11.02.2010

తెలుగు వెలుగుల(తో)లో ..... దీపావళి


బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.


నాలుగు రోజుల క్రితం, ఒకసారి ఎందుకో నాకు ఇష్టమైన వాళ్ళతో ఓ అరగంట మాట్లడాలి అన్న ఆలోచన మదిలో పదే పదే కదలాడింది. ఆలోచించాను, నాకిష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాని అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు తలమునకలై నాతో అరగంట గడపలేని వాళ్ళే.

ప్రతి మనిషికి ఎప్పుడో అప్పుడు ఈ ఆలోచన అనేది వస్తుందని నా అభిప్రాయం. అంతెందుకు నాకు కలిగినట్లుగానే నా స్నేహితులకి ఇలాంటి ఆలోచన కలిగినప్పుడు , నేను వాళ్ళతో ఓ అరగంట గడపగలనా? నన్ను ఇష్టపడ్డవాళ్ళు , నాకిష్టమైన వాళ్ళు అందరూ బాధ్యతల బంగారు సంకెళ్ళతో ఉన్నవాళ్ళే. తీరా మాట్లాడే సమయం చిక్కినప్పుడు, మనసు మూగబోతుంది.

"లేనిదికోరేవు, ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు వగిచేవు "
అన్న పాట గుర్తోస్తోంది.

నా మనసు చెప్పినట్లుగా, నాకు నచ్చినట్లుగా, ఒక్క అరగంటే కాదు, కావాలనుకుంటే ఎన్ని గంటలైనా నాతో ఉండే నా ప్రియ నేస్తం నా బ్లాగు నాకు తోడుండగా, లేని దాని గురించి పాకులాడడం ఏమిటి? అని నిన్న పండగ హడావిడి తగ్గినతరువాత , నా బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్దామని తెర తీసి ఓరగా కూడలి వైపు చూడగా, "తెలుగు వెలుగులు" అంటూ శ్రీధర్ గారి బ్లాగులో నా బ్లాగు పేరు కనపడింది.


అంతే!! ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా! అదేంటి నన్నొదిలేసి నా బ్లాగు అక్కడేమి చేస్తోంది? అని చూద్దును కదా! నోట మాట రాలేదు నిజంగానే. మనసు మూగబోయింది. దీనికంతటికి(నా బ్లాగు శ్రీధర్ గారి బ్లాగుతో స్నేహం చెయ్యడానికి) కారణం జ్యోతిగారని తెలిసింది. ఇలా కూడా జరగొచ్చని, జరుగుతుందని తెలిపిన జ్యోతిగారికి, సహకరించిన శ్రీధర్ గారికి కృతజ్ఞతలతో, దీపావళి శుభాకాంక్షలతో...


"ఏమి జరిగింది?" అని అలా మెల్లగా అడుగుతారేంటండీ?? ఆనందంతో చెప్పడానికి.. "గుండె గొంతుకలోన కొట్టాడుతుంది, ప్చ్! ఎంత ప్రయత్నించినా , గొంతు దాటి అది రానంటోంది. ( పైన ఉన్న చిత్రం క్లిక్ చేసినా చాలు)" అందుకే మీరే శ్రమ అనుకోకుండా ఒక్కసారి అటెళ్ళి రండి.

7 comments:

  1. Ramani garu,,

    you really deserve this gift from all telugu bloggers..

    keep smiling. enjoy your life

    ReplyDelete
  2. రమణి గారు, ఈ రివ్యూ పుణ్యమా మీ బ్లాగులోని పోస్టులను ఆస్వాదించే అవకాశం దొరికింది. దాదాపు అన్ని పోస్టులూ చదివాను. ఇన్నాళ్లు వరుసగా ఫాలో అవకుండా ఎన్ని మంచి పోస్టులు మిస్ అయ్యానో అనిపించింది. మంచి ఆలోచనాశక్తి ఉన్న మీలాంటి బ్లాగర్లు తెలుగు బ్లాగులకు మంచి గుర్తింపు తెస్తారనడంలో సందేహం లేదు.

    ReplyDelete
  3. రమణి గారూ ముందుగా మీకు సుభాకాంక్షలు.
    దీన్నేమంటారో తెలియదుగాని(యాద్రుచ్చికం అంటారేమో)పండుగపూటా నేనూ మీలానే మధనపడ్డాను.
    అలా బ్లాగులన్నీ తిరిగాను.మీ బ్లాగు రివ్యూ చదివాను.జ్యొతిగారు ఇక్కడ రాసారెంటి అనుకొని , ఎవరి పేర్న కామెంట్ ఇవ్వాలో తెలీక కాంగా వచ్చేసాను.ఈ రోజు మూడ్ కాస్త సెట్ అయ్యి నా మనసు గోడు నా బ్లాగులో వెళ్ళబోసుకొని ఇలా వచ్చి చూసి కొంచెం అస్చర్యపడ్డా!
    ఎందుకంటే మౌనమె నీ భాష ఓ మూగమనసా.... ...అని పల్లవి నేను రాస్తే ,లేనిదికోరేవు......... అని చరణం మీరు రాసారు.(బహుసా మీరే ముందు రాసినట్టున్నారు)

    ReplyDelete
  4. u desreve all these wishes from ur fellow bloggers and i wish ur topics reaches greater heights.

    ReplyDelete
  5. అభినందనలు.
    It is a well deserved recognition.
    మీ బ్లాగు మరి మీ మనసు తెలిసిన నేస్తం కాబట్టి, క్రమం తప్పకుండా, చలము చేయకుండా బ్లాగుతో కబుర్లు చెబుతుండండి :)

    ReplyDelete
  6. అభినందనలు. ఇలాగే ఇంకా ఇంకా రాస్తూ ఇతోధికంగా మీ అభిమానులని అలరించగలరని ఆశిస్తూ ... మాలతి

    ReplyDelete
  7. అభినందనలు.మీ రచనలు కూడా కోటి రంగుల కాంతులతో అందరి మనసుల్లో వేలుగొందాలని ఆశిస్తూ...

    మీ శ్రీసత్య...

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...