4.25.2010

మల్లికలారా .. మాలికలారా..చూశారా ఈ సంకలినిని..

పాప పరీక్షల హడావిడీ.. ఈదుతున్న చెంచాడు భవసాగరంలో అడ్డొస్తున్న కర్రముక్కల్ని ఏరుకోడంలాంటి వత్తిడిలులలో కాస్తా బ్లాగులకు తెర మరుగయి..మళ్ళీ వచ్చి ఏమి రాయాలి అని ఆలోచిస్తూ .. అసలు కూడలి జనాభా లెక్కల్లో నేనున్నానో లేనో చూసుకుందామని వరుసగా ఒక మూడు టపాలు పబ్లిష్ చేసేసి.. కూడలి దారి పట్టాను. జాబిత 1, జాబితా 2, జాబితా 3 ఇవన్ని మనకి అచ్చిరాని అంకెలు.. అందుకని చివరినుండి వెతుక్కుంటూ వచ్చాను.. ప్చ్.. లాభం లేదు అక్కడ మన జాడ కనుచూపు మేరలో కనిపించలేదు కాని, "మాలిక పనితీరు భేష్" అంటూ వికటకవి గారి పోస్ట్ ఒకటి నా కళ్ళనుండి దాటిపోతూ కనిపించింది. ఎవరబ్బా ఈ మాలిక ఎమన్న సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారా అని క్లిక్ చేసాను. ఇది కూడలి లాంటి తెలుగు బ్లాగుల సమాహారం అని తెలిసింది అక్కడ మొదటే నా పోస్ట్‌లు.. అరేరే!! ఇంత తొందరగానా అని ఒక నిముషం పాటు ఆశ్చర్యం కలిగింది. బాగుంది అనిపించింది. ప్రతిసారి ఇలా కాస్త విరామం అనిపించిన తరువాత , కూడలి అగ్రిగేటర్ కి ఒక విన్నపం సమర్పించుకోవాల్సి వచ్చేది "నా బ్లాగు కూడలి లో కనిపించుట లేదు " అని.. ఇప్పుడా అవసరం లేదని అనిపిస్తోంది మాలిక చూస్తే. మాలిక అగ్రిగేటర్స్ కి అభినందనలు మరియు ధన్యవాదములు.

మీరు కూడా మీ పోస్ట్లు సత్వరమే వీక్షకుల దృష్టికి తేవాలంటే మాలికలో మీ బ్లాగు చేర్చడం మరవకండి.
మాలిక: Telugu Blogs

4 comments:

 1. ఏదేమైనా మాలిక పనితీరు భేష్ . వాఖ్యలు సైతం నిముషాల వ్యవధిలో వచ్చేస్తున్నాయి. నా టపా ద్వారా మాలిక మీకు పరిచయం అయినందుకు ధన్యవాదాలు

  ReplyDelete
 2. "ఈదుతున్న చెంచాడు భవసాగరంలో అడ్డొస్తున్న కర్రముక్కల్ని ఏరుకోడంలాంటి వత్తిడిలులలో "
  చాలా చక్కగా చెప్పారు.

  ఒకసారి నా బ్లాగులో ఒకరి కామెంటుకి రిప్లయ్ వ్రాసి ఎందుకో వెంటనే మాలిక వ్యాఖ్యలు చూసాను. నా వ్యాఖ్య అప్పుడే అక్కడకి వచ్చేసి వుంది. మరీ ఇంత ఫాస్టా అని అచ్చెరువొందాను. మరోసారి ఒక టపా పబ్లిష్ చేసి వెంటనే మాలికకి వెళ్ళాను. ఎప్పుడూ వెంటనే వచ్చేది ఆ సారి వెంటనే తెరచుకోలేదు. ఏంటబ్బా ఆలస్యం - అప్పుడే మాలికకి కష్టాలు మొదలయ్యాయా అనుకున్నాను. కొద్ది క్షణాలలో తెరచుకుంది - దానితో పాటే మొదటివరుసలో నా టపా ప్రత్యక్షం. ఓ అందుకా ఈ ఆలస్యం అనుకొని నా టపా వేసిన కొద్ది క్షణాలలోనే మాలికలో ప్రత్యక్షమవడం చూసి మరింత ఆనందించాను.

  వికటకవి, రవిగారు మరియు ఇతరులు మూడు నిమిషాలలోనే మాలికలో తమ టపా వచ్చేసిందని అన్నారు కానీ నా టపాలు, వ్యాఖ్యలు మాత్రం కొన్ని సెకండ్లలోగానే ఈ సంకలినిలో కనిపిస్తున్నాయి. ఇంత ఫాస్టు అగ్రిగేటర్ని రచించిన ఏకలింగాన్ని మరోసారి అభినందించకుండా వుండలేకబోతున్నాను.

  ఇదివరలో ఏదయినా టపా గానీ, వ్యాఖ్య గానీ పబ్లిష్ చేసి ఏదయీఅ పొరపాటుగా వ్రాసానని అనిపిస్తే నాలుక కొరుక్కొని సవరించుకోవడానికి సమయం వుండేది. ఇలా పబ్లిష్ చేయగానే అలా వచ్చేస్తుంటే ఎవరూ చూడకముందే ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు నా ఏడుపు. వా :(( అందుకే మాలీక్ టీం నా టపాలయినా ఓ గంట ఆలస్యంగా వచ్చేలా చూడాలని ఇందుమూలంగా డిమాండ్ చేస్తున్నాను :)) అప్పుడు గానీ నాకు తీరికగా నాలుక కొరుక్కోవడానికి సమయం వుండదు!

  ReplyDelete
 3. మహిళా బ్లాగర్ల కోసం నేను రూపొందించిన అగ్రెగేటర్ http://women.bloggers.teluguwebmedia.net

  ReplyDelete

Loading...