7.01.2009

ఐదో గోడ అవసరమా?

కూడలిలో ప్రతి ఐదు పోస్ట్ల్లకి ఒక పోస్టు ప్రత్యక్షంగానో , పరోక్షంగానో ఈ కథ గురించి విమర్శో , పొగడ్తో తెలియకుండా కనిపిస్తోంది గత వారం రోజులనుండి. అసలు కథ చదవకుండా ఇవన్నీ చదివిన తరువాత వచ్చిన ఆలోచన ఆ కథ చదవడం. ఇక్కడ నేను ఓ ప్రముఖ రచయిత్రిని విమర్శించేంత గొప్పదానిని కాదు, అలా అని ఏమి వ్రాసినా చాలా బాగుంది అనేసేంత వెర్రిదాన్ని కాదు . ఒక మాములూ పాఠకురాలిని. ఆలా మాములూ పాఠకురాలి హోదాలో ఈ కథ గురించి నా అభిప్రాయం చెప్పాలనుకొంటున్నాను కాని ఇందులో రచయిత్రిని కించపరిచే ఉద్దేశ్యం ఎంతమాత్రం లేదు. అలాగే ఈ కథ బాగా నచ్చేసిన పెద్దవారికి తమ అమూల్యమైన సమయాన్ని , ఇలా నా టపా చదివినందుకు, అలా వారి సమయం వృధా అయినందుకు క్ష్యంతవ్యురాలిని. నాకు పెద్ద భాష , పెద్ద పదాలు రావు. నాకొచ్చిన మామూలు భాషలో మాములూ బ్లాగర్ హోదాలోచెప్పదల్చుకొన్న విషయం. ఇదిగో ఇదే:

అప్పుడెప్పుడో ఈ కథా రచయిత్రిగారు వ్రాసిందే "స్లీపింగ్ పీల్" ఆ కథకి ఈ కథకి ఒక్కటే తేడా అక్కడ సెక్స్ విషయంలో పురుషాధిక్యతని అసంధర్భంగా ప్రస్తావించారు 60 యేళ్ళ ముసలాడికి కోరికలూ అంటూ.. ఇక్కడ 60 యేళ్ళ స్త్రీ కోరికలు అంటున్నారు. అక్కడ మహిళల సానుభూతి సంపాదించారు . మరి ఇక్కడ?? ఈ రెండు కథల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపించేది ఒక్కటే, ఈ జీవితం కేవలం శృంగారం కోసమే, అదే జీవిత పరమావధి అన్నట్లుంది. స్లీపింగ్ పీల్ కథని మహిళలందరూ బ్రహ్మరథం పట్టారు. సరే ఇప్పుడు వ్రాసిన ఈ కథలో యద్దనపూడి తరహాలో గది వర్ణనలు, లాన్ వర్ణనలు బాగున్నాయి. కథ ఇతివృత్తానికి వస్తే, భర్త చనిపోయిన నెలకే ఒక 60 యేళ్ళ స్త్రీ తోడునాశించడం, దాని గురించి పేపర్లో ప్రకటన, కూతురు మొదటకాదన్నా తల్లి మనసులోని భావనలను అర్థం చేసేసుకొని ఆనందబాష్పాలు రాల్చడం. తరువాత కథలోని రచయిత్రికి ఆ 60 యేళ్ళ స్త్రీ పాత్ర .."నాలోని కోరికని ఎందుకు బయట పెట్టలేకపోయావు" అంటూ ......ఇలా సాగుతుంది కథ. అంటే 60 యేళ్ళ ఆ స్త్రీ పాత్ర కేవలం కోరికల కోసమే మరో వివాహం కాదు ... కాదు తోడు కోరుకొంటోంది. ఇది సమాజం హర్షించేయాలి. దీనిని మేము హర్షిస్తున్నామంటూ ఉగాది పురస్కారలలో మొదటి బహుమతి. అర్థం కాని కథలే అవార్డు కథలు అని మరోసారి నిరూపించబడింది. . నిజంగా 60 యేళ్ళప్పుడు కోరికలతో కాలిపోతున్నప్పుడు, అప్పుడు సమాజ కట్టుబాట్లు గుర్తు రానప్పుడు, భర్త తనని సరిగ్గా చూసుకోవట్లేదు లేదా కోరిక తీర్చట్లేదు అనుకొన్నప్పుడు, బార్య అదే ఈ కథలోని నేటి మహిళ,
భర్త చనిపోయాక ఎవరితోనో సహజీవనం సాగిద్దామనుకొన్నప్పుడు, భర్త బతికుండాగానే అంతటి తెగువ ఎందుకు చూపించలేకపోయింది? ఏ కట్టుబాట్లకి లొంగింది? 60 యేళ్ళకి అన్ని అయిపోయాక ఏ కట్టుబాట్లు తెంచుకొందామనుకొంటోంది? 60 యేళ్ళకి తను అనుకొన్న మనిషి దొరకగా లేనిది, భర్త బతికి ఉన్నప్పుడు కూడా దొరుకుతాడే. దానికి భర్తని చంపేయడమెందుకు? నెలలోపు అంటూ ప్రకటన ఎందుకు? ఆవిడకి సమాజపు కట్టుబాట్లు అనవసరం అనేది 60 యేళ్ళకి పరిమితమా? పెళ్ళయిన వెంటనే ఛట్! నా కోరిక తీరట్లేదు అని వెళ్ళచ్చు కదా, పోని కొంచం డీసెంట్ గా మాట్లాడుదాము, రంగనాయకమ్మగారి జానకి విముక్తిలాగ, చలగారి మైదానం నవల్లో లా భర్త ఉండగానే "నువ్వు నా కోరిక తీర్చలేకపోతున్నావు అనో లేదా నా మనసులోకి చొచ్చుకొని నా భావనలను అర్థం చేసుకోలేకపోతున్నవు అనో " విడాకులు ఇచ్చేసి ఇంకో తోడో లేదా పెళ్ళో చేసుకోవచ్చేమో కదా. వయసుడిగినప్పటికన్నా ఇంకొంచం ముందయితే నిఖార్సయైనా మొగవాడు తోడు దొరికేవాడేమో కదా. (సమాజం కట్టుబాట్లు, ఏ సెంటిమెంట్లు మనకొద్దు అనుకొన్నప్పుడు) ఇక్కడ ఎవరిని అవహేళన చేస్తున్నారు? భర్త వెర్రివాడనా, ఒక మర మనిషి అనా? అయితే ఎందుకు? బార్యమనసులో కించిత్ విలువ సంపాదించలేకపోయాడనా? లేక బార్యనా, లేక బార్య భర్తల బంధాన్నా? నాకయితే ఇక్కడ బార్య భర్తల బంధం అవహేళన అవుతోంది అనిపిస్తుంది. ఆత్మ క్షోభిస్తుంది లాంటి మాటలు పక్కన పెడితే, లోకం దృష్టిలో అతని స్థానం ఏమిటి? ఏ మగవాడు, ఏ ఆడది తమకి తాముగా మమ్మల్ని మీ హృదయాలలో సింహాసనం మీద కూర్చోబెట్టండి అని అడగరు. ఆ బంధాన్ని కాపాడుకోడం ఇరువురి బాధ్యత. ఇష్టం లేకపోతే , నిజంగా 60 యేళ్ళ తరువాత లేని ధైర్యం తెచ్చుకొని తోడు అంటూ వెంపర్లాడేకన్నా, ఉన్నప్పుడే నాకు నువ్వు ఇష్టం లేదు అని చెప్పేస్తే ఇద్దరికి సేఫ్. చెరొకరు చెరొక దారి చూసుకొంటారు. మరి పిల్లలు? అని ప్రశ్నిస్తే, కట్టుబాట్లకే లొంగని వాళ్ళు ఇక కన్నపేగుకి లొంగుతారా? ఇలాంటి కథల వల్ల ప్రయోజనం అర్థం కావడం లేదు. యువతి యువకుల్లార! మీ నచ్చకపోతే వెంటనే తెగ తెంపులు చేసుకోకండి.. ఎవరో ఒకరు పోయేదాక ఆగి... అది 60 యేళ్ళు అయినా 100 యేళ్ళయినా తరువాత తోడుకోసం ఇంకో మార్గం ఎంచుకొండి అన్న సందేశమా? ఇది స్త్రీ జనోద్ధారణ కథా? లేక పురుషపుంగవులని అవమానించే కథా? పిచ్చివాడా అసలు నీ మగతనమేమిటి ? నువ్వు నన్ను సుఖపెట్టలేదు అని 60 యేళ్ళకి బయటికి రావడం??

*****

ఇక కోరికల విషయం: ఆంధ్ర అయినా అమెరికా అయినా స్త్రీ ... స్త్రీ నే.. 40 యేళ్ళు వస్తున్నాయంటేనే హార్మోన్ల ప్రభావం తగ్గి మొనోపాజ్ దశకి చేరుకొంటాము. అంటే మాములుగానే, మన స్లీపింగ్ పీల్ కథలోలా భర్త దగ్గరికి వస్తుంటే, ఏదో ఒక సాకు చెప్పో, లేదా బలవంతంగా "సరే" అనడమో, లేదా ఇద్దరిమధ్య ఒక అవగాహనో ఎదైతేనేమి నొప్పించక తానొవ్వక ప్రవర్తిస్తాము. ఇక్కడ కేవలం స్త్రీ గురించే మాట్లాడం లేదు. ఇద్దరివైపు మాట్లాడుతున్నాను. ఇక మొనోపాజ్ దశలో స్త్రీ కి ఈ శారీరక పరమైన కోరికలు కాస్త సన్నగిలుతాయి. ముందంతా భర్త తనని సుఖపెట్టడా లేదా అన్నది 60 యేళ్ళకి తవ్వుకొని ఆలోచించాల్సినదేమిలేదు. సో, ఆ 60 యేళ్ళకి కథలో ముందు రాసినట్లుగా తోడు అవసరమనుకోవచ్చు కాని, శారీరకపరమైన కోరికలు కలుగుతాయి అంటే అది సరి కాదు . ఎక్కడో 1% ఉంటారు ఆ మధ్య ఏదో పేపర్లో 60 యేళ్ళకి తల్లి అయిన వృద్ధ నారిమణీ అని. అలా తప్పితే 99% స్త్రీలకి 60 యేళ్ళకి వాంఛలుండవు.. వాత్సల్యంకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి మనిషికి ఇంకా ఎక్కువ వయసున్న వ్యక్తే తారసపడ్తారు. అంటే ఒకరికొకరు సేవలు చేసుకోడం తప్పితే అక్కడ అప్పుడు కోరికలంటే హాస్యాస్పదంగా ఉంది.

ఇక బార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోడం. ప్రతి మనిషిలోను అన్నీ మంచి లక్షణాలే ఉండవు.. అలా అని అని చెడు లక్షణాలే ఉండవు. రెండు కలగలిపినవాడే మనిషి. అది ఎవరయినా. మరి అలాంటిది భర్త బార్యని అర్థం చేసుకోపోడానికి కారణం, అతను పుట్టి పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు కదా. ప్రతి మనషి తన మనసాక్షిగా తరచి చూసుకొంటే , తన మనసుకు ఒంటరి వాడే, బార్య పిల్లలు, బంధువులు ఇవన్ని పాత్రలు ఈ జగన్నాటకంలో , మనమెప్పుడు ఎవరికివారం ఒంటరివాళ్ళము. మరి అలాంటప్పుడు ఎవరో వచ్చేసి మన మనసుల్లోకి దూరిపోయి, మనల్ని అర్థం చేసేసుకోవాలనుకోడం మన భ్రమే అవుతుంది. ప్రతి జంట 100% మనసులో భావాలు తెలిసేసుకొంటున్నార? ఎప్పుడో మనసులో భావుకత పాళ్ళు హెచ్చి,"పచ్చని పసిడి చందమామని చూడండి, వెన్నెల ఎంత బాగుందో " అని నేనంటే, "పంచదార రేట్ బాగా పెరిగింది ఆకాశానటింది" అని అంటారు ఆ మాత్రానికే మావారికి భావుకత లేదని నేను 60 యేళ్ళ తరువాత ఇంకో బంధానికి ఎదురుచూడనా?
మనిషి బంధాలకి బాధ్యతలకి కట్టుబడ్డాక, వెన్నెల రాత్రులు, తెల్ల చీరలు పక్కన పెట్టి , నిద్రపోని రాత్రులు, ఇంకా సంపాదించాల్సిన పరిస్థితులు తలుచుకొని, అవన్నీ బార్యకెందుకులే అనుకొని ముభావంగా (మన భాషలో భావుకత లేకపోడం) ఉంటే మనం తీరిగ్గా మనవాళ్ళెప్పుడు పోతారా ఎప్పుడు పేపర్లో ప్రకటన ఇద్దామా అని ఎదురుచూద్దాము, మన చిట్టి తల్లుల కళ్ళల్లో వెలుగు చూడడానికి. ఈ కథలో ఆధూనీకత కాదు కదా, అసలు అర్థమే లేదు. భర్త చేతుల్లో ఎన్నో కష్టాలు, శారీరక బాధలు పడ్డవాళ్ళ మధ్య, మనం మనదైన సొంత వ్యక్తిత్వంతో మన జీవితాల్ని జయిస్తున్నాము. అసలిదంతా ఎందుకండి? నాది ఒక్కటే ప్రశ్న. బతుకు తెరువు కోసం బార్య ఒక దేశంలో భర్త ఒక దేశంలో ఉన్నప్పుడు, వారిరువురికి ఈ కథ ఇచ్చే గొప్ప సందేశం ఏంటి? ఇదేనా? ఎందుకంటే పాపం 60 యేళ్ళ వరకూ.. పొని ఎవరో ఒకరు బతికుండే వరకూ వీళ్ళకి వెన్నెల రాత్రులు,, పడక సుఖాలు అన్నీ తెలిసినా, వీటికి దూరమే కదా! కాని ఇలా జీతాల కోసం, జమా ఖర్చుల కోసం జీవితాన్ని అనుభవించలేని వారు ఈ కథలు చదివితే?? పర్యవసానం ఎంటి? ఎన్ని రాత్రులు నిశిరాత్రులు వాళ్ళవి. నిజానికి వాళ్ళెవరూ 60 యేళ్ళ దాకా ఆగాల్సిన పని లేదేమో కదా, ఈ కట్టుబాట్లు అవి తెంచేసుకోవచ్చు. నన్నడిగితే ఈ క్షణంలో నేనేమి ఆలోచిస్తున్నాను అని నా వ్యక్తిని అడిగినా చెప్పలేరు. మన మనసు మనకే పూర్తిగా తెలీదు. ఇహ ఎవరో 60 యేళ్ళ తరువాత వచ్చేసి అర్థం చేసేసుకొని మనల్ని ఉద్దరించేస్తారు అని ఎలా ఎలా ఆలోచిస్తారండి?

ఇదంతా చదివిన తరువాత మీకెమనిపిస్తోంది? ఐదో
గోడ, 60 యేళ్ళతరువాత జీవితం కోరికలు . ఇవన్నీ అవసరమా? ఐదో గోఎప్పటికైనా అడ్డుగోడే. నాలుగుగోడలు చాలు మనిషి సుఖంగా ఉండడానికి. అవునా?

70 comments:

  1. చాలా మంచి విశ్లేషణ. ముఖ్యంగా biological కోణంలోంచీ మీరు చెప్పిన నిజాలు ఆ కథకూ,ఆ వాదాలకూ ఒక కొత్తకోణాన్ని జోడించాయి.

    ReplyDelete
  2. ఈ కథని అర్థం చేసుకోవడం సులభమే. http://sahityaavalokanam.net/?p=70 రచయిత్రి తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పారు అంతే కానీ hidden implications లేవు కదా.

    ఇందులో అశ్లీలత ఏమీ లేదు. సెక్సు సుఖాల కోసం పెళ్ళి చేసుకోవడం కూడా నేరం కాదు. Extramarital affair (అక్రమ సంబంధం) పెట్టుకోవడం నేరం. ఈ కథలో అక్రమ సంబంధాలని గ్లోరిఫై చెయ్యలేదు కదా. మరి ఈ కథ బూతు కథ ఎలా అవుతుంది?

    ReplyDelete
  3. avunu aidho goda avasarama!!!
    very nice ( visleshana ) analysis.

    ReplyDelete
  4. చక్కని విశ్లేషణ! కాదనలేని, వాస్తవిక దృక్కోణం. వాదాల జోలికి పోని మానవీయ కోణం.

    ReplyDelete
  5. కథలో ముఖ్యోద్దేశాన్ని అర్ధం చేసుకోకుండా చేసిన వితండ వాదం.
    "అలా తప్పితే 99% స్త్రీలకి 60 యేళ్ళకి వాంఛలుండవు.. వాత్సల్యంకోసం ఎదురు చూస్తూ ఉంటారు."
    ఏ ప్రాతిపదిక మీద ఆ పై కంక్లూజన్ ఇచ్చారు? ప్రపంచంలో ఆరు బిలియన్ల పైచిలుకు మనుషులున్నారు. అందులో సగం స్త్రీలనుకుంటే, వారిలో 1% 30 మిలియన్ల మంది ఉంటారు. పోనీ ఈ కథ ఆ ముప్ఫై మిలియన్ల మందిని గురించీ అనుకోండి, పోయిందేముంది?

    ReplyDelete
  6. స్త్రీలు తోడు వెతుక్కోవడం - అనేది చాలా సంక్లిష్ఠమైన విషయం. కొంచెం తెలివీ, వ్యక్తిత్వమూ ఉన్న స్త్రీ కైతే ఇదో కత్తి మీద సాము లాంటిది.

    కోరికల కోసం పెళ్ళి చేసుకోవడమో, తోడు, ఆలోచనల్లో కంపాటబిలిటీ కోసమో - ఏవయినా కూడా ఇవన్నీ, మహిళ, జీవితంలో కోరుకొనే స్వాంతన ను హైలైట్ చేస్తాయి.

    అక్రమ సంబంధాల కన్నా, పెళ్ళి చేసుకోవడం ఉత్తమం. ఎవరి జీవితానుభవాల ప్రకారం, వారి వారి ఆలోచనలు ప్రభావితం అవుతాయి. స్త్రీ స్వేచ్చ ను గర్హించడం, ఆమె ఇలా, వయసు లోనే, భర్తను తిరస్కరించి వెళిపోయినా జరిగేదే!

    ఒక విధవరాలు, 60 ఏళ్ళ వయసులో ఏ కారణం చేతనైనా పెళ్ళి చేసుకుంటే, ఆవిడ మానాన ఆవిణ్ణీ బ్రతకనివ్వకుండా, ఇంకా సమాజం చీ కొడుతుంది. ఎందుకంటే, ఇది మన మైండ్ సెట్ ! ఈ వయసులో నువ్వు ఇలానే ఉండాలీ - అని మనని మనం ప్రోగ్రాం చేసేసుకుంటాం. అందుకే, ఇలాంటి స్థిర అభిప్రాయాల్లో, మార్పుల్ని ఇష్టపడం.

    అయితే, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, పెద్ద వయసులో ముఖ్యంగా, ఎంత సంక్లిష్టమో కూడా అలోచించండి. పెళ్ళే, పెద్ద రిస్క్! ఇంక, వృధాప్యంలో, సరైన తోడు అంటే - ఖచ్చితంగా పెద్ద రిస్క్. నిజానికి సొంత పిల్లల్నే నమ్మని ముసలాళ్ళున్న ఈ కాలంలో ఏ నమ్మకంతో, ఆవిడ పెళ్ళి చేసుకోవడానికి నిశ్చయించుకుందో గానీ, ఆవిడ పోసిటివ్ ద్రుక్పధాన్ని మెచ్చుకోవాల్సిందే !

    ReplyDelete
  7. మన వాళ్ళకి చాంధసవాదాన్ని అర్థం చేసుకోవడం సులభమే కానీ ప్రగతివాదాన్ని అర్థం చేసుకోవడం కష్టం. మన చట్టం ప్రకారం పెళ్ళైన తరువాత అక్రమ సంబంధం పెట్టుకోవడం నేరం కానీ జీవిత భాగస్వామితో సెక్స్ చెయ్యడం నేరం కాదు. సమాజానికి భయపడి ఎక్కువ మంది సెక్స్ కోరికలు బయట పెట్టుకోరు. జీవిత భాగస్వామితో కూడా సెక్స్ చెయ్యడానికి సంకోచిస్తారు. భార్యభర్తల లైంగిక సంపర్కాన్ని కూడా బూతు అంటే అది చాంధసవాదమే అవుతుంది.

    ReplyDelete
  8. రమణి గారూ,

    నిజాలిలా చెప్పేస్తే ఎలాగ? ఉన్నది అంతా ఉన్నట్టంటే వూరంతా ఉలుకు, గుండెల్లో కలుకు. ఇవన్నీ పొలిటికల్లీ కరెక్టు కథలు. ఇలాంటి కథలు రాస్తేనే గుర్తింపులు, బహుమతులు, కీర్తి, గౌరవమూనూ. వాళ్ళని రాసుకోనీయండి. వాటిని చదివి మనసుపాడుచేసుకోకండి. విమర్శించి సమయం వృధా చేసుకోకండి. వ్యక్తిగత బలహీనతలకు ఆదర్శం ముసుగువేసి అదే అనుసరణీయం అని ప్రచారం చేసి, తమ బలహీనతలకు ప్రామాణికత కల్పించుకునే నీలినక్క కథ పంచతంత్రంలో వుంది. చదవండి. ఈకథలను చూసి ఆందోళన పడరు. నవ్వుకుంటారు.

    ReplyDelete
  9. కత్తి మహేష్ కుమార్ గారు @ సుజాత గారు : నెనర్లు, మరోకోణాన్ని స్పృశించినందుకు.

    @బ్లాగాగ్ని గారు @ రాజ మల్లేశ్వర్ కొల్లి గారు @ శర్మగారు : థాంక్స్ అండీ.

    ReplyDelete
  10. @ Praveen's talks :

    ఈ కథని అర్థం చేసుకోవడం సులభమే:

    నేను అర్థం కాలేదు అన్నాన? అర్థం లేదు అన్నాన? అవార్డు కథలు అర్థం కానివాటికే అన్నాను. ఈ కథ అర్థం లేదు అన్నాను. అర్థం కాకపోడానికి లేకపోడానికి తేడా లేదంటారా?

    "రచయిత్రి తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పారు అంతే కానీ hidden implications లేవు కదా "

    నేనెక్కడన్నా నర్మగర్భంగా చెప్పారు అని కాని గుంభనంగా ఉన్నారని కాని అన్నానా?

    ఇందులో అశ్లీలత ఏమీ లేదు.

    ఉంది అని నేనెక్కడన్నా వ్రాసానా? మీకెందుకలా అనిపినించింది?

    సెక్సు సుఖాల కోసం పెళ్ళి చేసుకోవడం కూడా నేరం కాదు. Extramarital affair (అక్రమ సంబంధం) పెట్టుకోవడం నేరం.

    ఈ విషయం గురించి కాదుగా నేను చర్చింది.. నేను అలా చెప్పానా ఈ పోస్ట్లో?


    "ఈ కథలో అక్రమ సంబంధాలని గ్లోరిఫై చెయ్యలేదు కదా. మరి ఈ కథ బూతు కథ ఎలా అవుతుంది? "

    బూతు కథ అని ఎవరన్నారు? మీకై మీరే ముగింపు కొచ్చెస్తే ఎలా అలా? ఒకసారి ఆలోచించండి అన్ని అననివాటిని ఆధారంగా చేసుకొని కామెంట్ వ్రాసారు మీరు. ఊహించెసుకొన్నట్లున్నారు.

    ReplyDelete
  11. కొత్తపాళీ గారికి: విలువైన సమయాన్ని కేటాయించినందుకు ముందుగా నెనర్లు.

    "కథలో ముఖ్యోద్దేశాన్ని అర్ధం చేసుకోకుండా చేసిన వితండ వాదం:"

    ఏంటండి అంత ముఖ్యోద్దేశ్యం ఈ కథలో? విశాల హృదయం.. లేదా అదర్శభావాలు అని చెప్పుకోబడ్తున్న ఓ 60 యేళ్ళ స్త్రీ పాత్రకి (హై సొసైటీ అనాలేమో) భర్త చనిపోయాడు మానసిక ప్రశాంతత, ఇన్నేళ్ళు తనేదో పోగొట్టుకొంటోంది అనుకొంటున్న తన మనసులోని ఆలోచనా తరంగాలకు సంబంధించిన భావనలు నెరవేరడం, మనసుకి తోడు, పిల్లల బాధ్యతలు తీరిపోయాయి కాబట్టి తనకి కడదాక తోడు కావాలి (ఇక్కడ పెళ్ళి అనడం లేదు) ఆమె మనసుకి తోడు కల్పించాలి అంతే కదా. అంత ఖచ్ఛితంగా ఆ స్త్రీ తన మనసులోని మాటని కూతురి దగ్గిర చెప్పుకోగలిగి ఒప్పించగలిగినప్పుడు, నిజానికి శారీరక వాంఛలు పక్కన పెడితే మానసికంగా తోడు కావాలనుకొంటే కనుక, రచయిత్రి కథలోనే చెప్పారు భర్త ఆమెకి సహకరించలేదు అని.. ఆ మానాసిక ప్రశాంతత ఆమెకి అతను బతికి ఉన్నప్పుడే లేనప్పుడు..... అంత విశాల హృదయం కల ఆ వ్యక్తిత్వం కల స్త్రీ నాకిక్కడ ప్రశాంతత లేదు అని ఎందుకు చెప్పలేకపోయింది? అంతటి ఆధునీకత భావాలు వ్యక్తపరలేకపోడానికి ఆవిడ ఏ కట్టుబాట్లకి లొంగంది? చనిపోయిన భర్తని ఎందుకు అవమానపరిచింది? నిజానికి ఈ కథ మగవాళ్ళని అవహేళన చేసే కథ.

    "అలా తప్పితే 99% స్త్రీలకి 60 యేళ్ళకి వాంఛలుండవు.. వాత్సల్యంకోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఏ ప్రాతిపదిక మీద ఆ పై కంక్లూజన్ ఇచ్చారు? "

    నా ప్రాతిపదిక మహేష్ గారు పైన చెప్పారు. బయోలాజికల్ ప్రాతిపదిక, శారీరక మార్పులు, మోనోపాజ్ మొ!

    ప్రపంచంలో ఆరు బిలియన్ల పైచిలుకు మనుషులున్నారు. అందులో సగం స్త్రీలనుకుంటే, వారిలో 1% 30 మిలియన్ల మంది ఉంటారు. పోనీ ఈ కథ ఆ ముప్ఫై మిలియన్ల మందిని గురించీ అనుకోండి, పోయిందేముంది?

    పోని ఈ కథ ఆ ముప్పై.... : ఈ సర్ధుకుపోయే సంజాయిషి ఏంటి కొత్తపాళీ గారు? నేను చెప్పిన లెక్క తిరిగి నాకు చెప్పి పోని అని మీరు సర్దుకుపోడంవల్ల నేను చెప్పిందే కరెక్ట్ అని మీరు చెప్పకనే చెప్తున్నారు కదా. మరి 1%కి ఈ కథ అని మీరు అంటే, మిగతా 99% నాతో కలిపి 100% .. మెజారిటీ నాదే కదా. 60 యేళ్ళ స్త్రీ కోరికలతో తోడు కావాలనుకోడం ఎలా ఉందో... పోని ఆ ఒక్క 1% కోసమే ఈ కథ అని వారివైపు నేనున్నాను అని మీరు నిలబడడం కూడా అలానే ఉంది.

    ReplyDelete
  12. @ sujata gaaru : చక్కటి ఆలోచనా విధానం.. చాలా బాగా చెప్పారు. నెనర్లు . ఇవన్నీ నిజాలు కాని కాకుడని ఊహలు. ఈ పాజిటివ్ థింకింగ్ భర్త ఉన్నప్పుడే ఎందుకు కలగలేదంటారు? అప్పుడెందుకు చేసుకోకూడదంటారు? ఇలా చనిపోయిన తరువాత చేసుకోడం అనేది భర్తని అవమానపరచడం కాదంటార? లేక ఇక్కడ కూడ మనం పాజిటివ్ గా ఆలోచిద్దామంటార? నిజానికి నేను అలానే ఆలోచించేదాన్ని కథలో చివర్లో "నా కోరికలు.. అని పాత్ర చేత అనిపించకుండా ఉండి ఉంటే.

    ReplyDelete
  13. @praveen's talks : నెనర్లు ఇంతకన్నా నెనేమి చెప్పలేను. మీరేదో ఆలోచించేస్తున్నారు.. పోస్ట్కి వ్యాఖ్యకి పొంతన లేకుండా. అక్రమ సంబంధాల గురించి ఎవరు మాట్లడడంలేదు. ఈ కథలో ఇద్దరు పెళ్ళి చేసుకోకుండా తోడుకోసం లేదా కథలోని పాత్ర శారీరక వాంఛల కోసం అనుకొంటే అక్రమ సంబధం అవుతుంది అది నేరం అవుతుంది. ఆలోచించండి.

    ReplyDelete
  14. కస్తూరి మురళీ కృష్ణ గారు: నెనర్లు నా కొత్త బ్లాగులో మొదటిసారిగా మీ కామెంట్.

    "ఇవన్నీ పొలిటికల్లీ కరెక్టు కథలు"

    హ హ నిజమే.

    ఇలాంటి కథలు రాస్తేనే గుర్తింపులు, బహుమతులు, కీర్తి, గౌరవమూనూ. వాళ్ళని రాసుకోనీయండి.

    అంతేలేండి.. ఏదో మన అభిప్రాయలు చెప్తామంతే.

    "వాటిని చదివి మనసుపాడుచేసుకోకండి. విమర్శించి సమయం వృధా చేసుకోకండి."

    తప్పకుండా. ఏదో మరీ కథ చదివాను కదా అని అభిప్రాయం అంతేనండి. దీనివల్ల నాకు ఒరిగేది లేదు, తరిగేది లేదు. కంఠశోష తప్పితే.

    ReplyDelete
  15. ఒకప్పుడు తప్పనిసరై సంఘసంస్కర్తలు సంఘసంస్కరణలకి దిగారు. కానీ ఈ అనవసరపు సంస్కరణలేంటో అర్థం కావట్లేదు. ఈ తరహా కథల్లో ఏదో రియాక్షనరీ తత్త్వం గోచరిస్తుంది. "మగవాడు అలా చేస్తాడు కాబట్టి ఆడవాళ్ళం ఇలా చెయ్యాలి" అని ! మగవాడి పరిమితులు వేరు. ఆడదాని పరిమితులు వేరు అని గుర్తించరు. తన మరణానంతరం తన భార్య వేరే పెళ్ళి చేసుకుంటుందనే అభిప్రాయం మగవాళ్ళలో ఏర్పడితే మనకి తెలిసిన కుటుంబ వ్యవస్థ అంతటితో అంతరిస్తుంది. ఎందుకంటే "ఎవరికోసం కష్టపడాలి ?" అనే ప్రశ్న అతనికి ఎదురవుతుంది. ప్రపంచం పరమ ఛండాలమైనది. కామకోరికలున్న తల్లుల్ని వాళ్ళ కొడుకులు కూడా వదిలిపెట్టరు. వాళ్ళ పెద్దరికానికి విలువ పోతుంది. అది సరైన ఆదర్శం కాదు గనుకనే స్త్రీల పునర్వివాహం చాలా దేశాల్లోను, సంస్కృతుల్లోను ప్రోత్సహించబడలేదు. ఈ విషయాల గురించి లోతుగా ఆలోచించలేనివాళ్ళూ ఇలాంటి ఆనందబాష్పాల సెంటిమెంటల్ కథలు రాసి అభ్యుదయవాదులమనుకుంటున్నారు. శుభం ! అలాగే కానివ్వండి.

    ReplyDelete
  16. చనిపోయిన భర్త కోసం జీవితాంతం ఒంటరిగా ఎందుకు ఉండాలి? మగవాడు భార్య చనిపోయిన నెలరోజులకే రెండవ పెళ్ళి చేసుకున్న వృత్తాంతాలు నేను కూడా చూశాను. పెళ్ళి విషయంలో ఆడదానికి ఒక నీతి, మగవాడికి ఒక నీతా?

    ReplyDelete
  17. ఒక వైపు ఆడదాన్ని దేవత అంటూనే ఆడవాళ్ళు పునర్వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించేవాళ్ళకి ఏ రకమైన నిజాయితీ ఉంటుంది? అందుకే రివ్యూ (పార్ట్ 3) కూడా వ్రాసాను. http://sahityaavalokanam.net/?p=88

    ReplyDelete
  18. గురువు గారూ నమస్కారం
    "కథలో ముఖ్యోద్దేశాన్ని అర్ధం చేసుకోకుండా చేసిన వితండ వాదం".
    ఇందులో వితండవాదం ఉందని మీకెందుకనిపిస్తోంది.కధ చదివిన ఎవరయినా వారి అభిప్రాయం చెప్తారు,ఇది కూడా అలానే ఎందుకు అనుకోకూడదు.లోకో భిన్న రుచి:అన్నారు కదా.

    ఇకపోతే రమణి గారూ
    మీ అభిప్రాయాన్ని చాలా నిర్ద్వందంగా తెలియచేసారు.అభినందనలు.నేనూ మురళికృష్ణ గారితో ఏకీభవిస్తున్నా...

    ReplyDelete
  19. 50 ఏళ్ళ వయసులో 25 ఏళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న ముసలి వాళ్ళని చూసాను. ఆడది రెండవ పెళ్ళి చేసుకుంటున్నట్టు కథ వ్రాస్తే మీకు రుచించదు. ముసలి వయసులో పెళ్ళి చేసుకునే మగవాడిని విమర్శించని వాళ్ళకి కేవలం ఆడవాళ్ళ విషయంలోనే ఎందుకు అంత అభ్యంతరం? మా అమ్మగారి వయసు 52 ఏళ్ళు. మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారు రెండవ పెళ్ళి చేసుకుంటే వచ్చిన వ్యక్తిని నా తండ్రిగా అంగీకరించగలను. ఆడవాళ్ళు విమానాలు నడుపుతున్న యుగంలో కూడా ఆడవాళ్ళ గురించి సంకుచిత నమ్మకాలు ఎందుకు?

    ReplyDelete
  20. రమణి గారు, బాగుందండి మీ విశ్లేషణ. ఈ కథ చదివినప్పటి నుండి నాకు ఒక్క విషయం అర్థం కాలేదండి. ఈ కథలో ఎక్కడ కూడా భర్త ని చెడ్డవాడిగా చెప్పలేదు. తన భార్య అభిప్రాయాలకు, ఇష్టాలకు విలువ ఇచ్చే వ్యక్తిగానే వర్ణించారు. కథలో ఒకచోట ఇలా వుంటుంది "నా కిష్టమైనట్టు నన్ను ఉండమనేవారు." నా కిష్టమొచ్చినట్ట్లు నువ్వు ఉండు అనలేదు కదా. నా భర్త నా అభిరుచుల్లో పాలుపంచుకోలేదు అని ఆయన పోయేవరకు ఎదురుచూసి వేరే వాళ్ళను వెదుక్కోవాలా? ఇంతేనా పెళ్ళి అంటే? అభిరుచులు కలవలేదని పెళ్ళి అయిన కొద్ది రోజులకే తెలుస్తుంది కదా మరి మనిషి పోయే వరకు ఎదురుచూడడం ఎందుకు?

    ReplyDelete
  21. రమణి గారు, బాగుందండి మీ విశ్లేషణ. ఈ కథ చదివినప్పటి నుండి నాకు ఒక్క విషయం అర్థం కాలేదండి. ఈ కథలో ఎక్కడ కూడా భర్త ని చెడ్డవాడిగా చెప్పలేదు. తన భార్య అభిప్రాయాలకు, ఇష్టాలకు విలువ ఇచ్చే వ్యక్తిగానే వర్ణించారు. కథలో ఒకచోట ఇలా వుంటుంది "నా కిష్టమైనట్టు నన్ను ఉండమనేవారు." నా కిష్టమొచ్చినట్ట్లు నువ్వు ఉండు అనలేదు కదా. నా భర్త నా అభిరుచుల్లో పాలుపంచుకోలేదు అని ఆయన పోయేవరకు ఎదురుచూసి వేరే వాళ్ళను వెదుక్కోవాలా? ఇంతేనా పెళ్ళి అంటే? అభిరుచులు కలవలేదని పెళ్ళి అయిన కొద్ది రోజులకే తెలుస్తుంది కదా మరి మనిషి పోయే వరకు ఎదురుచూడడం ఎందుకు?

    ReplyDelete
  22. భర్త మంచివాడైనా అతను చనిపోయిన తరువాత రెండవ పెళ్ళి చేసుకోవచ్చు. ఈ హక్కు స్త్రీలకి ఉంది. పోయిన మనిషి గురించి జీవితాంతం బాధ పడుతూ ఉండలేము. భర్త చనిపోయినా స్త్రీ జీవితాంతం బాధ పడుతూ ఉండలేదు. కనుక స్త్రీకి భర్త చనిపోయిన తరువాత రెండవ పెళ్ళి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించే హక్కు ఉంది. ఈ విషయం నేను పార్ట్ 1లో వ్రాసాను. http://sahityaavalokanam.net/?p=70

    ReplyDelete
  23. chandrachood gaaru : నెనర్లు.
    "ఎందుకంటే "ఎవరికోసం కష్టపడాలి ?" అనే ప్రశ్న అతనికి ఎదురవుతుంది.... "
    ఎందుకో ఈ కోణంలోంచి కూడా నిజమే అనిపిస్తోంది. కాని, భర్త మరణాంతరం బార్య రెండో వివాహానికి నేను వ్యతిరేకిని కాదండి. పరిస్థితులననుసరించి అది ఆమోదయోగ్యం అయితేనే.. అంటే ఆవిడ చిన్న వయసులో భర్త చనిపోతే రెండో వివాహం చేసుకొని ఇంకో కుటుంబానికి ఆసరా అవ్వచ్చు కాని పుట్టింట్లో ఉండి ఒకరికి ఇబ్బంది అవకూడదు. అలాగే భర్త సైకో అయినప్పుడో, శాడిస్ట్ అయినప్పుడో బార్య బయటికి రావడం తప్పులేదు. ఈ కథలో 60 యేళ్ళ తరువాత అంటే కొంచం హాస్యస్పదంగా అనిపించింది.

    ప్రవీణ్ గారు : మీరు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని రుజువు చేయ ప్రయత్నిస్తున్నారు. మంచిదే వాదించండి కాని ప్రతి వ్యాఖ్యల్లో మీ కుటుంబాన్ని తీసుకొచ్చేయకండి. నేనైతే, నా బార్య అయితే, నా కొడుకైతే, మా అమ్మగారు అంటూ.. నాకు తెలిసి మీకింకా పెళ్ళి అయి ఉండదు. అయిన తరువాత ఆవేశపడండి. చక్కటి సాహిత్య ప్రతిభాశాలి మీరు, కాస్త ఉడుకు రక్తం పాళ్ళెక్కెవ అంతే.

    ReplyDelete
  24. శ్రీనివాస్ పప్పుగారు: నెనర్లు. మురళి కృష్ణగారికి ఇచ్చిన సమాధానాలే మీకు కూడా.. :)

    స్నేహ గారు: నెనర్లు. నేను అడిగేది కూడా అదేనండి. పోస్టంతా రెండుసార్లు అదే ప్రశ్న తలెత్తంది. దానికి సమాధానం నాకు రావడం లేదు . వేచి చూద్దాము ఎవరన్నా చెప్తారేమొ! :)

    ReplyDelete
  25. 60 ఏళ్ళ వయసులో జీవితానికి తోడు అవసరం లేదా? ఆ వయసులో సెక్స్ కోరికలు ఉన్నా తప్పు లేదు. శారద తాను భర్త చనిపోయిన తరువాత రెండవ పెళ్ళి చేసుకుంటుంది కానీ భర్త ఉన్నప్పుడు అతను చావాలని కోరుకోలేదు.

    మీరే ఆవేశపడి వ్రాస్తున్నారు అనిపిస్తోంది. నా వయసు 26 ఏళ్ళు. 60 ఏళ్ళు వయసు ఉన్న స్త్రీ నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా? అని నన్ను అడగకపోవచ్చు. అడిగితే 36 లేదా 38 ఏళ్ళు వయసు ఉన్న స్త్రీ నన్ను అడగొచ్చు. తనని పెళ్ళి చేసుకోవాలంటే తన కోరికలు తీర్చాలి అని ఆమె కండిషన్ పెట్టినా ఫర్వా లేదు. కోరికలు ఉండడం తప్పు కాదు. అది 38 ఏళ్ళ వయసులో అయినా 60 ఏళ్ళ వయసులో అయినా. తనని పెళ్ళి చేసుకోవాలంటే తన కోరికలు తీర్చాలి అని కండిషన్ పెట్టే స్త్రీల సంఖ్య తక్కువే. నా మొదటి భర్త వల్ల పుట్టిన పిల్లలని నువ్వు కూడా నీ పిల్లలుగా అంగీకరించాలి అని కండిషన్ పెట్టగలరు. ఆ కండిషన్ కి ఒప్పుకోని వ్యక్తిని ఆమె పెళ్ళి చేసుకోదు. ఏ ఆడదైనా తనకి జీవితానికి తోడు, పిల్లల బాధ్యతలు రెండూ ముఖ్యమనుకుంటుంది. జీవితానికి తోడు కంటే సెక్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనుకోను. కేవలం సెక్స్ కి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు 1% మందే ఉంటారనుకుంటాను.

    ReplyDelete
  26. ప్రవీణ్ గారు: నేను ఆవేశపడలేదు అని నేను అనలేదు. అవేశంతో పాటు ఆలోచించి వ్రాసాను. రెండో పెళ్ళి విషయంలో, chandrachood గారి వ్యాక్యకి నా సమాధానం 1% విషయంలో కొ.పా గారికి ఇచ్చిన సమాధానం చదువుకొండి. విషయం అర్థమవుతుంది మీకే. మీరు కూడా నా 1% లెక్కలోకి వచ్చినందుకు థాంక్స్.

    ReplyDelete
  27. నేనేమీ సెక్స్ కి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తాననలేదు. ఒకవేళ నా భార్య తన కోరికలు తీర్చమంటే అందుకు నాకు అభ్యంతరం లేదు అన్నాను. పెళ్ళి తరువాత సెక్స్ చెయ్యడం తప్పు కాదు కదా. పెళ్ళికి ముందు సెక్స్ కొన్ని దేశాలలో నిషిద్ధమే. పెళ్ళి తరువాత సెక్స్ పై ఎక్కడా నిషేధం లేదు కదా.

    ReplyDelete
  28. స్త్రీవాదాన్ని వ్యతిరేకించే జీడిపప్పు లాంటి వాళ్ళకి స్త్రీల ఇష్యూస్ తో ఏమిటి పని? గృహ హింస చట్టం దుర్వినియోగం అవుతోందని చెప్పి గృహ హింస చట్టాన్ని రద్దు చెయ్యాలని డిమాండ్ చెయ్యలేదా మీరు?

    By Praveen

    ReplyDelete
  29. మార్తాండ గారూ, నేను స్త్రీవాదాన్ని వ్యతిరేకించను, మూర్ఖవాదాన్ని మాత్రమే వ్యతిరేకిస్తాను.
    నా దృష్టిలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ స్త్రీల "అభ్యుదయానికి" చేసిన పనులు, భానుమతి గారు సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా విద్యార్థినుల కోసం కళాశాలలో చేపట్టిన చర్యలు మొదలయినవి నిజమయిన "స్త్రీవాద" చర్యలు.
    తిన్నది అరగక పచ్చకామెర్ల కళ్ళతో లోకాన్ని చూస్తూ "స్త్రీలకు అన్యాయం, స్త్రీల హక్కులు" అంటూ చెత్తరాతలు రాస్తూ కొంపలు కూల్చే వారిని "మూర్ఖవాదులు" అంటాను. ఈ మూర్ఖవాదులనే వ్యతిరేకిస్తాను.

    ReplyDelete
  30. జీడిపప్పుగారు : నెనర్లు. మూర్ఖవాదం ... నేను ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  31. ఇంటిలో ఎలకలు ఉన్నాయని చెప్పి ఇల్లునే తగలబెట్టాలనడం, గృహ హింస నిరోధక చట్టం రద్దు చెయ్యాలనడం ఒక లాంటివే.

    ReplyDelete
  32. రమణి గారు -

    Very well written!!

    Its refreshing to see people who didn't lose the capacity to *think normally* after 'education'. I appreciate you!

    - కాలనేమి

    ReplyDelete
  33. What do you means by education? స్త్రీలని కించపరిచే సంకుచిత నమ్మకాలని నమ్మడం ఎడ్యుకేషనా?

    డేవిడ్ అనే బ్లాగర్ అడిగాడు “మంత్రి పదవులలో మహిళలు ఉండగా మహిళలపై అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయి?” అని. స్త్రీవాదాన్ని వ్యతిరేకించేవాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే అత్యాచారాలు పెరుగుతాయి కానీ ఎలా తగ్గుతాయి? బాల్యా వివాహాలని స్త్రీవాదులందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా దేశంలో 25% స్త్రీలకి 19 ఏళ్ళు లోపే పెళ్ళిళ్ళు ఎందుకు అవుతున్నాయి? వరంగల్ జిల్లాలో సురేఖ అనే మహిళా MLA గతంలో తన 16 ఏళ్ళ కూతురుకి బాల్య వివాహం చేసింది. పోలీసులు ఆమెని అరెస్ట్ చెయ్యలేదు సరి కదా, ఆ పెళ్ళికి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. భర్త చనిపోయిన స్త్రీ రెండవ పెళ్ళి చేసుకోవచ్చు అని చట్టం చెపుతోంది. గతంలో సుష్మా స్వరాజ్ భర్త చనిపోయిన స్త్రీలని కించ పరిచే విధంగా మాట్లాడడం చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. సోనియా గాంధీ భారతీయురాలని నిరూపిస్తే ఆమె గుండు గియ్యించుకుని తెల్ల చీర కట్టుకుంటుందట! ఏమి కుళ్ళు కంపు భూస్వామ్య భావజాలం అది? ఈశ్వర చంద్ర విద్యాసాగర్ లాంటి మహామహులు విధవలకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసి ఉద్దరిస్తే ఒక మహిళా ప్రగతి నిరోధకురాలు విధవలు విధవలుగానే ఉండాలి అనే అర్థంతో మాట్లాడింది. ఇలాంటి ప్రగతి నిరోధక చాదస్తాలని నమ్మేవాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే వాళ్ళు మహిళలని ఏమి ఉద్దరించగలరు?

    కల్పన గారు సంకుచిత నమ్మకాలని తెగించే ధైర్యం చేసినందుకే నేను ఆమెని అభినందించాను. కుళ్ళు భూస్వామ్య భావజాలాన్ని నమ్మేవాళ్ళు ఇంత మందిని చూసిన తరువాత నాకు కల్పన గారు లాంటి రచయిత్రులు లేకపోతే మిగిలేది అంధకారమే అని అర్థమయ్యింది.

    ReplyDelete
  34. మార్తాండ,

    ముందుగా ఒక విషయం, నువ్వు ఎవ్వర్ని కదిపావో నీకు నిజ్జెంగా తెలీదు. తెలిసుంటే కదిపేవాడివి కాదనుకో...

    ఏవిటా స్త్రీలను కించపరస్తున్న సంకుచిత నమ్మకాలు? ఒహవేళ ఏవో ఉన్నాయనుకో, స్త్రీలందరి తరఫున నువ్వు వకాల్తా ఎందుకు పుచ్చుకుంటున్నావ్? వారి సమస్యలను వారు భేషూగ్గా పరిష్కరించుకోగలరు.. మీకు గనక చలం రాతలు చదివి భావప్రాప్తి పొందాలనుకుంటే బహిరంగంగా నిర్లజ్జ గా మీ బ్లాగుల్లో పొందండి. మేం మీ అభిప్రాయాల్ని గౌరవిస్తాం! మీ మానాన మిమ్మల్నొదిలేస్తాం.

    ఒక అరక్షణం పాటు సంబంధం లేని విషయాల్ని లాగకుండా ఏదైనా విషయం మీద చర్చించగలిగే ఓపిక/నేర్పు లేని మీరు - స్త్రీ హక్కుల గురించి భాషణలిస్తుంటే - మేం ఊరుకున్నాం. మీ జోలికి రాలేదు. ఇప్పుడు కూడా మేం మీరు మీ సహచరుల జోలికి రాలేదు. నేను పైన రాసిన వ్యాఖ్య, ఈ బ్లాగరును అభినందించడానికి.Thats it.

    ”నే నొల్ల’ అంటారా? సరే! What the hell do you mean when you say Human Rights? What the hell do you mean when you say 'women rights', With clear logic and reason - would you mind explaining me how did the notion of "Rights" come into existence?

    We all take it for granted that the notion of Human Rights, Animal Rights, Women rights... etc., The Concept of "Rights" is sine qua non for living peacefully on earth. Since you talk about rationality and Logic and science of every issue - Would you mind explaining me why does one need the notion of "Rights" at all? What epistemic warrants do you have? What empirical evidence that it works? What theoretical support does it have? You talk about Logic, explain it to me.

    My contention is that the very notion of "Rights" draws its roots from a phenomena called Religion. I also claim that Religion is not culture universal. I also claim that Human Rights are nothing but a form of de-christianized christian theology.

    I can prove my claims logically, rationally and strictly scientifically. I challenge you prove me wrong. Savvy?

    I know all this is useless. You won't understand a lick of it. I very well know that. So my sincere suggestion to you and the your pack of wolves friends - cut the crap and just do your thing, while others do theirs. Do not claim moral high grounds for so called modernity, logic, rationality etc., because whenever you do it I will come back from self imposed exile and make yoyu play hard ball. get it?

    రమణి గారు - మీ స్పేస్ ని ఇలా ఉపఓగించుకున్నందుకు క్షమించండి :)

    ReplyDelete
  35. వ్యక్తిగత విమర్శలు వ్రాయాలనుకుంటే నా బ్లాగ్ లోనే వ్రాయు. రమణి గారి బ్లాగ్ స్పేస్ ని వినియోగించడం ఎందుకు? http://telugu.stalin-mao.net స్త్రీల హక్కుల గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా స్త్రీల హక్కుల గురించి వ్రాయవచ్చు. అందుకే నేను వ్రాసాను.

    ReplyDelete
  36. కాలనేమి గారు: నెనర్లు.

    "ముందుగా ఒక విషయం, నువ్వు ఎవ్వర్ని కదిపావో నీకు నిజ్జెంగా తెలీదు. తెలిసుంటే కదిపేవాడివి కాదనుకో..."

    మార్తాండ గారికి రాసిన వాఖ్యలో ఈ వాక్యం చూసి, "ఎవరు మీరు " అని అడుగుదామన్న ఆలోచన లిప్తపాటు మదిలో మెదిలింది. కాని ఎందుకో తెలుసుకోకపోడమే మంచిదన్న అభిప్రాయం కలిగింది. సదభిప్రాయాలను వ్యక్తపరుచుకోడానికి, ఏకీభవించడానికీ ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నా బ్లాగులో స్పేస్ కి క్షమించడం : ప్చ్! ఇలా అడగడం ?? అర్థం లేని వాదనలకన్నా అనుసరణీయమైన వ్యాఖ్యలు మిన్న. కాబట్టి నో ప్రాబ్లంస్. మీరు నిరభ్యంతరంగా నా బ్లాగు స్పేస్ ని వాడుకోవచ్చు.

    ReplyDelete
  37. మార్తండగారు:
    "స్త్రీల హక్కుల గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా స్త్రీల హక్కుల గురించి వ్రాయవచ్చు."

    వ్రాయడం వరకే పరిమితమా? లేక పొరాటం కూడా సాగిస్తున్నారా? ఏది ఏమైనా మీకు స్త్రీలంటే ఎంత జాలి, ఎంత దయ, ఎంత కరుణో నాకు బాగా అర్థమయ్యింది. . టి.వి 9 వాళ్ళయినా 24 గంటలు పరిమితం చేస్తారెమో చూపించిన వార్తలే చూపించి.. మీరు మటుకు విసుగుచెందకుండా చెప్పిందే చెప్తున్నారు చూడండి, మీ స్త్రీ జనోద్దరణాభిలాషకి వేవేల దండాలు.

    ReplyDelete
  38. పోరాటం చెయ్యగలను. నిజం చెప్పడానికి భయం ఎందుకు? అబద్దం చెప్పడానికి భయం ఉండాలి కానీ. ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడినప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లింక్ చదివితే ఆ విషయం అర్థమవుతుంది. http://telugu.stalin-mao.net/2009/06/27/479

    ReplyDelete
  39. కాలనేమి అని హిందూ పురాణాలలోని రాక్షసుని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరూ భయపడరు. దేవున్ని నమ్మని వాళ్ళు కూడా రాక్షసులు పేర్లు పెట్టుకోరు. రాక్షసుల పేర్లు పెట్టుకునే ఒకే ఒక్క వ్యక్తి నువ్వే అనుకుంటాను. రాక్షసుని పేరు పెట్టుకుని నువ్వు ఎవరో తెలుసుకోవాలని అడగడం విచిత్రంగా ఉంది.

    ReplyDelete
  40. మార్తాండా! ముందు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వు. సైన్సో సైన్సో అని తెగ లెక్చర్లిస్తావ్? సైంటిఫిచ్ ప్రశ్నలు వేస్తే అవి వొదిలి నా పేరు రాక్షసునిదా అని సంబంధం లేకుండా మాట్లాడతావేఁవిటి? సరే అడిగావు కాబట్టీ చెబుతా యినుకో. ఈ గడ్డమీద రాక్షసుల కథల్లో పరమ కర్కోటకరాక్షసులకూ గొప్ప స్టాండర్డ్స్ ఉండేవి. ఇప్పటి అతి గొప్ సెలబ్రిటీలుగా, హీరోలుగా పరిగణింపబడేవాళ్లుకూడా అప్పటి అతి కర్కోటక రాక్షసుని స్థాయిని కూడా అందుకోలేరు. అదీ సంగతి. నేను రాక్షసుణ్ణే, భయపడకు. నేను చిల్లర పనులు చెయ్య! సంఝైందా?

    ఇపుడు పై చెత్త వదిలేసి అసలు విషయానికి రా. చర్చించాలంటే, విషయం గురించి మాట్లాట్టం నేర్చుకో!! సంబంధం లేకుండా మీ ఊర్లో థియేటర్ లో నీలి చిత్ర ప్రదర్శన గురించీ, నీ పెళ్ళి ఆలోచనల గురించీ, చెలం ఒకనాడు కైపులో తన కూతురికి ఏం చెప్పాడన్నదాని గురించీ, రంగనాయకమ్మకు మతితపిందనీ కామెంట్లు కామెంట్లు తోచినప్పుడల్లా ఇక్కడ రాయడం వల్ల ప్రయోజనం ఉండదు. సరియా? సో ముందు విషయం గురించి ఆట్లాట్టం నేర్చుకో!!! నేను ఇంతకుముందు వ్యాఖ్యలో లేవనెత్తిన ’విషయం’ ఇదీ:

    1. Human Rights కు జస్టిఫికేషన్ ఏఁవిటి? అసలు "హక్కులు" అన్న భావన ఎక్కడినుంచి వచ్చింది? భూమి గుండ్రంగా ఉన్నదన్నట్లుగాను, అగ్ని దహిస్తుందన్నట్లుగాను "హక్కు" అన్నది ఒక సార్వజనీన సత్యమా?

    2. Women rights, Animal Rights గట్రా హక్కులు మనుజులు ఈ భూమ్మీద సుఖంగా నివసించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అంతటి అవసరం అని మాధావుల మాటల వెనుక ఏదో మోరల్ ఫోర్స్ తెలియజేస్తుంది. ఎక్కడినుంచి వచ్చిందా ఫోర్స్? అసలు హక్కులు అవసరమా? అయితే ఎందుకు? ఇంతకు మునుపటి మానవ సమాజాలు, సంస్కృతులకు "హక్కులు" అన్న కాన్సెప్ట్ ఉందా? ఉంటే ఎక్కడ ఎప్పుడు?
    లేకుంటే ఆ లేమి వల్ల పాపం వారెలా నష్టపోయారు?

    3. ఇప్పుడు నేను చెబుతున్నా విను - "హక్కులు" అన్న కాన్సెప్ట్ కి ఉన్న మోరల్ ఫోర్స దాని పాశ్చాత్య సంబంధాలనుంచి వస్తుంది. "హక్కులు" అనే భావన అసలు Religion అనే phenomena నుంచి వస్తుంది. (Religion as in Religio)

    4. మరి హిందూయిజం కూడా రెలిజయనేకదా, అంటావేమో - అందుకే నేనంటాను, religion is not culture universal. ప్రతి సంస్కృతికీ ఒక "రెలిజియన్" అనేది ఉంటుందన్నది శాస్త్రీయం కాదు.


    కాబట్టి సైంటిఫిక్, లాజికల్, కామ్రేడ్ మార్తాండ గారు.. హక్కులు హక్కులని అరిచేముందర మీరు ఈ అమాయక ప్రజలకు పాపం వారి హక్కులను ఎందుకు ప్రదానం చెయ్యాలనుకుంటున్నారో చెప్పి తీరాలి. హక్కుల లేమి ఎలా వినాశకరమో చెప్పితీరాలి. అసలు ఎవరి హక్కులు ఎవరు సంరక్షిస్తారో చెప్పితీరాల. స్త్రీలకు హక్కుల నివ్వడం, మాతృసమానంగా ఆరాధించడం ల లో ఏది ఎందుకు అవసమో తేల్చి చెప్పాలి.

    వ్యక్తిగతదాడులొద్దులే! నువ్వు మంచోడివి నాకు తెల్సు, చిన్నప్పుడు చలం రంగనాయకి క్రాప్ చదివి ఇలాగయ్యుంటావ్. అందుకే, సైంటిఫిక్ గా నే అడుగుతునాను చెప్పు. లాజికల్ గానే చెప్పు.

    ReplyDelete
  41. నేను చలం, రంగనాయకమ్మ గార్ల రచనలతో పాటు మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, క్లారా జెట్కిన్ తదితరుల రచనలు కూడా చదివాను. నేను చదివిన వాటి గురించి నా బ్లాగ్ http://telugu.stalin-mao.net లో వ్రాస్తున్నాను కదా. ఇక్కడ verbatim పున:సృష్టించాల్సిన అవసరం లేదు.

    ReplyDelete
  42. Ee visleshana naaaku 200% nachindi ...okkati ani kaadu chala points chepparu kevalam biological reasons kakunda...

    rachayitha 60 yrs widow pelli chesikovachu ani start chesaru ...adi tappu kaadu ..kani aa pathra ku saraina aalochana vidhanamu, reasonings, complaints okkati kooda harshincha daggavi ga pettaledu.cheppalante rachayitha bhavam lo lopalu unnayi (avvanni ramani garu oopikaga selavicharu..)..ippudu vache rendo athanu yennallu nachu thadu ilanti aameki ?? leka athaniki eeme yennallu nachuthundi ...instead she should hv said,ippudu okkaddanni undalani ledu ...happy ga undali anukontunnanu, so looking for company ani okka matalo cheppedaniki ...(convince cheyyadagga reason ivvaleka poyaru kabatti) ...

    asalu ilanti vishayallo chalam vere vallaki rayadaniki inkem miglachaledemO anipistundi.

    inka prize antara...ramani garu raise chesina issues lo okkati kooda vallu oohinchalekapoyaru ani anukontunnanu ...nizam ga inthakanna manchi kadhalu potilO levu ante nenu nammalenu

    ReplyDelete
  43. మీ సమాధానంలోనే లోపం కనిపిస్తోంది. ఈ కథలోని పాత్రలు చేసుకోవాలనుకుంటున్నది పెళ్ళి కానీ డేటింగ్ కాదు. డేటింగ్ చేసే వాళ్ళు మాత్రమే కొంత కాలం వాడుకుని వదిలేస్తారు. ఈ కథ చలం గారి ప్రభావం వల్ల వ్రాసినది అనుకోను. ఈ కథ పై కొడవటిగంటి కుటుంబరావు గారి ప్రభావమైనా ఉండొచ్చు.

    ReplyDelete
  44. Marxist gAru nannEnA antunnAru ....nEnu ee kadha pai chalam gAri prabhAvam undani assalu analEdu andi ...inkOsAri chadavandi ....proper understanding lEnappudu dating ayinA pelli ayinA tEdA yEmundi andi ....ee kadhalOni pAthra pelli chesikOvAli anukonnA, dating anukonnA nAku yEmAtram abhyantharam lEdu ,Ramani garu kooda adE cheppAru ...infact we all respect it...and pelliki assalu reasons koodA ivvakkaraledu .....kAni idi reason ani cheppalanukontE matram adi vivaha vyavasta ni kincha parachedigAnu, sthreela manobhavalanu agourava parichedi ganu undakoodadu.... meeku ramani gAri post yE ardham kAlEdu ...inkA naa comment mAtram yEm ardham avuthundi ....light teesikondi...

    pls note, ikkada kadhaloni problem enti anedi oka sadharana gruhini cheppagaladu ...yevarivo books chadivi mareee charchincha nakkaraledu ....ame rasina saili tappakunda chadivinchinadi, good one ...reasons matrame illogical ani cheppadam jarigindi.

    ReplyDelete
  45. ఈ కథలో శారద భర్త చనిపోయిన తరువాత రెండవ పెళ్ళి చేసుకోవాలనుకుంది కానీ భర్త ఉన్నప్పుడు అతను చనిపోవాలని కోరుకోలేదు, అతని చావు కోసం వేచి చూస్తున్నట్టు చెప్పుకోలేదు. అయినా మీరు శారద అలా అనుకుందని అర్థం వచ్చేలా misinterpret చేశారు.

    ReplyDelete
  46. ha ha ...asalu kalpana gare alaa 10 meanings vachela rasaru ..inka valla ammayi chetha adiginchi , yedo oka samadhanam cheppincharu ...

    ReplyDelete
  47. ramani garu,

    meeru simple ga oka post lo vrasinadanni vimarshinchadani ki yevaro padi partulu rastunnaru ...kani ye partu lonu vishayam kanipinchatam laaa ....

    kaneesam ee vishyam mahilalaku sambandhinchindi, vallaku matlade hakku vundi ani choosi oorukoka ...ee streevadulu ani cheppukone maga vallu vyakthi pooja(rachayitri ki),inka ardham leni vaadam cheyyadam baga ledu ..

    oka mahila nu yetteyyadaniki inko mahilanu kincha pariche vallu stree vadulu ani cheppukovadam siggu chetu ...

    ikkada kalpana gari vyakthi ga yevaru tappu pattaledu ..and we respect kalpana and any other same way ...ee kadha ni prize ki selct chesina vaari pai nizam gaa jaalipaduthunnanu ippudu... so inka sadaru part time lo part lu rase vyakhyatha gaaru ..jadges ki part lu rastaremo ika paina...ha ha ha

    ReplyDelete
  48. రమణి గారు, బాగుందండి మీ విశ్లేషణ. ఈ కథ చదివినప్పటి నుండి నాకు ఒక్క విషయం అర్థం కాలేదండి. ఈ కథలో ఎక్కడ కూడా భర్త ని చెడ్డవాడిగా చెప్పలేదు.

    ani sowmya garu annaru ..inka 10 mandi bhavistunnaru ...chathanaithe idi tappu ani stree vaadulu ani cheppukone time pass vyakhyathalu prove cheyyandi ..tarvatha matladandi ...(nothing is personal to any ...only a woman Can understand other woman,sarada or any to that matter ....so be sensible pls)

    ReplyDelete
  49. కల్పన గారు ఎక్కడా మల్టిపుల్ మీనింగ్స్ వచ్చేలా వ్రాయలేదు. కథ మళ్ళీ చదువు. కేవలం హక్కుల అడ్వొకసీ కోసమే ఈ కథ.

    ReplyDelete
  50. TestingWheel garu : నెనర్లు.. నేను ఒక పోస్ట్ వ్రాసి వదిలేసాను అన్నారు. వదిలేయలేదు. వాదించాను కూడా. కాని కుందేలుకి మూడుకాళ్ళే ఉన్నాయంటూ వితండవాదన చేసేవాళ్ళని ఉసిగొల్పడమెందుకని మౌనం అంతే. ఎవరి అభిప్రాయాలు వారివి.. నాకు కుందేలుకి నాలుగు కాళ్ళు కనిపిస్తున్నాయి. వాళ్ళకి కనపడట్లేదు వదిలేద్దాము. లోకోభిన్న రుచి కదా కాబట్టి ఇక దీని గురించి చర్చలు అనవసరం. వాళ్ళు మనమాట అవుననరు.. వాళ్ళ దారిలోకి మనం వెళ్ళము. కాబట్టి ఇక్కడితో ఈ పోస్ట్ కి చర్చలు ఆపేద్దాము. మన అభిప్రాయలు మనవి చెప్పేసాము అంతే.

    నాదేండ్ల గారు : స్పందనకి నెనర్లు.

    మార్తాండ గారు: చర్చలు ముగిసాయి. వాదనలొద్దు ఇక.

    ReplyDelete
  51. వితండవాదం ఎవరు చేస్తున్నారు. Hidden implications ఉన్నాయని మీరు అనలేదని మీరు సమాధానం చెప్పి కూడా hidden implications ఉన్నాయనే ఎలా నమ్ముతున్నారు? Hidden implications (రహస్య అంతరార్థాలు) లేకపోతే multiple meanings (బహుళార్థాలు) ఉండే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఆ అర్థాలు ఉన్నాయని వాదించిన TestingWheelని appraise చెయ్యడం ఎందుకు? మీకు మీ మాట మీద స్థిరత్వం లేదని మీరే నిరూపించుకున్నారు కదా.

    ReplyDelete
  52. పచ్చి అబద్దాలు, రచయిత్రి మీద బురద జల్లుడు ప్రచారం, దానికి కస్తూరి మురళీకృష్ణ లాంటి ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల సపోర్ట్. ఎందుకు ఈ దిగజారుడుతనం?

    ReplyDelete
  53. మీరే వితండవాదన చేసి మేము కుందేలుకి మూడు కాలు అని నమ్ముతున్నామని మా మీద అబద్దాలు ప్రచారం చెయ్యడం సిగ్గు చేటు. కల్పన గారు పది అర్థాలు వ్రాసారని ఒక మగ దురహంకారి అంటే దానికి appraisal ఎందుకు? కల్పన గారు నిజంగా పది అర్థాలు వ్రాసారని నిరూపిస్తే నేను గెడ్డం పెంచి సన్యాసంలో కలిస్పోతాను. ఆడవారయ్యుండి TestingWheel లాంటి మగ దురహంకార పశువులని appraise చెయ్యడానికి మీకు సిగ్గు ఉండాలి. నిజం చెప్పిన వాళ్ళ కుందేలుకి మూడు కాళ్ళు అనడం దివాళాకోరుతనమే. కల్పన గారి కథలో పది అర్థాలు ఉన్నాయన్నారు కదా. పది అర్థాలు వచ్చేలా ఎక్కడ వ్రాసారో చూపించండి. ఎవరికి సన్యాసం పుచ్చుకోవలసిన పరిస్థితి వస్తుందో తెలిసి పోతుంది.

    ఇట్లు ప్రవీణ్, praveen@pkmct.net

    ReplyDelete
  54. రచయిత్రి మీద పచ్చి అబద్దాలు ప్రచారం చేసి చర్చలు ముగిసాయి, వాదనలొద్దు అనడం ఏ రకం సంస్కారం. TestingWheel లాంటి మగ దురహంకారుల కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గు పడని ఆడవాళ్ళదా సంస్కారం?

    ReplyDelete
  55. మర్యాదగా కల్పన గారికీ, కొత్తపాళీ గారికీ, నాకూ ముగ్గురికీ సారీ చెప్పండి. లేకపోతే అది మీ లోని దివాళాకోరు తనానికే indication అవుతుంది.

    ReplyDelete
  56. రచయితలు, బ్లాగర్ల మీద వ్యక్తిగత దాడులు చెయ్యడానికే ఈ టాపిక్ తెరిచినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

    ప్రవీణ్, praveen@pkmct.net

    ReplyDelete
  57. రచయిత్రి పైనా, పాఠకుల పైనా సైకలాజికల్ దాడి చెయ్యడానికి తెర్చిన టాపిక్ ఇది.

    ReplyDelete
  58. ఈ సైకలాజికల్ అటాక్ కి మీరు బహిరంగ క్షమాపన చెప్పాలి. Multiple meanings లేకపోయినా అవి ఉన్నాయంటూ TestingWheel వ్రాసిన బురద జల్లుడు విమర్శలకి మీరు కూడా బాధ్యత వహించాలి.

    ReplyDelete
  59. నేను జోక్ చెయ్యడం లేదు. కల్పన గారు పది అర్థాలు వచ్చేలా వ్రాసారని మీరు నిరూపిస్తే నేను నిజంగానే సన్నాసుల మఠంలో చేరిపోతాను. నిరూపించలేకపోతే మీరు మీ కుటుంబాన్ని వదిలేసి కాషాయం కట్టుకుంటారా? చాలెంజ్ కి రెడీ అయితే praveen@pkmct.net కి మెసేజ్ పంపండి.

    ReplyDelete
  60. నాకు ఇంకా ఈ-మెయిల్ అందలేదు. రచయిత్రులు, పాఠకుల మీద సైకలాజికల్ దాడులు చేసే వాళ్ళు నాకు ఎప్పుడైనా ఈ-మెయిల్ పంపొచ్చు. చాలెంజ్ లో ఓడిపోతే నేను నిజంగా హిమాలయాలకి వెళ్ళి వైరాగ్యం స్వీకరిస్తాను.

    ReplyDelete
  61. చాలా మంచి విశ్లేషణ రమణి గారు. మీరు చెప్పిన అభిప్రాయాలు నా వరకు సబబుగానే తోస్తున్నాయి.

    ReplyDelete
  62. ఎవరన్నా ఒకరు తొందరగా సన్నాసుల్లో కలవండి బాబూ. లేకపోతే ఈ పనికిమాలిన గొడవతో, గుడ్డుకి ఈకలు పీకేవారితో బేజారెత్తి నేనే మఠంలో చేరేట్లుగా వుంది.

    ReplyDelete
  63. హా హా ..నేను వ్యాఖ్యాని౦చిన మొదటి టపా అనుకు౦టా ఇది ..అప్పటికి నా బ్లాగ్ కి ఒక ప్రొఫైల్ కాని, పేరు కాని లేదు:)

    మొదటి రోజే ప్రవీను కి బలి :)

    ఏవీ అప్పటి వివరణాత్మక చర్చలు ...

    ReplyDelete
  64. praveen garu mee ammagaru pelli chesukovachu chesukokapovachu chattam prakaramga dhanni thappu pattalem(meeraina emcheyaleru) kaani,oka bidda thana thallini veroka vyaktitho voohinchukunte athanantha ......emanalo theliyadamledu

    ReplyDelete
  65. sorry ramani garu mee posts anni okesari chaduvuthundathanto deeniki ippudu comment petta

    ReplyDelete
  66. థాంక్స్ అనుదీప్ గారు...కొంచం ఆరోగ్య సమస్యల వల్ల ఈ మధ్య ఆన్లైన్ కి రావడం లేదు అందువల్ల మీ కామెంట్ ఆలస్యంగా పబ్లిష్ చేయడం జరిగింది క్షంతవ్యురాలను.
    మన రాసే పోస్ట్లు చర్చించుకోడం కోసం లేదా అభిప్రాయం తెలియజేయడం కోసం కాబట్టి ఎప్పుడు చదివినా ఎన్ని సంవత్సారాలయినా అభిప్రాయాలు తెలుపుకోవచ్చు దానికి సారీలు ఎందుకండి? మీ అభిప్రాయాలని గౌరవిస్తూ స్వాగతిస్తున్నాను.

    నెనర్లు నా పొస్ట్లు చదువుతున్నందుకు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...