10.27.2010

"తెరచాటు దాటి దరి చేరదా నీ స్నెహం..."

ఒకసారి ఎవర్తోనో గుర్తు లేదు కాని మరీ లోన్లీ గా వుంది అంటే ఇలా బ్లాగుల గురించి చెప్పాను.. నీకు తోచింది .. నీవనుకొన్నది.... చక్కగా రాసుకొని నలుగురితో షేర్ చేసుకో అని.. అమ్మో!! ..అలా డైరెక్ట్ గా ఎలా రాస్తున్నావే బాబు... నువ్వు.. ముందు అలోచించాలి.. తరువాత ఒక పేపర్ మీద ఆ తరువాత ఎడిట్ చెయ్యలి అప్పుడు కదా.. బ్లాగ్స్ అవీ అంటూ చెప్తే అవునా!! నిజమా అనిపించింది ... అంత శ్రమ ఎప్పుడూ పడలేదు నేను... ఇలా అనుకొవడం అలా టైప్ చెయ్యడం.. కాని ఇప్పుడు ఈ స్నేహంగురించి రాయడానికి ఎంత ఆలోచించాల్సివస్తోందో... ఎవరు ఎలా అ(పా)ర్దం చేసుకొని నా మీదకి దండయాత్ర చేస్తారో అన్న భయం వుంది కూడా ..ముఖ్యంగా అజ్ఞాత వ్యక్తుల దాడి ఎదుర్కోవడం కొంచం కష్టమే.... అయినా ఎవరిని నొప్పించకుండా... ఇష్టంగా... నా అభిప్రాయాలు వెల్లడించడానికి సిద్దమవుతున్నాను .. మరి మీరు??

ఈ మధ్య ఈ స్నేహం గురించి బాగా వింటున్నాను. అసలు దీని అర్ధం ఏంటో కాని., నాకొక్కటి అనిపిస్తుంది. నా కుటుంబం, నా పిల్లలు, నా బంధువులు, అన్నీ "నా" అనుకొనే వ్యక్తులకి (స్త్రీ/పురుషుడు) స్నేహం ఎంతవరకు అవసరము?? ఎంతో మంచి నడవడిక,మంచి ప్రవర్తన, అమ్మాయిలంటే గౌరవం, మంచి హొదా కలిగిన ఒక పై అధికారి "నేను చాల అలిసి(విసిగి)పోతున్నాను, నాతో ఎవరు మాట్లాడినా వ్యాపారాత్మక దృష్టితోనో లేక ఇంకా ఏదన్నా అవసరంతోనో మాట్లాడుతున్నారు. నాకో స్నేహహస్తం కావాలి" అని తనదగ్గర పని చేసె అమ్మాయితో అంటే. ఆమె ఎలా ప్రతిస్పందిచాలి?? అతని వ్యక్తిత్వం తెలుసు, మంచి హొదా కలిగిన వ్యక్తి.,మంచివాడు., "నేనున్నాను" అని చెప్పి అతనితో స్నేహం పంచుకొగలదా?? ఇది నిజమయిన స్నేహం అన్న నమ్మకం ఎంతవరకు?? వద్దు అంటే.. తనేమన్నా మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వుంటుందా?? ఎటూ తేల్చుకొలేని ఈ సందిద్గావస్థ కన్నా పెద్ద జంజాటం ఇంకోటి వుండదనిపిస్తుంది. ఒక పక్క ఉద్యోగం.. ఇంకో పక్క స్నేహం అంటూ తన పై అధికారి..

ఈ సమస్య నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆలోచించేది ఒక ఆడదానిగా కాబట్టి సలహా కూడా ఒక ఆడదనిగానే ఇవ్వగలను..అంతే సున్నితంగా పరిష్కారం ఆలోచించగలగాలి కూడా .. పైగా అవతలి వ్యక్తి గురించి నాకు అసలు తెలీదు మరి అలాంటప్పుడు సలహా అనేది నేను ఈ ఒక్కరివైపో ఎలా ఇవ్వగలను?? అయినా వీళ్ళకి (పై అధికారులకి.. అసలు మగవారికి) ఈ ఆలోచనలెందుకసలు? ఈ స్నేహాలు అవసరమా?? మనసు ప్రశాంతత కావాలి అంటే మార్గాలు అనేకం... కుటుంబం తో గడపొచ్చు. పోని ఒక ఫామిలి ఫ్రండ్ గా ఈ అమ్మాయిని తన ఫామిలి కి పరిచయం చేస్తాడా.? లేదు .. ఒక రహస్య స్నేహుతురాలిగా వుండాలి... తన కింద పని చేసే అమ్మాయి గానే గా ఈమెకి గుర్తింపు మరి ....ఇది ఎంతవరకు సమంజసం?? ఇందులో ఏదో స్వార్ధం కనపడ్తోంది....అలా చెప్తే నాణేనికి ఇంకోవైపు.. చూడలేదు నేను ..అన్న స్పందన వస్తోంది నాకు... మంచివాడు.. ఎప్పుడు మిస్ బిహేవ్ చెయ్యలేదు(తరువాత చేస్తే?? ) ఇప్పుడీ మధ్యవయసులో ఉద్యోగం పెద్ద సమస్య.. నాకెప్పుడో టీనేజ్ క్రేజ్ లో ఉన్నప్పుడు జరగాల్సినవి ఇప్పుడేంటి నా మైండ్ ని డైవర్ట్ చేసుకోలేకపోతున్నాను అని ఆ అమ్మాయి ఆలోచనలు.. అవునంటే ఒక ప్రాబ్లం.. కాదంటే ఇంకో ప్రాబ్లం.. ఒ.కే అంటే అది ఒక కమిట్మెంట్ అన్న భయం.. వెరసి ఈ మధ్యవయసులో ఇవి అవసరమా అనే సంధిద్గావస్థ...

నిజమే!! మధ్యవయసులో వున్నవారికి స్నేహం అనేది చాల అవసరం.. నా ఇంకో స్నేహుతురాలు నాలాగే ఆలోచిస్తుంది.. అంతే ఆడదానిలా లేదా సమ వయస్కురాలిగా ... మన సమస్య గాని.. మన బాధ కాని లేక మన సంతోషం గాని ఒక స్త్రీ గా కొంచం అసూయతో అర్ధం చేసుకొంటుంది.. లేదా అపార్ధం చేసుకొంటే నాలుగు తిట్లు తప్పవు... అలాగే ఒక మగవాడికి ఇంకో మగ స్నేహుతుడు కూడా అలాగే స్పందించగలడు... కాని తన సున్నితత్వం తన బాధ తన సుఖం పంచుకోడానికి ఒక తోడు/స్నేహం కావాలి ఇద్దరికి... విజాతి దృవాలు ఆకర్షించుకొంటాయి అన్నట్లుగా... అందుకే పెళ్ళి అనే బంధం అని అనిపిస్తుంది నాకు... కాని పెళ్ళి తరువాత ప్రతివారికి తన పార్ట్ నర్స్ కి కూడా చెప్పుకోలేనివి .... పంచుకోలేనివి.. చెప్పడానికో.. ప్రశాంతత కోసమో స్నేహం కావాలి అని అంటూ ఉంటారు...ఎలా నమ్మడం.. ఇలాంటి వాటికి ముగింపు కూడ కష్టమే కదా .. అందుకే నాకనిపిస్తుంది... ఇలాంటి వాటి దరి చేరకుండా స్వార్ధం వుండాలి అని.. నా కుటుంబం .. నా పిల్లలు.. మొ!!

నేను ఏమి చెయ్యను అంటూ నా చిన్ననాటి స్నేహుతురాలి 15 పేజీల ఉత్తరానికి ముగింపు లేని టపా ఇది .. నేనేమి సలహ ఇవ్వలేని పరిస్థితి నాది... నాకే అర్ధం కావడం లేదు .. ఇలాంటప్పుడు మంచి చెప్పినా ఇబ్బందే.. కీడెంచినా ఇబ్బందే...

సలహా??.. .హు!! ..ఒక స్నేహుతురాలిగా ఆలోచించలేకపొవడమే నా అసమర్ధత..ఇక సలహా ఇవ్వగలిగేంత గొప్పతనం.. .( అతని హొదా స్థాయి కి గాని ఈమె ఆలోచనల స్థాయికి గాని చేరుకొనే సామర్ధ్యం) నాకుందా?? అనిపిస్తుంది.. మరి మీరేమంటారు??

1 comment:

  1. ఈ స్నేహాలు ఎక్కడివరకు వెళతాయో ఎవరికీ తెలియదు ఒక్కోసారి చాలా ఇబ్బంది అవుతుంది కుడా. మనకు ఇబ్బంది లేకుండా చూసుకోవడమే అంత కన్నా చేయగలిగినది ఏమిలేదు

    ReplyDelete

Loading...