4.22.2009

జనాభా లెక్కల్లోంచి నన్ను తీసేసారు..... :(

"జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర...
రామ దూత అతులిత భలదామా అంజనీ పుత్ర పవన సుత నామ..
మహవీర విక్రమ భజరంగీ కుమతి నివార సుమతికే సంగీ
కాంచన వరణ విరాజ సువేశా కావన కుండల కుంచిత కేశా..
అథ వజ్ర జౌ ద్వజా విరాజై..."

"అబ్బా! సేలవు రోజు ఇంత పొద్దున్నే హనుమాన్ చాలీసా ఎంటా ??" అని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే .. మా బుచ్చి బాబు గారు తదేక దీక్షలో చక చకా మనసులో కాదు ..కాదు .. బయటికే మననం చేసేసుకొంటున్నారు. అప్పుడే పూజ చేసుకొంటున్నారని "ఎంతయిందబ్బా టైం " అని చూసాను. ఇంకా పూర్తిగా 8 కూడా కాలేదు. ప్చ్! సెలవంటే పొద్దున్నే లేచేస్తారు. "నేను వెళ్ళాలి బాబు లేవండి.." అంటే మటుకు మంకు పట్టు పడ్తారు. నేను లేచానని తెలిస్తే "కాఫీ ప్లీజ్" అంటారని బుచ్చి బాబు చూడకుండానే మళ్ళీ ముసుగుతన్నేసా.. కళ్ళు గట్టిగా మూసుకొన్నా చెవులకి మటుకు సహస్రనామలు వినిపించేస్తున్నాయి...

"యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ||"

లేవక తప్పేట్టు లేదు ఇక అని లేచి, "ఏంటండీ ఈరోజు... పొద్దున్నే ఈ పూజలు.. సెలవేకదా కాసేపు పడుకొందామనుకొంటే.." అన్నా (కొంచం కోపంగానే)

"సెలవెందుకిచ్చారు మేడం"??
"సెలవెందుకేంటి? ఈరోజు ఎలక్షన్స్ కదా"

"అదే మరి ఓటెయ్యవా..?"

"అబ్బా వెయ్యొచ్చు లెద్దురూ ... సాయంత్రం 5 గంటలదాక ఉంటుంది కదా ఇప్పుడే అంత మించిపోయేలా పరిగెత్తాలా ఏవిటి"?

"ఆ!!! ఫలనా బుచ్చిబాబు, వాళ్ళావిడ వస్తారు మనందరం అప్పటిదాక ఎదురుచూస్తూ ఉందాము..." అని మనకోసం ఎదురుచూస్తారు ఈలోపులోనె ఎవరో ఒకరు మన ఓట్లు కూడా వేసేస్తారు."

"పొన్లెద్దురూ! వేస్తే వేసారు, నిద్ర మానుకొని అక్కడిదాక వెళ్ళి ఓటేసినా ఒకటే వెయ్యకపోయినా ఒకటే. వీళ్ళు మనల్నేమి ఉద్దరిస్తున్నారు కనక... "

"ఎంత మాటన్నావు? ఓటు హక్కు వినియోగించుకోడం మన జన్మ హక్కు, మన నాయకుల్ని మనమే ఎన్నుకోవాలి. అసలు ఓటు అంటే........"

"అమ్మో వద్దులెండి ! ఏదో సరదాకి అన్నాను కాని, మనమే వేద్దాము మన హక్కు మనమే వినియోగించుకొందాము. "

*******
అలా మోదలయిన మా ఓట్ల ప్రహసనం ఎలా "కొన" సాగిందంటే...

వీధి వీధంతటికి నేను మావారు చాలా బాగా పరిచయమైన వాళ్ళం కావడం వల్ల మా ఇద్దరికి మా మీద కాస్త అతినమ్మకం (చిన్నప్పటినుండి ఇక్కడే ఉంటున్నామనే ధీమా) అందరినీ పలకరించుకొంటూ ..... సంబంధించిన సెంటర్ కి వెళ్ళాము.

*****


అక్కడికి వెళ్ళి నా ఓటరు ఐ.డి చూపించి ఓట్ వెయ్యడానికి స్లిప్ ఇమ్మంటే సదరు ఏజంట్..

"ఇదిగోమ్మా ! లిస్ట్ క్రమ పద్ధతిలో లేదు. పేరు ప్రకారం కాక, ఇంటి నంబర్ల ప్రకారం చూసుకొండి" అని నాదగ్గర ఓ పెద్ద పేపర్ లిస్ట్ పెట్టారు.


ఒక్కో పేజ్, ఒక్కో పేజ్ ఓపిక గా చూసాను, ఇటు ఇంటినంబర్, అటు పేర్ల ప్రకారం.. ఎక్కడా ఏ లిస్ట్‌లో


నా పేరు కనపడలేదు. నాది, మా బుచ్చిబాబుది ఇద్దరి పేర్లు లేవు. ఈ సెంటర్ కాదేమో అని, మా ఊర్లో ఉన్న మొత్తం అన్ని సెంటర్లు తిరిగి తిరిగి విసిగి వేసారాము.

అలా ఈసారి మా జన్మహక్కయిన ఓటు హక్కుని సద్వినియోగపరుచుకోలేకపోయాము. అక్కడ అందరూ తెలిసిన వాళ్ళే అవడంతో "వేరే తరుణోపాయం ఎమన్నా ఉందా" అంటే "పేర్లు లిస్ట్‌లో ఉండి ఉంటే ఐ.డి. కార్డ్ లేకపోయినా పర్వాలేదు, ఈ రేషన్ కార్డో, ఇంకో ఐ డి ఏమి తెచ్చినా సరిపోయేది. కాని లిస్ట్ లో పేర్లే లేకపోతే మేమేమి చెయ్యలేము" అని చేతులెత్తేసారు. అలా మేము ఆ జనభా లెక్కల్లో లేము.

ఓటు హక్కు వచ్చినతరువాత మొదటిసారి నేను ఓటు వెయ్యకపోడం. ఎందుకో చిన్నప్పటినుండి ఉన్న ఊళ్ళో, ఉంటున్నా , ఏదో విదేశాలలో ఉంటున్నట్లు మేము ఓటు వెయ్యలేకపోయాము.


ఈ సారి ఇలాంటి అవకతవకలు చాలా జరిగాయని తరువాత తెలిసింది.అలా జనాభా లెక్కల్లోంచి నన్ను(మమ్మల్ని) ......... :(

4 comments:

  1. chaalaa chakkaga chepparandi, sumagaaru,
    repu manthri padavi vachchaaka inkeami chestaaro,mana naayakulu.

    ReplyDelete
  2. law of large numbers (bernoulli conjecture) parkaaram meeru lekkallo unna lekunna pedda effect emi undadu.
    Small deviations do not matter to the ultimate average kabatti, meeru baadha padakandi.

    your one vote counts ane vallaku law of large numbers teliyademo papam!

    "alaa pratee okkaru anukunte etla" ani anevallaki okkate samaadhaanam...ala pratee okkaru anukune avakaasame ledu.

    ReplyDelete
  3. "పేర్లు లిస్టులో ఉండి వోటర్ ఐడీ కార్డు లేకపోయినా పర్లేదు, ఏదో ఒక ఐడీ ఉంటే చాలు" ఈ సంగతిని జనాలకు అర్థం చేయించడానికి ఎన్నికల రోజు ఎంత కష్టపడ్డానో దేవుడికే ఎరుక! మొత్తానికి మీ వోటు పోయినందుకు కండోలెన్సెస్.

    ReplyDelete
  4. నా ఊహల్ల్లో గారు : నెనర్లు
    సుజాత గారు : నా విషయానికి వస్తే.. నేను అర్థం చేసుకోకపోలేదు కాని ఎప్పుడూ లేనిది ఈ సారి లిస్ట్ లో పేర్లు లేకపోడం కొంచం చివుక్కుమనిప్నిచింది. నేను అనుకొన్న పార్టి గెలిచిందనుకొండి, అరే మెజారిటీకే నేను ఓటు వేసాను అనే చిన్నిపాటి ఆనందం ఉండేది ఓటు హక్కు వినియోగించుకొన్నన్నాళ్ళు. కాని ఈసారి గెలిచిన ఓడినా నా పాత్ర అందులో లేదు .. అన్న ఫీలింగ్ అంతే.

    ప్రశాంత్ గారు: నెనర్లు నేను లెక్కల్లో ఉన్న లేకపోయినా ఒరిగేది, జరిగేది ఏమి లేదని నాకు తెలుసండి. కాని గెలిచిన పార్టికో , ఓడిన పార్టికో "నేను సైతం" అని అనలేక పోయాను అని తప్పితే, నేను కృంగి, కృశించి , బాధ పడ్తూ .. మంచం పట్టలేదండి. ఇన్ని సంవత్సారాల తరువాత ఓటర్ ఐ డి ఉండి కూడా ఓటు వేయలేకపోయాను కదా! అన్న విషయాన్ని షేర్ చేసుకొన్నాను అంతే. :)

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...