11.16.2009

మ..మ్మ....మాస్.....మౌంట్ ఒపేరా..

మొత్తం మీరే చేశారు గోపాల్ .. ఇంక చాలు.. మీరు మాకు వినిపించిన పాటలు ఇంక చాలు. మీవల్ల మా ఈ ట్రిప్‌లోని సంతోషాన్ని కోల్పోపోయేలా చేయకండి.

గోపాల్ : నావల్లా? నా వల్ల...ఏమి జరిగింది?

"ఇంకా అర్థం కాలేదా మీకు?? ..ఈ బస్ లో ఎక్కక ముందు మాలో ఉండేది..ఇప్పుడు లేనిది..."ఉత్సాహం " ... చిన్న చిన్న పాటల మాట్లల్లో కూడా " ఉత్సాహం" కోల్పోయాము , మీ వల్ల..... పాటలు మీరే సెట్ చేస్తారు..ఈ పాటలు చాలా బాగుంటాయీని అని మీరే మమ్మల్ని కన్విన్స్ చేస్తారు.. మాకు ఎలా ఉంటుందో తెలుసా.... "ఆ CD విరక్కొట్టి "మాకు కావాల్సినవి ఇవి కాదు" అని అరవాలనిపిస్తుంది. ..పాటలు వినండి అంటారు .. మేము ఏదో విందామని అనుకొని వస్తాము , మీరు మమ్మల్ని విననివ్వరు. మీరందరూ మమ్మల్ని కన్విన్స్ చేయాలనుకొంటారు. పాటలు మంచివి పెట్టరు.

ఏపాట మేము వినాలో కూడా మేరే చెప్తే, మేము ఎందుకు ఇక? చివరికి మేము ఎఏ పాటలకి డాన్స్ చేయాలో ...ఏం వినాలో .. కూడా మీరే చెప్తే మేము ఎలా ఎంజాయ్ చేయము?

సిడి ప్లేయర్‌ని సెట్ చేసి, చెత్త పాటలెలా పెట్టి , మమ్మల్ని బాధ పెట్టాలో మీకు తెలుసు .. ఆ పాటలు విని , ఎంత బాధ పడ్తున్నామో మాకు తెలుసు.. అంతా మీరే చేశారు గోపాల్..... అంతా మీరే చేశారు. "

"సరే ..సరే.. !!! మీకెమి పాటలు కావాలి సెట్ చేస్తాను... సిడిలు దొరకడం లేవసలిక్కడ.... "

అందరూ కొరస్‌గా .... "మమ్మ....మాస్.,,, బాబూ!!!... ఇక్కడ ఇప్పుడు క్లాస్ కుదరదూ...ఈ టైం లో మేమంతా మాస్"
*******

"అ .. అంటే .... అమలాపురం ... ఆ... అంటే ఆహాపురం..."

అదీ లెక్క.. కొంచం బీటు మార్చండిరా బాబు... ..

బస్‌లో చిన్న పెద్ద అందరూ ఒక్కసారి లేచి స్టెప్పులే స్టెప్పులు..ఇలా.....


*******


ఏంటిదంతా అనుకొంటున్నారా? ఆదివారం అలా మేమంతా కలిసి జాలీగా వనభోజనాలనుకొని.. మౌంట్ ఒపేరాలో హోటల్ భొజనాలు చేసి సందడి...సందడి చేసినవేళా.... ఆ గోల .. ఇదిగో ఆనంద హేల ....


ఒక వారం ముందు, ఈ కార్తీకమాసం వనభోజనాలు కుదరేదేమో ఎక్కడా తెలిసినవాళ్ళేవరూ ఎవరు ఉలకడంలేదు - పలకడంలేదు అని అనుకొంటూ....అసలు ఆఫీసులో మాట కదుపుదామని మాములుగా అన్నా! ఎవరితోనో గుర్తులేదు.. అంతే ఆరోజు సాయంత్రానికే ఎక్కడికి వెళ్దాము ఎవరెవరు ఏమేమి తీసుకొని వెళ్దాము అన్న ఎజెండా ఒకటి తయారుచేసేసుకొని, మీటింగ్ పెట్టేసారు. రాజు తలచుకొంటే దెబ్బలకి కొదవా.. అన్నట్లు రమణి తలుచుకొంటే.... :) సరే.. మీటింగ్లో అనుకొన్నది "నాగార్జున సాగర్" అని తలా ఒకళ్ళు తలా ఒక వంటకం తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయించేసుకొన్నాము. చివరాఖరికి అంతదూరం ప్రయాణంలోనే అలసిపోతామేమో అక్కడికి వెళ్ళి ఏమాటలు ఆడతామని అనేసుకొని, ప్రోగ్రాం రెండురోజుల ముందే మార్చేసాము "మౌంట్ ఒపేరా" అని. మగధీర షూటింగ్ హడావిడి మాదే కాబట్టి, వెంటనే ఆ టీం వాళ్ళని బస్ పంపమంటే సరే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు అలా బస్ వచ్చేసింది.





అసలెప్పుడు చేరుకొన్నామో, అప్పుడే వచ్చెసిందా అన్నంతగా అరుపులు డాన్సులతో సందడి చేసేసాము ఆ బస్‌లో. ఇక్కడెంత సందడిగా చేసామో అక్కడ అల్లరి అలాగే చేసాము. ప్రతిచోటా ఆనందం ఎలా ఉంటుందో వెన్నంటి ఎదో ఒక చికాకు వ్యవహారం కూడా ఉంటుంది అన్నట్లుగా ... మౌంట్ ఒపేరాలో భోజనాలు అస్సలు బాలేదు ముఖ్యంగా శాఖాహారులకి ప్రత్యేకంగా వేరే లోటస్ room అని చెప్పి ఏర్పాటు చేసారు. చప్పగా ఏదో చేసామంటే చేసామన్నట్లు ఉన్నా , ఆ భోజనాలు తినాలంటే నిజంగా మనకి ఇంటినుండి తెచ్చుకొనే సదుపాయం ఉంటే బాగుండును అని అనిపించక మానదు. అస్సలు రుచించని , జీర్ణించుకోలేని విషయం అక్కడ అదొక్కటే. ఈ భోజనం విషయం పక్కన పెడితే మేము మా కుటుంబాలు సంతోషంగా ఈతకొలనులో కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయాము. అలాంటి మరికొన్ని కార్తీకమాస హోటల్ భోజనాల గోల... ఆ ఆనంద హేల ..ఆ వేళా.... మరికొన్ని మీకోసమిలా..



*******

11 comments:

  1. అమ్మా! నీ క్రియేటివిటీకి నా సెల్యూట్. మనమెలా గోల చేసామో మమ్మ.. మాస్‌గా చెప్పావు.

    ReplyDelete
  2. ఇంతకీ ఇందులో మీరెక్కడ?

    ReplyDelete
  3. మొత్తానికి బాగా ఎంజాయ్ చేసారన్నమాట!

    ReplyDelete
  4. Marichipolani madhuranibootulani malli malli gurthuchesi ma madilanu kadilinchina ma manchi madamki ma danya vadalu
    jyothi

    ReplyDelete
  5. రమని గారికి శుభాబి వందనములు. మీరు వ్రాసిన ఈ శీర్షిక మా అందరినీ ఆకర్షింపచేస్తుంది. ఆది నుండి అంతం వరకు సమయం అసలుతెలియలేదు. మీరు కల్పించిన ఈ అవకశం మేమందరం ఏప్పటికి మర్చిఫొలెము.ఇవి మా తిపి ఘ్నపకాలు.ధన్యవదములు!!!!

    ReplyDelete
  6. మౌని: :) థాంక్స్‌రా..
    బా. రా. రె. గారు: :) ఎక్కడ ఉండి ఉంటానంటారు? ;)
    శ్రీకాంత్ గారు : :) థాంక్స్
    శివ గారు: అవునండీ!!!!
    జ్యోతి: :) థాంక్స్... "అంతా మీరే చేసారు గోపాల్ గారు" అని చివర్లో మీరన్న మాటే నా ఈ పోస్ట్‌కి ఒక ఐడియా ఇచ్చింది.
    గోపాల్ గారు : తెలుగు రాయడానికి అతికష్టం మీద ప్రయత్నించినట్లున్నారు. అభినందనలు.. ప్రయత్నించండి ఇలాగే తొందరలో నిష్ణాతులు అవుతారు రాయడంలో, అలా సిడిలు మార్చడంలో.

    ReplyDelete
  7. Good one, and Thanks for the wishes by the way

    ReplyDelete
  8. 'బొమ్మరిల్లు' డైలాగుతో మొదలు పెట్టి మౌంట్ ఒపేరా కి తీసుకెళ్ళి పోయారు మమ్మల్ని.. అక్కడి ఫుడ్ బాగుండదని గతంలో కూడా విన్నానండి.. కొన్ని కావాలంటే కొన్ని త్యాగాలు తప్పవేమో...

    ReplyDelete
  9. అన్నట్టు మీకు నచ్చిన పాటలో నా పేరు పదే పదే చదువుకోవడం భలేగా ఉంది:):).. నాక్కూడా ఇష్టమైన పాట..

    ReplyDelete
  10. రౌడీగారు: థాంక్స్.. :)

    మురళీ గారు :కొన్ని పొందాలంటే ఇలాంటి త్యాగాలు తప్పవు..:) మనకి నచ్చిన పాట.. :)..... థాంక్స్ అండి...

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...