5.03.2010

వేసవి- వెన్నెల - విరిసిన మల్లెలు

వేసవి అంటే నాకు చాలా ఇష్టం.. ఎంతిష్టమంటే మల్లెపూల గుభాళింపంత, మల్లెపూల గుభాళింపు తెలియనివారుండరు నాకు తెలిసి. వేసవిలో సాయంత్రం అవుతూ ఉంటే చల్లటి పిల్లగాలులతో మొదలై, పక్కనెక్కడన్నా మల్లెతీగ అల్లుకుని ఉంటే ఆ పిల్లగాలి తీసుకుని వచ్చే ఆ మల్లెపూల గాలి తెమ్మెరల గుభాళింపు, ఈ జీవితానికిక ఇది చాలాదు అనిపించేంత భావుకత రాదూ..అలాంటి సమయంలో ఇష్టసఖి చెంతనుంటే ఇహ చెప్పేదేముంది..వెన్నెలలోనే వేడి ఏలనో,వేడిమిలోనే చల్లనేలనో
ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలి

అంటూ వెన్నెలలో చల్లగా ... అమాయకంగా మనవైపు చూస్తూ కనిపిస్తున్న జాబిలిని ఎంటి ఇంత మాయా చేసేస్తున్నావు అని ప్రశ్నించమా?

వెన్నెలలోనే విరహమేలనో,విరహములోనే హాయి ఏలనోఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలి....

ఈ నీలాపనింద నాకేమిటమ్మా? మీ ఇరువురుమధ్య నేనెందుకు అని చందమామ మబ్బుల చాటుకి చేరుకున్నప్పుడు, సన్నటి చిరునవ్వుతో.... ఏమిటీ విరహం అంటూ ప్రియురాలు అడిగితే..

మొన్నటికన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా...మొన్నటికన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా.....
నీ సొగసూ నీ వగలూ హాయిహాయిగా వెలసేనే
వెన్నెల రాత్రులు ఏరోజు కారోజు కొత్తే కదూ.. మొన్నొకలా నిన్నొకలా నేడు ఇంకో వింతగా..

వెన్నెలలోనే వేడి ఏలనో,వేడిమిలోనే చల్లనేలనోఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలి
రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా..
రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగానీ కళలూ నీ హొయలూ చల్లచల్లగా విరిసేనే
రూపందేమి ఉంది, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, చల్లటి చూపు చక్కటి స్నేహం .. ఎప్పటికి మనకి సేద తీర్చే సాధనాలు.....

వెన్నెలలోనే హాయి ఏలనో, వెన్నెలలోనే విరహమేలనో
ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలివెన్నెలలోనే విరహం, విరహం వల్ల వేడి, ఆ విరహం వేడే ఎంతో హాయి..
వేసవి రాత్రులు మల్లెల సౌరభాలతో కొత్తగా పెళ్ళయినవారికయినా, ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకొనే షష్టిపూర్తి దంపతులకయినా నిజంగానే ఆ నిండు చంద్రుడు ఎదో మాయ చేసాడనే అనిపించక మానదు..
*****

పొద్దున్నే ఎదో తెలుగు ఛానెల్‌లో పెళ్ళినాటి ప్రమాణాలు చిత్రంలోని ఈ పాట గురించి చెప్తూ .... కొత్తగా పెళ్ళయినవారికి ఈ వేసవి వెన్నెల పాటలు అంటూ ఉంటే అనిపించింది, కొత్తగా పెళ్ళయిన వారికే కాదు దంపతులైన ప్రతి ఒక్కరు ఆస్వాదించాల్సిన చల్లటి వెన్నెల గాలులు, మల్లెల సౌరభాలు, ఇహ అదే సమయంలో దంపతులు వెన్నెలంత తెల్లటి వస్త్రాలు ధరిస్తే అనుకొకుండా అనలేమా ఇలా....

కిన్నేసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి...

ఘల్లు ఘల్లున కాలి గజ్జెలందెలు మ్రోగా కలహంస నడకల కలికి ఎక్కడికే ... అంటేస్వామీ!! నీ ప్రణయ సన్నిధికే.... అనే సమాధానం ...

ప్రస్తుతం ఉన్న కాంక్రీటు అరణ్యంలో డాబాలు, మల్లె తీగలు... వెన్నెల విస్తరించాడాలు లేకపోయినా ఉన్నంతలో ఇలాంటి వాటిని ఆస్వాదించడం మన తెలుగువారి గొప్పదనం.

నాకు ఇష్టమైన పాటలు ఇవి.. అందుకే మరోసారి ఆ ఆలోచనలు మీతో పంచుకున్నానిలా.
****

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...