5.01.2010

ఆ పాత మధురాలు

"అమ్మా అంత చిన్నప్పుడు పెళ్ళి ఎలా ఒప్పుకున్నావు?" అని ఆ మధ్యెప్పుడో మన మీడియాలో బాల్య వివాహాలు పై ప్రముఖుల చర్చ జరుగుతున్నప్పుడు, మా అమ్మని అడిగిన ప్రశ్న. "మాకేమి తెలుస్తాయే, ఎవో కొత్త పట్టుబట్టలు, మెళ్ళో నగలు వస్తున్నాయి కదా అని సంబరపడిపోయి తలొంచేశాము. 7 రోజుల పెళ్ళి చేశారు మీ తాతగారు నాకు మీ పిన్నికి (తనకి తన చెల్లెలికి) " అని ఇప్పటికి ఆ సంబరాల హేల చెప్తూ ఉంటుంది అమ్మ ఎదో నిన్నో మొన్నో జరిగినట్లుగా పూస గుచ్చినట్లులా , అసలు మా నాన్నగారి అమ్మగారికి ... అంటే మా మామ్మకి మా అమ్మ కాస్త చామన ఛాయలో ఉంటుంది అని అసలు నచ్చలేదుట.... "నువ్వేమో ముట్టుకుంటే కందిపోయేంత ఎరుపు , ఏమి బాగుందిరా నల్లగా "అంటూ ఎద్దేవా చేసేదిట. నాన్నగారు "చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను లేకపోతే ఇహ పెళ్ళే చేసుకోనని "మంకుపట్టు పడితే ... అలా ఏడేళ్ళ పిల్లని, 15 ఏళ్ళ అబ్బాయికి ఇచ్చి చేసిన వైనమిది.. అనుకోకుండా మా పిన్నికి కూడా అప్పుడే ఎదో దగ్గిర సంబంధం కుదిరితే అక్కా చెల్లెళ్ళిద్దరికి కలిపి చేసేసి ఒక అందమైన ఫోటో ఇలా......
ఒకవిధంగా మా నాన్నగారిది ప్రేమ వివాహమన్నమాట. మొదట ఎడమనుండి నాన్నగారు-అమ్మ. మా బాబాయ్ -పిన్ని (అమ్మ చెల్లెలు)


మూడో చెల్లెలికి నిశ్చితార్థం జరుగుతుండగా, అసలు వీళ్ళ నలుగురి ఫొటోలు లేనేలేవంటే ఎలా ఉన్నవాళ్ళు అలా కూర్చుని తీయించుకున్న ఫొటో మా అమ్మా.. వాళ్ళ చెల్లెళ్ళు... కుడినుండి ఎడమకి అమ్మ, పెద్ద చెల్లెలు, రెండో చెల్లెలు, మూడో చెల్లెలు..


2 comments:

  1. ammo 7yrs ke pella. asalu apudu valaki sariga tinadam kuda raadu kada. baboy 4 ammayila villandariki pelli cheyalante mi thathayya enni kastalu paddaro :(
    naku telisi appati kaalam lone easy ga ayipoyevemo.

    ReplyDelete
  2. తన నాలుగో కూతురి పెళ్ళికి తాతగారు లేరు స్వప్నా.. మా ఆఖరి పిన్ని మటుకు 10 standard వరకు చదివింది. అందరికి చిన్నప్పుడే జరిగినా 10 standard తరువాత 3 ఏళ్ళకో నాలుగేళ్ళకో అనుకుంట పెళ్ళి చేశారు. పై ముగ్గురిది బాల్య వివాహాలే.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...