5.18.2009

భాషలో నుడికారాలు, జాతీయాలు...

బస్‌లో వెళ్తూ ఆలోచించాను. "గాజులు తొడుక్కోడం లేదా వేసుకోడం" అనే పదానికి అర్థం తెలియాలంటే, భాషలో నుడికారాలు, జాతీయాలు అని ఉంటాయి . వాటి సొగసు, వాడుక తెలిసిఉండాలన్నమాట అని.. ఇవన్నీ తెలుసుకొంటే మనము ఎదుటి వారు చెప్పే విషయాలని వాళ్ళ మనసులోకి చొచ్చుకుపోయి వారి ఆంతర్యాలని ఇట్టే ఆకళింపు చేసుకొగలమని .. నాలాంటి పామరురాలికి ఇదో కొత్త పాఠం ఈరోజు .

ఇలా ఆలోచిస్తున్న నాకు ముందు సీట్లోంచి మాటలు వినపడ్డాయి, ఎక్కడో విన్నట్లుగా ఉందే అని మనసు ఉండబట్టలేక లేచి మరీ ముందుకెళ్ళి చూసాను. మీకు తెలుసా ! వాళ్ళిద్దరూ మా స్కూల్ టీచర్లు. ఒక్కసారిగా ఎగిరిగంతెయ్యాలన్న ఆవేశం వచ్చిందంటే నమ్మండి. ఉన్నది బస్లో అని జ్ఞప్తికి రాగానే "వద్దులే " అనుకొని వాళ్ళకి ఎదురుగా సీట్‌లో కూర్చుని వాళ్ళని పలకరించాను. నన్ను చాలా సులువుగా గుర్తుపట్టడం వాళ్ళ గొప్పతనం. నా గురించి మొత్తం కాకపోయినా ఓ 10 యేళ్ళు వాళ్ళకి నేను తెలియడం అందులో నేను వారికి శిష్యురాలిని కావడం ఆ కాసేపు వాళ్ళ సమక్షంలో నేను చిన్నపిల్లని అయ్యాననే చెప్పాలి.

చదువుకొనే రోజులు అవి తలుచుకొంటూ ఉన్నట్టుండి .. అప్పట్లో నాకు గుర్తొచ్చిన ఒక అంశాన్ని కాస్త ఉడుక్కుంటూనే వాళ్ళని "ఏంటి టీచర్ అప్పుడలా చేశారు " అని అడిగితే.. "పిచ్చిదానా ఇంకా ఆ అలక పోయినట్లులేదే" అని మా టీచర్లు ఒక మొట్టికాయ వేసి మరి నా అలకని తీర్చారు. ఇంతకీ ఏంటా అంశం అంటారా? హు! భాషలో నుడికారాలు, జాతీయాలు అని ఉంటాయి. వాటి సొగసు, వాడుక తెలిసిన మహామహులకి పైన సంభాషణ బట్టి నేను అడిగింది ఇట్టే గ్రహించేయగల నైపుణ్యం ఉంటుంది , కాని నాలాంటి పామరులని దృష్టిలో పెట్టుకొని ఆ అంశం చెప్తున్నాను. "అవును టీచర్ మీరు ఎప్పుడు ముందు కూర్చున్న మా వైపు కాక వెనకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే ప్రశ్నలడగడం, వాళ్ళకే పాఠాలు చెప్తున్నట్లుగా అక్కడే నిలబడి చెప్పడం ఎందుకు చేశారు? మేమెవ్వరం మీ విధ్యార్థులం కాదా ? " అని అడిగాను.

అప్పుడు అందులో ఒక టీచర్ ఇలా చెప్పారు "మీరెలాగు తెలివైన వారు, సొంతంగా అన్నా వ్రాయగలరు పాపం వెనక ఉన్నవారిని మనం ప్రోత్సహించాలి, వాళ్ళు చూసి రాసే విధానాన్ని మానిపించాలి అంటే అలా వెనకాల వాళ్ళనే ప్రశ్నలు అడగాలి, వాళ్ళకే పాఠం చెప్తున్నామన్న భ్రమ కలిగించాలి" అని చెప్పారు.

నిజమే కదా! ఇదే బ్లాగులకి అన్వయించుకొంటే.....??? పిచ్చిదానిలా ఇందాక " పెద్దవారిని , పండితులని, ప్రముఖలని యావత్ బ్లాగ్లోకాన్ని అనవసరంగా నాకు వ్యాఖ్య వ్రాయాలి అనే ఉబలాటాన్ని అణగదొక్కెస్తున్నానేమో ...వ్యాఖ్యల అనుమతి పెట్టేద్దాము" అని అనుకొన్న నాకు జ్ఞానోదయం అయ్యింది. అందరూ ఇలా పేపర్ కట్టింగ్స్, సేకరణలు వ్రాసేవాళ్ళని ప్రోత్సహిస్తూ ..వారిని సొంతంగా వ్రాయించే దీక్ష
లో ఉన్నప్పుడు అనవసర దీక్షాభంగం కలిగించకూడదని నిశ్చయించేసుకొన్నాను. అవునూ... ఇలా నిశ్చయించుకొన్న తరువాత నాకో సందేహం వచ్చేసింది.. కూడలి అగ్రిగేటర్ కాని, గూగులమ్మ కాని తమ బ్లాగుల్లో వ్యాఖ్యల అనుమతి ఇవ్వని వారు ఏ బ్లాగు కాని, ఏ వ్యాఖ్య కాని చదవకూడదు అని వారి వారి నిర్దేశిక అంశాలలో ఎక్కడన్నా చెప్పారా? అలా చెప్పి ఉంటే మటుకు నాకు తెలియకుండానే నేను చెసిన తప్పు.. ఇంకొకరి బ్లాగులో వ్యాఖ్య చదవడం, నా బ్లాగులో వ్యాఖ్యలని విమర్శించడం. దయచేసి ఎవరన్నా తెలియజేస్తారు కదూ. "ఎక్కడ అని అడుగుతారేంటండి? మనసుంటే వ్యాఖ్యలకి మార్గాలనేకం, మన బ్లాగుల్లో ప్రముఖులు.... విశాల హృదయులు ఉన్నారు, క్షమించండి అనేస్తే చాలదూ.. "

ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాను. కొత్తపాళీ గారు సహృదయంతో నా పోస్ట్‌కి జ్యోతిగారి బ్లాగులో ప్రతిస్పందిచారు. అందుకు ముందుగా కొత్తపాళీ గారికి విధేయతతో ధన్యవాదాలు. గడ్డిపోచ అనో, గంజాయి మొక్క అనో పీకి /ఏకి పారేస్తారనుకొన్నాను. కాని చిన్నపాటి విలువ ఇచ్చినందుకు కృతజ్ఞురాల్ని. వ్యాఖ్యల అనుమతికి.. పైన చెప్పిన సంఘటనే నా సమాధానం. ఇహ "తమబ్లాగులో ఇతరులు వ్యాఖ్య పెట్టకుండా చేసిన వారు పనిగట్టుకుని ఎవరో ఎక్కడో రాసిన వ్యాఖ్యల్ని గురించి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది." పెద్దవారు మీకు విడ్డూరం కలిగించింది అంటే నిజంగా చెప్పుకోతగ్గ విషయమే. మిమ్మల్ని వి
డ్డూరపరచగల గొప్పతనం నాది అని చెప్పుకోవచ్చన్నమాట. :) "పనిగట్టుకొని ఎవరో ఎక్కడో రాసిన వ్యాఖ్యల్ని..... " మిమ్మల్ని కూడా వేడుకొంటున్నాను. నా బ్లాగులో వ్యాఖ్యలు లేకపోతే.. ఏ బ్లాగులు చదవకూడదని ఎక్కడన్నా.....?? మరోలా భావించక శ్రమ అనుకోక వీలు చూసుకొని/చేసుకొని తెలియజేస్తారు కదూ...

"తెనాలి రామకృష్ణ సినిమాలో "తెలియనివన్ని తప్పులని సభాంతరమ్మునన్ పలుకగరాదు ..." అనే పద్యం గుర్తొచ్చింది నాకైతే మీ వ్యాఖ్యానం చదివి." అవును ఇది నేను అనుకొన్నదే... మీకు ఆయనే .. ఆ పద్యమే గుర్తు రావాలి. ఎందుకంటే "మనకెందుకులే అని అనుకోకుండా... సంఘటితమైన శక్తితో సహాయం చెయ్యగలిగిన చేతులివి అని సగర్వంగా నిరూపిస్తున్నారు. మీ సభ్యులందర్నీ మనసారా అభినందిస్తున్నాను..... " అని మాములుగా వ్రాస్తే మీరు కొత్తపాళీ గారెందుకవుతారు? మహా మహా పండితులనే అర్థం లేని భాషలో "తోక మేక మేక తోక తోకకొక మేక " అంటూ అవతలి వాళ్ళని బురిడి కొట్టించామనుకోకపోతే ఆయన రామలింగడెందుకవుతారు?

సుమమాలగారూ, నేను ఆడవారిని కానీ వారు వేసుకునే గాజుల్ని కానీ ఆ గాజులు తొడుక్కునే వారి చేతుల్ని కానీ ఏమీ కించ పరచలేదు... నెనర్లు ... మీరలా కించపరచకూడదనే నేను అంత పొడుగు వ్యాఖ్యానం నా బ్లాగులో వ్రాసింది.
******

No comments:

Post a Comment

Loading...