేనట్టుండే పోస్ట్ ఆఫీసు ఎంత పెద్దదో - అక్కడ ఎందరు ఎంత వోల్యూం పని చేస్తున్నరో చూసి మతి పోయింది.

  ఇప్పుడు తపాలా శాఖ - చాలా విస్తృతమైన నెట్ వర్క్ తో పని చేస్తుంది అని చెప్పొచ్చు. ఇలాంటప్పుడు పోస్ట్ మేన్ significance కి ఢోకా లేదు ! s

  ReplyDelete
 4. ప్చ్...నిజమేనండీ ....

  ReplyDelete

Loading...