5.19.2009

అలిగిన వేళలో చూడాలి.........


మోహన మురళీ గానము వినగా .....
తహ తహ లాడుతు తరుణులు రాగా....
దృష్టి తగులునని దడిసి యశోదా...
దృష్టి తగులునని దడిసి యశోదా.....
తనను చాటుగా దాచినందుకే ...
అలిగిన వేళలో చూడాలి......... గోకుల కృష్ణుని అందాలూ....

ఇలా తల్లి యశోధ తన కొడుకిని లాలించి మురిపెంగా అలకని తీరుస్తుంది పాట వరకు అర్థం అది కాని , ఈ పాటకి సినిమాలో సన్నివేశం అయితే, హీరో బార్య తనింటికి వచ్చాక తనని పట్టించుకోడం లేదు ఎంతసేపూ... మామగారు.. పనివాళ్ళు ... అంటూ తనని నిర్లక్ష్యం చేస్తోందని చిలిపిగా అలుగుతాడు. అప్పుడు బార్య పాడే పాట అది.. అందమైన మధురమైన భావన అది ముసి ముసి నవ్వుల వెనక ఉన్న తాటాకు మంట ఆ అలక.

అలాగే బార్య అలిగితే .. అలిగితివా సఖీ ప్రియా అలక మానవా.. నీవలిగితే నే తాళజాల అని బార్యని ప్రసన్నం చేసుకొంటాడు భర్త. అలుకమానవే చిలుకల కొలికిరు తలుపు తీయవే అని.. ప్రాధేయపడడం భలె సరదాగా ఉంటుంది.

మరి బార్య భర్తల మధ్య జరిగే ఈ అలకలు, కోపాల తీర్పులు .. అవి.. స్నేహితుల మధ్య ఎలా ఉంటాయి అని ఆలోచించాను.

ఇప్పటి కుఱ్ఱకారయితే "లైట్" తీసుకో అని ఎదుటివారి కోపాన్ని, వారిలో కలిగే బాధని తగ్గించే ప్రయత్నంలో వాళ్ళు దానిని లైట్ తీసుకొంటూ ఓదారుస్తారు. "ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు, నవ్వితే ప్రాణమైన ఇచ్చేస్తానంటాడు అచ్చమైన స్వఛ్చమైన స్నేహితుడు. మరి అంత మంచి స్నేహితులెవరున్నారు? మనం నవ్వితే ప్రాణం పెట్టగల స్నేహితులు లేరు కాని, బాధ కలగకుండానే "లైట్" తీసుకో అని, అవతలివాళ్ళకి నేను బాధ పడాలి కామోసూ .. లేకపోతే బాగోదు అని అనుకొనేట్టుగా ఉంటాయి కొంతమంది ఓదార్పులు.
*****

నేను కంప్యూటర్ కోర్స్ చేసేప్పుడు నాకు ఇంకో అమ్మాయికి మధ్య పోటి చాలా తీవ్రతరంగా ఉండేది. మా ఇద్దరికి ఇంకో కోర్స్ చేస్తున్న ఒక సీనియర్ స్నేహితురాలు ఉండేది.
ఆమె ప్రోత్సాహం కూడా మా ఇద్దరి పోటి స్థాయిలోనే ఉండేది. ఎలాగాయినా నువ్వే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అని నాకు ఆమెకి కూడా చెప్తూ ఉండేది. సో, ఆమెకి ఎవరు గెలిచినా పర్వాలేదు. ఇద్దరికి ఆమె ప్రోత్సాహం ఉంది కాబట్టి. అనుకొన్నట్లుగానే పరీక్షలు మొదలయ్యాయి. ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పింది మా శ్రేయోభిలాషి అయిన ఆ స్నేహితురాలు.

ప్రాక్టికల్స్ కాబట్టి వెంటనే మాకు ఫలితాలు చెప్పేస్తారు. పరీక్ష రాసి వచ్చేప్పుడు పోటిపడ్డ అమ్మాయికన్నా నాకు ఒక్క మార్క్ తక్కువ వచ్చింది. .. నిజానికి ఇక్కడ బాధ పడాల్సిందంటూ ఏమి లేదు కాబట్టి మరీ అంత బాధ లేదు. నేను కష్టపడలేదు అనుకొన్నా అంతే, మా స్నేహితురాలు మటుకు నేనేమన్నా బాధ పడిపోతున్నానేమో అని అనేసుకొని, నన్ను ఓదార్చే ప్రయత్నంలో కొంచం తిక్క
తిక్కగా మాట్లాడింది. నిజానికి లేని బాధని కొని తెచ్చుకోవాలేమో అనిపించింది నాకు ఆమె మాటలు వింటుంటే . ఆమె అన్న మాటలు.. మీరు చూడండి.

" లైట్ తీసుకోవోయ్! బస్ ఇంకో గంట లో వస్తుంది, అదిగో చూడు ఆ వస్తున్నామేని 89 .... 90 యేళ్ళు ఉండవూ.. ఎలా వడి వడి గా వస్తోందో, అంత వయసు అనిపించడంలేదు కదా.. ఈ ఏడు మా అమ్మ ఆవకాయ పెడ్తుందో పెట్టదో, అవునూ అన్నయ్యకి పెళ్ళి చేద్దామనుకొంటున్నారు. మా వదిన తెలుగు సినిమాలు చూడదట, ఇంగ్లీషు అంటే ప్రాణం అట. రాత్రెందుకో అస్సలు నిద్ర పట్టడం లేదోయ్!.. నువ్వు మటుకు లైట్ తీసుకోవోయ్!.. "

ఇలా ఉంది. ఈమె సమయస్ఫూర్తో, నా తలరాతో కాని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని అనుభవం పాఠాలు నేర్పేస్తొంది. బాధ కలగడాలు , బాధ పోవడాలు కాదు కాని వెఱ్ఱినవ్వు వచ్చేస్తోంది. మనలో మన మాట .... మాటల కిటుకంటారా దీనిని. ..నిజానికి అలకలు , బాధలు, కోపాలు, తీర్చడం ఒక కళే కదూ .. లేని వాటిని కాదు సుమా.. ఉన్నవాటినే.. ప్చ్ ! లైట్ తీసుకొండి... కొన్ని మాలాంటి అర్థం కాని జీవితాలింతే.
*****

No comments:

Post a Comment

Loading...