11.01.2010

కలలో తీసుకున్న వస్తువు కలలోనే తిరిగి ఎలా ఇవ్వడం? (ఒక తమాషా సంఘటన)

తమ్ముడి రెండో కొడుకు..సన్నీ మొన్న ఆగష్టుకి మూడేళ్ళు.... చాలా అల్లరి పిల్లాడు...  అని తెలుసు కాని, ఇలా ఎటూ ఏమి చెయ్యలేని పనులు అప్పజెప్పేంత అల్లరి పిల్లాడనుకోలేదు. ఎంత సరదాగా అడిగాడు మా బాబుని.. "నాకు కల్లోనే కావాలి"  అని .. మొదట్లో విషయం ఇదీ వదినా .... అంటే మాములుగా తీసుకున్నాను. కాని వాడు "నాకు కలలోనే కావాలి " అని ఏడుస్తుంటే భలే సరదా వేసింది. అసలు విషయం ఏంటంటే......

 మా బాబుకి మా సన్నీ కి అసలు పడదు పనిగట్టుకుని ఏడిపిస్తాడు మా బాబు ,... మళ్ళీ ఇద్దరు కలిసి అంత సఖ్యంగాను ఉంటారు. "వీళ్ళిద్దరికి క్షణం పడదు క్షణం వదిలి ఉండలేరొదినా"  అంటుంది మా మరదలు. 

మొన్న శుక్రవారం వెళ్ళాను పిల్లలిని చూద్దామని మా అమ్మవాళ్ళింటికి.. కుశల సమాచారాలు అయ్యాక.. "వీడేమి చేసాడో తెలుసా వదినా!"  ఈరోజు అని మరదలు చెప్పడం మొదలెట్టింది. ఎదో అల్లరి పనే అయి ఉంటుందని విన్నాను. "నిన్న పొద్దున్న వంట చేస్తున్నా....  చంక దిగడు... పాలిస్తానంటే ససేమిరా అంటాడు (వాడెంత ఏడ్చినా పాలా మాట ఎత్తితే ఠక్కున ఏడుపు ఆపేస్తాడు) ఎత్తుకునే వంట చేయాల్సి వచ్చింది. అక్కడికి చింటూ (మా బాబు) చాక్లేట్ కూడా తీసుకొచ్చాడు ఉహు..! అది కూడా వద్దని విసిరి కొట్టాడు.. ఏడుపు ఆపడానికి ఎంత మభ్యపెట్టాల్సి వచ్చిందో .."   ఇంతకీ ఏడుపు ఎందుకంటే.. "చింటూ కలలో నా చాక్లెట్ తీసుకున్నాడూ..." అనిట.. వాళ్ళిద్దరి రోజువారి పోట్లాట ఎదో కలగని ఉంటాడు. సరే ... అని మా బాబు అప్పటికప్పుడు చాక్లెట్ కొని ఇస్తే ... "నాకొద్దు కలలోనే కావాలి"  అని... దాదాపు రోజంతా  ఏడుపు... :)

ఫన్నీగా ఉంది కదా... ముందు మాములుగా విన్నా...  ఎందుకో వాడు కలలోనే కావాలి... అంటే అవునూ ఎలా? అని అలోచన వచ్చింది సరదాగా ఇలా మీతో పంచుకున్నా.. :) 
*******


4 comments:

 1. :)

  నేనయితే హిప్నటైజ్ చేసి కలలో ఇచ్చినట్లుగా ఇచ్చేసివుండేవాడిని. నాకు నిజంగానే హిప్నటిజం వచ్చు.

  ReplyDelete
 2. hehehe bagundi. choclate isthunna ani mi babu aa roju pade pade aa babu venta padithe a vishayam baga natukupoyi kachithamga kalalo vastadi emantaru?

  Sarath gud idea yaar :)

  ReplyDelete
 3. hha!hha!hha!
  Realy funny!
  పిల్లలు , తమవీ, అలాగే పెద్ద వాళ్ళుకు కలిగించే
  ధర్మ సందేహాలను .....
  అందులో సున్నిత హాస్యాన్ని ఎంజాయ్ చేసే మనసు ఉండాలి.
  సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete

Loading...