3.27.2011

బజ్జుకి దూరంగా....

బజ్‌లో చెప్పారు కదా మళ్ళీ ఇక్కడెందుకు? అని మీరడగచ్చు. ఎదో నాకు తెలిసింది మీకు చెప్పాలి అని.. మీకు తెలియంది కాదు ..  తెలీదని కూడా కాదు. నాక్కూడా తెలిసిపోయింది  చూశారా అని చెప్పడమన్నమాట. :-)
******
మా స్కూల్ రోజుల్లో ఇంటి దగ్గరే స్కూల్ అవడంవల్ల అమ్మ మధ్యాహ్నం ఇంటికే వచ్చేయమనేది భోజనానికి. మాకేమో అందరిల్లా బాక్సులు తీసుకెళ్ళి అలా కబుర్లు చెప్పుకుంటూ గ్రూప్‌గా తినడం ఇష్టం.. "ఏమి సరిపోతుందే వట్టి కూరముక్కల అన్నం, ఇంటికోస్తే పప్పు, కూర, పచ్చడి అన్నీ తినచ్చు అన్ని రుచులు తెలియాలంటే చక్కగా ఇంటికొచ్చి నాలుగు పధార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. రేపొద్దున్న ఈ బాక్సుల గోల అయితే ఒక పచ్చడితోనో, ఒక పప్పుతోనో సరిపెట్టేసుకుంటారు. ఇంటికొచ్చి పెట్టింది తినండి"  అని గదమాయించేది కాని, పొరపాటున కూడా లంచ్ బాక్స్ అన్న మాట లేదు.... ఆ అనుభవమూ లేదు. ఉస్సూరుమంటూ ఇంటికి రావడం తప్ప.

ఏమాట కా మాట చెప్పుకోవాలి ఇంటికి రాగానే.. వేడి వేడిగా అన్నం, కూరలు పప్పు అంటూ ఎంత ప్రేమగా వడ్డించేదో అంత ఇష్టంగా  తినేవాళ్ళము. ఒక్క ఎమెస్కో వాళ్ళు పుస్తకాల వరద కురిపించేదాక.... అదిగో ఆ పుస్తకాలు నవలలు ఇంటికొచ్చాక తెలిసింది ఆకలి బాధ ఎంటో..  అంతకు ముందు అమ్మ పెట్టిన కూరలు వగైరా గాలికెగిరిపోయాయి.. ఆకలి ముందు అవెంత? మొన్న మొన్నటిదాకా అన్నయ్య, అక్కా,నేను తమ్ముడు కలిసినప్పుడు "అమ్మ అసలు వంట కూడా చేయకుండా ఎలా నవలలు చదివేది కదా" అని.. మా అమ్మ మహా అయితే రెండుసార్లు పోని మూడు సార్లనుకుంటా పుస్తకాలు పట్టుకుని, టైం చూడకుండా వంట మర్చిపోయింది. తరువాత అంటే మేము లంచ్ కని ఇంటికెళ్ళగానే "అయ్యో అప్పుడే 12.30 అయ్యిందే.. చూసుకోలేదమ్మా.." అంటూ అప్పటికప్పుడు తొందరగా అయ్యే టిఫిన్ ఎదో చేసేసి పంపించేది.
******
ఎదో ఒకటిరెండుసార్లు మర్చిపోయినందుకు మొన్నటిదాక చెప్పుకున్నాము, చేసినవన్నీ మర్చిపోయి.. అదే జరగబోయింది (జరుగుతుందేమో కూడా భవిష్యత్తులో) జనవరి, ఫిబ్రవరి దాకా అసలు ఈ బజ్ ఏంటో అంతగా తెలీదు, నాకు తెలియకుండా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు లేదా.. నేను ఫాలో అయ్యే బజ్‌లు చదువుతూ కాలక్షేపం చేసేదాన్ని.. నాకు సమయం ఉన్నప్పుడు మాత్రమే.. ఇదిగో ఈ మార్చ్ లో కాస్త బజ్ అంటే ఎంటో తెలిసింది.. ఇంకో నలుగుర్ని ఫాలో అయ్యాను. కాసేపలా కబుర్లు అనుకున్నా.. ఆ కాసేపు కాస్తా రాత్రి 12 అయ్యేది. అమ్మో!  అనుకున్నా  ఒకరోజు, పర్లేదులే రెపిలా చేయకూడదు అనుకున్నా, రెండోరోజు మళ్ళీ టైం చూసుకోలేదు.. సమస్య టైం లో కాదు, పిల్లలు పడుకున్నారులే అనుకుని కబుర్లు చెప్పుకుంటున్న నేను.. ఇద్దరు పడుకున్నారేమో చూద్దామని,  ఇంకో గదిలోకి వెళ్ళేసరికి మా పాప బాబుతో "అమ్మ చాలా మారిపోయింది కదరా.. మనం సెల్ ముట్టుకుంటే తిడుతోంది కాని, తను మటుకు కంప్యూటర్ ముందే కూర్చుంటోంది. మనతో మాట్లాడడం తగ్గించేసింది " అని.. 

విని నేను షాక్.. వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయని. సాధారణంగా వాళ్ళకి నేను దొరకను, అలాంటిది కేవలం బజ్ ల వల్ల నేను ఇలా.. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ ప్రేమ మాటలు, వాళ్ళ ఆటలు నేను చూసేది. రేపొద్దున్న వాళ్ళకంటూ వాళ్ళ జీవితాలు వచ్చాక.. ఇలా మాట్లాడగలరా, హోదా.. గౌరవం.. కుటుంబం అన్నీ చూసుకుంటారు ఉన్న ఈ కాస్త సమయాన్ని బజ్తో కాలక్షేపం చేసేస్తున్నాను. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇంక నాకు వేరే పనంటూ ఏముంది.. అప్పుడు ఈ కంప్యూటర్ , ఈ సాంకేతికం ఎక్కడికి వెళ్ళదు.. అదే అనిపించింది.. అందుకే బజ్ కి దూరంగా నా బుజ్జాయిలకి దగ్గరగా ఉందామని నిర్ణయించేసుకున్నా..   

ఈ బజ్ ఒక చాట్ రూం లాంటికి ఒక్కోసారి ఎవరేమి మాట్లాడుకుంటున్నారో అర్థం కాదు. అర్థం చేసుకుని రిప్లై ఇచ్చేసరికి మనకి పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది... ఇంకోటి మొహమాటం.. ఇలా గ్రూప్ చర్చల్లో ముఖ్యమయినది ఏమి లేకపోయినా మనమేమనుకుంటామో అని అవతలి వాళ్ళు, వాళ్ళు హర్ట్ అవుతారేమో అని మనం కాలాయాపన చేస్తూ ఉంటాము మా విషయంలో అదే జరిగింది.. ఎదో పాట గురించి నేను పద్మగారు చర్చించుకుంటూ ఉండగా కుమార్ గారు మౌనంగా వీక్షించారు. చివర్లో మేమిద్దరం పని ఉంది అంటూ బై చెప్పుకున్నప్పుడు.. కుమార్ గారు : "నేను ఇందాకే వెళ్ళాల్సినవాడిని, పని ఉంది కాని మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ "వెళ్తున్నా" కఛ్చితంగా చెప్పలేక ఆగిపోయా" అని అనేసరికి మనసులో చిన్న కదలిక.. ఇలాంటి మొహమాటాలా .. అని.
******
ఇక చివర్లో నా ఆఖరి బజ్ కి వచ్చిన కమెంట్స్ కి రిప్లై ఇవ్వాలనుకుంటున్నా.. బ్లాగు ఇబ్బంది లేదు మనకి కావాల్సినప్పుడు కమెంట్స్ చదుకోవచ్చు రాసుకోవచ్చు.. అందుకని బ్లాగుకి దూరం కాను.. 


పద్మగారు: తగదు తగదంచూ ముందరికాళ్ళకి బంధం వేయకుమా.. ఇద్దరు పిల్లల తల్లిని, పిల్లలకోసం త్యాగం తప్పదు సుమా..
సుధగారు: "అండగా మలక్కు??"  నాకర్థం కాలేదండి ఈ కమెంట్.. ఎవరికో భయపడో బాధపడో బజ్ వదిలేస్తాను అనలేదు. పిల్లలికి దూరమవుతున్నాను. ఇప్పుడే వాళ్ళ ఫీలింగ్స్ పంచుకొనే టైం నాకు. :-)
వేణుగారు: థాంక్స్ అండీ ఇది చదివితే మీరా మాట అనరని నాకు తెలుసు.. :-)
కుమార్ గారు, శ్రావ్య గారు : థాంక్ యూ.. బ్లాగ్ కూడా ఎందుకండి మనకి వచ్చే భావనని పంచుకోడానికో మన తెలుగు మెరుగు పరుచుకోడానికో ఒక డైరి లాగా బ్లాగు రాసుకోడం తప్పు కాదని నా అభిప్రాయం. డైరి అంటే ఎవరు చదవరు.. బ్లాగయితే చదివి అభిప్రాయాలో విమర్శలో వస్తాయి.. తద్వారా మన భాష మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది కదా.. గొడవలు పక్కన పెడితే (ఎప్పుడు పక్కనే పెడ్తాను పెద్దగా పట్టించుకోను ;-) )
సుధ గారు: ఉపయోగపడేవి ఉన్నాయి మాట్లాడుకోవచ్చు చర్చించుకోవచ్చు.. అంతకన్నా  ఉపయోగం .. నేను నా పిల్లల దగ్గర ఉండడం కదండి.. .. 

ఇక పోతే ఈ విషయమై నాకొచ్చిన మెయిల్:

You will say that you will walk out from BUZZ and suddenly we will find you back soon---- Recalling one of your posts about comments in blogs where you have disabled commenting and finally enabled it...... The same thing will happens again as HISTORY REPEATS :) :) :)  So keep buzzing!!!!

చాలా థాంక్స్ అండీ!!!!  మీ అభిమానానికి, నేనెప్పుడు ఏమి చేశానో గుర్తు పెట్టుకున్నందుకు.. బ్లాగులో కమెంట్స్ రాయకుండా నిరోధించినది అప్పట్లో జరిగిన బ్లాగర్ల వ్యక్తిగత దాడులు.. ప్రతీ విషయాన్ని పొడిగించడం ఇష్టం లేక.. నా పరిధిలో నేనుండాలని.. తగ్గిన తరువాత కమెంట్స్‌కి  మళ్ళీ అనుమతి ఇచ్చాను. అది గుర్తుపెట్టుకుని బ్లాగు కి బజ్ కి లంకే పెట్టి .. ఎళ్ళెళ్ళవమ్మా! , నీ సంగతి తెలీదా.. మళ్ళీ ఎలాగు బజ్ ఓపెన్ చేస్తావు" అంటే   .. 

చిరునవ్వే సమాధానం.. థాక్స్ ఫర్ యువర్ అడ్వైస్.  

9 comments:

  1. వదిలేయడానికి సరైన కారణం కనిపించింది.
    I welcome your decision to leave buzz :)

    ReplyDelete
  2. $రమణి గారు
    మంచి నిర్ణయం! నేను కూడా మీ బాటలోనే... అయితే పూర్తిగా కాకుండా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే బజ్జేట్లు ప్రయత్నిస్తా.

    .........................
    "Reactions" విభాగం అన్ని రకాలకి ఒక చెక్బాక్స్ మాత్రమే చూపిస్తుంది. గమనించగలరు.

    ReplyDelete
  3. అయ్యయ్యో అక్కడే ఆగిపోతున్నారా? ఏమిటో ఫ్యామిలీ కోసం పర్సనల్ లైఫ్ ని త్యాగం చేసే చాంధసవాదులు మీరు.

    ReplyDelete
  4. రమణిగారూ,
    మీరు బజ్ పరమబోర్ గా,డల్ గా ఉంది అని రాసారు. అక్కడ పద్మగారు...తగదిదితగదిది...లైన్ రాసేరు కదా. దానికి వెంటనే వచ్చేలైన్..అండగా మదనుడుండగా..అని వస్తుంది.అందుకని ఆ పదం వాడాను. రౌడీ(మలక్)గారు ఏదో ఒక సందడి చేస్తూ,మీ బోర్ ని తగ్గిస్తారు అనే ఉద్దేశంతోనే అలా ఆ పదం వాడాను. కాని,మీకు భయమో,బాధోకలిగి వెళ్తుంటే ఆయన మీకు అండ అనే ఉద్దేశంతో అనలేదు.క్లియర్ అయిందనుకుంటాను.

    ReplyDelete
  5. నాగార్జున గారు. రాజేష్ గారు, శరత్ గారు : నెనర్లు.
    సుధ గారు: క్లియర్ అయ్యిందండి థాంక్యు.. సారీ తెలియక అపార్థం జోలికి వెళ్ళినందుకు.
    కుమార్ గారు: అవును అక్కడే ఆగాలని నిర్ణయించేసుకున్నానండి.. "ఏమిటో ఫ్యామిలీ కోసం పర్సనల్ లైఫ్ ని త్యాగం చేసే చాంధసవాదులు మీరు."
    హహహ్హ.. భలే ఛతురోక్తులు..:-)))) నెన్నర్లు.

    ReplyDelete
  6. అపార్థం పోయినందుకు థాంక్స్. బజ్ మూసేసినా..దయచేసి బ్లాగడం మానేయకండి. మీలాంటి వాళ్లే మాలాంటివారికి ప్రేరణ.పిల్లలకి దొరక్కుండా,టైమ్ దొరికించుకొని రాస్తూ ఉంటారని ఆశిస్తున్నా.ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఎలా సమాధానం ఇవ్వాలో తెలిసిన ఆడబ్లాగర్లు చాలా కొంతమందే ఉన్నారు -నా దృష్టిలో. అందులో మీరు ముఖ్యులు. మీరు బజ్జుల్లో బొజ్జున్నా పర్లేదు కానీ బ్లాగుల్లో రాయడం,(చదవడం కూడా) ఆపొద్దు.ప్లీజ్.,

    ReplyDelete
  7. తప్పకుండా సుధ గారు మీ అభిమానానికి నెనర్లు. :-)

    ReplyDelete
  8. తామర ఆకు , నీరు వలె అంటి అంటకుండా ఉండాలండి అది బజ్జైనా, బ్లాగైనా, రియల్ వరల్డైనా,విర్టువల్ వరల్డైనా..

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...