4.24.2009

ప్రేమ - ద్వేషం

ప్రేమించిన వారిని ద్వేషించగలమా? ద్వెషించిన వారిపై ప్రేమ పుడుతుందా?? ఎంటో ఈ ఆలొచనలు.. అసలేమి ఆలోచించకుండా మనిషి ఉండగలడా? లేకపోతే జీవితాంతం ఇలా ఆలోచనల సుడిలో కొట్టుకుపోవాల్సిందేనా.. అయినా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇలా అర్థం పర్థం లేనివి, ఆచరణ యోగ్యం కానివి ఎందుకు ఆలోచించడం అని..ఈరోజు ఇలా పోలీసు అధికారిణీ గా ఉండి , ఇంతమంది నేరస్థులని చూసి కూడా అసలు నేరస్థులను అంచనా వేయలేని తన అనర్హత మీద తనకే కోపంగా, చికాకుగా ఉంది. అసలెందుకీ ఈ పోస్ట్ తనకి? ఇన్నాళ్ళు అసలేమి సాధించిందని? చాలా నిక్కచ్ఛిగా ఉంటానని పేరు. కాని నాలో ఏదో గౌరవంలాంటి మమకారం అవతలి మనిషి చేస్తున్న అన్యాయాన్ని పసిగట్టలేక పోయిందా? తను అనుకొందా అసలు.. ఏంటో ఈ ఆలోచనలు, "అసలు ఈ విషయం తనదాకా వచ్చి ఉండకపోయినా బాగుండేది. అసలెందుకు తెలిసిందిరా భగవంతుడా!" అని తలపట్టుకొంది వైష్ణవి. జరిగిన విషయాన్ని తలచుకొని కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా ఒకసారి తన స్కూల్, ఆ జీవితం అదీ గుర్తొచ్చింది.

********

గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వర:
గురు సాక్షాత్ పరబ్రహ్మ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమ:

మనిషి పుట్టిననుంచి గిట్టే వరకు ప్రతి అడుగులోనూ ప్రతిక్షణం లోనూ అతను/ఆమె ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే వున్నారు, అతడు/ఆమె నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వున్నాడు కాని ఈ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడ గలిగినది తరగతిగదిలో విద్యనభ్యసించినప్పుడే, ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తాడు తన భవిష్యత్తుకు అతడి/ఆమె అనుభవాన్ని వారధిగా తీసుకుని తన భవిష్యత్తువైపు పయనిస్తారు, జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువువద్ద గడుపుతారు జీవితాన్ని మలిచి తీర్చిదిద్దే గురువే ప్రత్యక్ష ప్రథమ దైవం.


"వైష్ణవి! నువ్వు చెప్పమ్మా నీకు ఏ టీచరంటే ఎక్కువ అభిమానమో?ఎందుకు? పెద్దయ్యాక ఏమి చేద్దామనుకొంటున్నావు?" అడిగారు గురువు ఆవశ్యకత చెప్తూ తెలుగు టీచర్.


తనలో అభిమానం కట్టలు తెంచుకొని వచ్చిందో లేక ఈ సంవత్సరం తను వెళ్ళిపోతున్నానని బాధో తెలీదు కాని, నిజంగానే ఏడ్చేసింది "నాకు మీరంటే చాలా ఇష్టం టీచర్, మీరు చెప్పే ప్రతి ఒక్క విషయం జీవితం సజావుగా సాగడానికి పునాది లాంటిది. ఈరోజు ఇక్కడినుండి వెళ్తున్నామన్న మాట కాని మా మనసు మీ దగ్గిరే ఉంటుంది. ఇక ముందు మా ప్రతి అడుగులోను మీ ఉపదేశాలు ఉంటాయి" కంటినిండా నీరుతో ఇక చెప్పలేక పోయింది వైష్ణవి. అంతటి అభిమానానికి ముగ్ధురాలయ్యింది ఆ తెలుగు టీచర్. అలా ఆరోజు ఒక్క వైష్ణవి అనే కాదు, ఆ క్లాస్ వారందరి అభిమానాన్ని చురగొన్నారా తెలుగు టీచర్.


*****


ఆరోజు నుండి ఈరోజు వరకు తను ఎక్కిన ప్రతి మెట్టు ఆ టీచర్ తో పంచుకొని ఆనంద పరవుశురాలయ్యింది. తన తల్లి లా భావింది. ప్రతి అడుగు ఆమె సూచన ప్రాయమే. తనతో పాటు అన్ని విజయాలను పంచుకొన్న ఆ టీచర్ ఒక్క విషయంలో తనతో ఏకీభవించలేదు. తను పోలీసు ఆధికారిణి అవడం ఆమెకు సుతారము ఇష్టం లేదు. ఇన్ని మంచి విషయాలు చెప్పే ఈవిడకి ఈ పోస్ట్ ఎందుకు ఇష్టం లేదో అని అనుకొంది తప్పితే అంతకన్నా ఎక్కువ ఆలోచించలేకపోయింది. అలా అని ఆమెని ప్రేమించడం మానలేదు, ఆమె కూడ అంతే ఆనందంగా తన మాటలు వినేది. చంద్రుడికో మచ్చలాగా తన ఉద్యోగం ఒక్కటే ఆమెకి నచ్చని విషయం. ప్రతి మనిషి లోను మంచి , చెడు రెండూ ఉంటాయి, మంచిని తీసుకొని చెడుని వదిలేయాలి అన్న ఆమె మాటలే మననం చేసుకొనేది తను ఎప్పుడూ.


నిన్నటి వరకూ ఇదే ఆలోచనలో ఉంది. ఇలానే ఆలోచిస్తోంది.. కాని ఈరోజు.. ఈరోజు.... ఆలోచనలో ఉండగా టేబుల్ మీద ఫోన్ మోగింది. తెలుగు టీచర్....??


"హల్లో"

"వైష్ణవి నేనే"


"టీచర్...!"


"శశాంక్ నా దగ్గిరకి వచ్చాడు"


"ఊ"


"నువ్వు నమ్ముతున్నావా?"


"రుజువులు నమ్మమంటున్నాయి"


"అంటే??"


"నేనేమి మాట్లడలేకపోతున్నాను టీచర్, మీమీద అదే అభిమానం, అంతే ప్రేమ ఉన్నాయి కాని రుజువులు నా ఆలోచనలు తలక్రిందులు చేస్తున్నాయి, నేనేమి చెయ్యాలో నాకు తెలియనట్లుగా చేష్టలుడిగి ఉన్నా ఇప్పుడు".


"నన్ను ద్వేషిస్తున్నావా వైష్ణవి?"


"ప్రేమించినవాళ్ళని ద్వేషించలేము, ద్వేషించిన వాళ్ళని ప్రేమించలేము".


"ఇప్పుడేమి చేద్దామనుకొంటున్నావు వైష్ణవి?"


"నా ఉద్యోగ ధర్మం పాటిద్దామనుకొంటున్నాను టీచర్".


"అంటే నన్ను అరెస్ట్ ..................?"


"తప్పదు టీచర్.... వారెంట్ తో వస్తున్నాను ". బాధగా అంది వైష్ణవి.


"సరే ఎలాగు అరెస్ట్ చేస్తానన్నావు కాబట్టి నీతో మాట్లాడాలి ఒకసారి పోలీసు అధికారిణిగా కాక, వైష్ణవిలా నా దగ్గిర చదువుకొన్న విద్యార్థినిలా మా ఇంటికి వస్తావా? ".


"తప్పకుండా.. బయల్దేరుతున్నా..."


*******


"చెప్పండి టీచర్, ఎందుకు రమ్మన్నారు?"


"తప్పు నాది కాదు అని నిరూపించుకోడానికో, లేదా
తప్పు నాదైనా నువ్వొక్కదానివి నమ్మకు అని చెప్పడానికో కాదు వైష్ణవి నిన్ను పిలిచింది, ఒక నిజం చెప్దామని. "


"నిజమా? ఏమిటది, ఈ విషయానికి సంబంధినదయితే రుజువులు సాక్ష్యాలు మీరేనని చెప్తున్నాయి ఇక వెనుతిరిగేది లేదు మీరేమి చెప్పినా.."


"నేను దానికి సంబంధించి అసలు నీతో మాట్లడదల్చుకోలేదు, నేరం నేనే ఒప్పుకొంటున్నాను. కాని చేసింది మటుకు "నీకోసం" ఇది చెప్పాలనే నిన్ను పిలిచింది.


"నా ...కో.. స.. మా?"


"యెస్ నీ కోసమే. "


"నువ్వు ఎప్పుడన్నా గమనించావా? నువ్వు మాట్లాడుతుంటే మురిసిపోతాను, నీతో పంచుకొనే ప్రతి నిముషం కోసం నేను యుగాలయినా ఎదురుచూస్తాను. ఇంకో విషయం.. నీతో తప్పితే ఎవరితోను ఇంత చనువు, ఇంత బంధం పెంచుకోలేదు నేను, కారణం తెలుసా నీకు?"


"గురువుగా నేను బాగా చదువుతానని ఆ అభిమానం అనుకొంటున్నాను నేను".


"అదొక కారణమైతే రెండో కారణం ... మూడో కంటికి తెలియని విషయం నేను నీ తల్లినమ్మా.." ఆర్ద్రంగా అన్నారా ఆ తెలుగు టీచర్.


వ్వాట్? ఇది ఇంకో షాకా.. ఈ తెలుగు టీచర్ తనకి తల్లా? అందుకే తనకి ఏదో తెలియని మమకారం అడ్డు పడుతోందా? మరి గురువయి ఉండి, తనకి తల్లి అయి ఉండి ఈ పని ఏంటి?


"తల్లి అయి ఉండి ఈ పనేంటి అని ఆలోచిస్తున్నావు కదూ?" తన మనసులోని మాటని కనిపెట్టినట్లుగా అడిగిన ఆ ప్రశ్నకి ఏమనాలో అర్థం కాలేదు వైష్ణవి కి.


"నీకు తల్లినే కాని తల్లిగా నీ ముద్దు ముచ్చట చూడక .. అనాధ పెరిగిన నిన్ను చూసి , అక్కున చేర్చుకోవాలనిపిస్తుంది, కాని, పెళ్ళికాకుండా తల్లి అని అవహేళన చేస్తారని ఎవరికీ తెలియకుండా నిన్ను తీసుకొని ఈఊరు వచ్చాను, నిన్ను ఇక్కడే రెసిడెన్షియల్ లో చేర్చి నేను అందులో చేస్తూ నీకు తెలియకుండా నీ బాగోగులు చూసుకొన్నాను. కాని నాఎదురుగా ఎవరన్నా పిల్లలు స్కూల్ కి వచ్చిన వాళ్ళ తల్లితండ్రులని "అమ్మా" అని పిలుస్తూ వెళ్తుంటే సహించలేకపోయేదాన్ని. ఏదో తెలియని అసూయతో రగిలిపోయేదాన్ని, నాకు లేని సుఖం వాళ్ళకెందుకు అని ఒక్కోసారి నా హోదాని మర్చిపోయి, పిల్లలిని హింసించేదాన్ని. నాకేదో దక్కలేదు అన్న బాధ నాకు ఇప్పటికి ఉంది, కాని అది ఎవరితో చెప్పుకోను? నాకు తెలుసు... నాకు ఎప్పుడో ఈ దుస్థితి పడుతుందని, కాని అది నీ ద్వారా అవకూడదు అనుకొన్నాను, అందుకే నువ్వు పోలీస్ అధికారిణివి అంటే నాకు నచ్చనిది. ఎవరన్నా "అమ్మా" అని పిలుస్తుంటే నాకే తెలియని చిత్రవధ అనుభవిస్తున్నాను, ఆ అసూయే నాలో వ్యక్తిత్వాన్ని నశింపజేసింది, నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అన్న ఆలోచనే అలా పైశాచికంగా ప్రవర్తిచేలా చేసింది. అమ్మ అనుకొని అమ్మ వడిలో సేద తీరుతున్నవాళ్ళని ఎవరినీ వదలేదు నేను, నాకు తెలియకుండానే వాళ్ళందరనీ గొడ్డుని బాదినట్లు బాదే దాన్ని, ఇంట్లో చెప్తే మర్నాడు మరింత కఠినమైన శిక్ష ఉండేది వాళ్ళకి. నేను పొందే ఈ పైశాచిక ఆనందాన్ని అనుకోకుండా చూసింది శశాంక్. అతను చూశాడన్న ఆవేశంతో ఆ పసిదానిని ఇంకా ఘోరంగా కొట్టాను, నేరం ఒప్పుకొంటున్నాను. నా దెబ్బలకే ఆ పాప చనిపోయింది. "


ఆవిడ చెప్పినదంతా ఇంకా నమ్మశక్యం కావడంలేదు వైష్ణవికి, మొదటిది ఆమె తన తల్లి అవడం , రెండోది, ఆమెలోని మృగాన్ని ఇలా బయల్పర్చడం. చిన్నప్పుడు "తన కోపమే తన శతృవు, తన శాంతమే తనకి రక్ష " అని చెప్పింది ఈవిడేనా ?" బయట అందరికి నీతులు చెప్పి , ఎవరికీ తెలియకుండా పసిపల్లల్ని కొడ్తూ వారి లేత మనసులతో భయం అనే భుతాన్ని చూస్తూ ... పైశాచిక ఆనందం పొందుతున్నది ... తనని కన్న తల్లా... తన పక్కన ఉంటునే ఇంతటి ఘోరానికి.. మైగాడ్! అని అనుకొంది వైష్ణవి, నమ్మినవాళ్ళు ఇంతలా గొంతు కోస్తారు అన్న మొదటి అనుభవాన్ని బలవంతంగా అంగీకరిస్తూ......ఆమెని కస్టడికీ తరలించింది.

*****

5 comments:

 1. రమణి గారు,

  ఈ కధ చదువుతుంటే ఇందులోనే దాగి వున్న మరో కధ కనపడుతోంది(మీరు గమనించారో లేదో).పాత్రలతో చెప్పాల్సినంత చెప్పించేశారు- అంతర్లీనంగా కనపడనిది చొప్పించేశారు. అసూయ, ద్వేషం ఎంతో ఉన్నత స్థానాల్లో వున్న వారిని కూడా పతనానికి దిగజారుస్తుందని చెప్పకనే చెప్పారు- దీనిలోని పరమార్ధం అందరూ(కనీసం కొందరు) గ్రహిస్తారంటారా! ఏది ఏమైనా మీ కధ(లు), పాత్రలు బాగున్నాయి.

  భవదీయుడు,

  సతీష్ కుమార్ యనమండ్ర

  ReplyDelete
 2. రమణీ గారు,
  నిజంగా నాకు కూడా దీనిలో రెండు కధలు కనపడుతున్నాయి.తెలిసి రాయటం జరిగిందో లేక తెలియకో నాకు తెలియదు కానీ సతీష్ గారు అన్నట్టు ఈ కధలో నాకు కూడా ఏవో నిజాలు కనపడుతున్నాయి. కధని నడిపించిన తీరు బాగుంది.
  మీ,
  భావన

  ReplyDelete
 3. సతీష్ గారు @ భావన గారు : నెనర్లు. ఇందులో రెండు కథలా? నాకర్థం కాలేదు ఆ మధ్య ఎక్కడో పేపర్లో పసిపిల్లలిని కొడ్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఉపాధ్యాయులు అన్న శీర్షిక చదివాను దాని ప్రేరణ ఈ కథ. మీరంటున్న రెండో కథ నాకర్థం కావడం లేదు. ఏమి అనుకోకుండా ఆ రెండో కథ ఏమిటో చెప్తే ఇంకో కథ రాసే అవకాశం ఇచ్చిన వారుగా భావిస్తాను.

  సతీష్ గారు : మీరు అందరూ అనుకొనే సతీష్ గారేనా?

  ReplyDelete
 4. రమణి గారు మీ కథను చదివితే మొన్న ఢిల్లీలో జరిగిన సంగటన గుర్తొచ్చింది.
  కాని మీరన్న మాట ప్రేమించిన వాల్లని ద్వేషించగలమా ?, ద్వేషించిన వాల్లని
  ప్రేమించగలమా ?అన్న మాట నిజమైతే నేను కూడ నమ్ముతా,
  ఎందుకంటే ఇంతక ముందు నాకెప్పుడు ఈవిధంగా ఆలోచన రాలేదు కాబట్టి, నేను ప్రేమించిన వాల్లు నన్ను ద్వేషిస్తున్నారంటే , మల్లీ వాల్ల జీవితంలో కి నేను
  వెల్లకుండ ఉంటే మంచిది అనుకుంటా, మరి ఈ విషయంలో మీ ఉద్దేష్యం ఏమిటో తెలుసుకోవచ్చా ? మీ సలహా ఇస్తే ,ఆనందపడుతా.
  మీ బ్లాగు ద్వారా మంచి మంచి నీతులు తెలుసుకుంటున్నా.
  అదేవిధంగా మీ సలహాలు అందితే, మీకు నేను క్రుతఙుడుగా ఉంటాను.

  ReplyDelete
 5. ramani garu,

  ikati kaadu chala kadhalunnayi yemo mee kadhalo ...guru sishula sambandam, prema meeda nammakam adesamayam lo aa nammakamunaku goddali pettulanti nizalu, vruthi nibaddatha, inka asalu kaaranam unmarried mothers/lekapothe alanti biddalu valla samajaniki elanti pramadalu ponchi unnayi ...anevi unnayi..

  ReplyDelete

Loading...