12.28.2009

29/12/2009

పొద్దున్నే ఎందుకో కోపం వచ్చింది, ఎంత లేపినా నిద్ర లేవరు.. సెలవలొస్తే అదేపనిగా లేపాలి పిల్లలిని అని, పాప లేవగానే టి వి పెట్టింది. 10 వ తరగతి , నాకేమో భయం ఎక్కడ పర్సెంటేజ్ తగ్గుతుందో.... పిల్ల అసలు చదవడంలేదు అని ... అందుకే అన్నాను "చదువుకోమ్మా! పరీక్షలు దగ్గిర పడ్తున్నాయి" కొంచం గట్టిగానే అన్నాను. "నీకు నా మీద అంత అపనమ్మకమేమిటమ్మా నేను పాస్ అవనని " అని అడిగింది :-) . ఏమి చెప్పను పిల్లలికి... అపనమ్మకం కాదు, పాపమీద నమ్మకమే నాకు, కాని మీడియా ప్రభావం పిల్లలమీద పడకూడదు అన్న ఆలోచన, దారి తప్పుతారేమో చదువులు మానేసి అని... ఇదంతా పక్కన పెడితే, అర్థ సంవత్సర పరీక్షలప్పుడు బాబుని ఎదో పరీక్షకి తెల్లవారుఝామున నిద్ర లేపలేదని "రాత్రి అన్ని చదువుకోలేదు ... ఇప్పుడు గంటలో నేనేమి చదువుతాను " అని ఏడ్చేసాడు, "పోనిలే నాన్నా మార్క్స్ తగ్గితే నేనేమి అనను... సరేనా నీకు వచ్చిందే రాయి ఏడవకు" అని సముదాయిస్తే , వాడు ఒక్కసారిగా "నేను పరీక్ష రాసేది నీకోసం కాదమ్మా నాకు నాలెడ్జ్ రావాలని కదా" అని అన్నాడు.. పాపేమో , నీకు నమ్మకం లేదా.... బాబేమో నీకోసం కాదమ్మా పిల్లల ఆలోచనలని ఏవిధంగా అర్థం చేసుకోవాలో కదా..

ఆ మధ్య ఓ వెబ్ పత్రికకి ఒక కథ పంపాను నిన్నే తిరిగి వచ్చేసింది కథ కథలా కనిపించడంలేదు అందులోని పాత్ర వేదన కనిపిస్తోంది అని ఒక స్నేహితురాలి కామెంట్.. కథ కథలా ఉండాల ? వేదన ఉంది కాబట్టే అది కథ అయ్యింది కదా ఏమో! బాధ పడ్డానా? నిజానికి కొంచం బాధ కలిగిన మాట వాస్తవమే.. కాని అన్వర్ గారి బ్లాగులో చూసిన పచ్చనాకు సాక్షిగా.. శ్రీ ఆర్ ఎం ఉమామహేశ్వరరావు గారు రాసిన తిమురుబట్టిన నామిని కత చదివి బాధనుండి ఉపశమనం కలిగింది. అన్నిటికన్నా బాధ.. పంపే ముందూ "బాగుంది వెబ్ పత్రిక కన్నా పర్లేదు .. ప్రింట్ పత్రిక కన్నా పర్లేదు.... పంపమని " చెప్పిన స్నేహితురాలు తిరిగొచ్చినతరువాత "నాకూ నచ్చలేదు" అనడం ఎక్కడో తగిలినట్లుగా అనిపించింది. వస్త్రధారణ విషయంలో ఇంట్లో వాళ్ళు బాగుందో బాలేదొ చెప్తే బయట ఎవరో అనామకుల చేత బాలేదు అనిపించుకొనే అవకాశం ఉండదు కదా .. అలాగే స్నేహితులు మన ప్రవర్తనో, కథలో, రచనలో ముందే చెప్పెస్తే ఇంకొకరికి అవకాశం ఇవ్వము కదా... ఎప్పటికి అర్థం చేసుకుంటారో ఈ స్నేహితులు... నా మనసులో మటుకు కథ ఇప్పటికి బాగుందన్న భావన ఉంది. అందులో యధార్థం ఉంది.. నిజం నిష్టూరం అంటారుగా అందుకే ప్రచురణకి నోచుకోలేదేమో .. :-)

అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేనవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని..
*****

4 comments:

 1. అచ్చులో పడలేదని బాధ పడకుండా .. ఆ కథేదో మా మొహాన కొట్టొచ్చుగా :-) మేమూ చదివి పొగట్టమో, పొగబెట్టటమో చేస్తాం.

  ReplyDelete
 2. సాహిత్యం పై అవగాహన ఉండి, మొహమాటాలకు పోకుండా సద్విమర్శ చేసే వేరే స్నేహితులకు చూపి మీకు ఉచితమనిపించిన కొన్ని మార్పులు చేసి మరలా ప్రయత్నించండి. వెబ్ పత్రికలకు కొదవా.. All the best.

  ReplyDelete
 3. అబ్రకదబ్ర గారు: :-)

  వేణూ శ్రీకాంత్ గారు: Thank you

  ReplyDelete
 4. మంచి రచయితల కథలు కొన్ని మొదట్లో తిరిగొచ్చినవేనండీ! మీ కథ ముందు మీకు నచ్చాలి! నచ్చింది కదా!
  మరో పత్రిక్కి పంపండి. అక్కడ సూపర్ హిట్ కాదని ఏముంది?

  ReplyDelete

Loading...