11.12.2017

లేఖాసాహిత్యం -1



అమ్మలూ
ఎలా ఉన్నావురా? కొత్త ఊరు, కొత్త ఇల్లు, అందరూ కొత్తవాళ్ళు, అమ్మా, నాన్న తమ్ముడూ ఈ వాతావరణం నుండి, అత్తా.. మామ, భర్తా, మరిది, ఆడపడుచూ అందరూ కొత్తవాళ్ళే , కొత్తదనం, కొత్తప్రపంచం. కాని అదే మన ప్రపంచం నాన్నా.... నువ్వు అత్తారింటికి వెళ్లావు అనే కాని, ఎందుకో గులాబి రంగు గౌనులో నెమ్మదిగా ఒద్దికగా ఎక్కడ పడిపోతానో అన్నంత జాగ్రత్తగా పునాది వేస్తున్న ఆ మట్టిగుట్టని దాటుతున్న నా చిన్నారి కూతురే నా కళ్ళముందు తిరగాడుతున్నట్లు ఉంది. ఇంతలో ఎంత మార్పు. ఆడవాళ్ళం అత్తగారింట్లో ఇలా ఉండు, అలా ఉండు, అనే జాగ్రత్తలు నేను చెప్పక్కర్లేదురా.. పరిస్థితులు, అక్కడి స్థితిగతులు మనం ఎలా నడుచుకోవాలో మనకి నేర్పేస్తాయి. అత్తగారిల్లనే కాదు ఎవరయినా మన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ మన ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడకుండా ఉంటె అందరూ మనవాళ్ళే. మనసు మాట విను. మమతలతో మనిషిని జయించు, ప్రేమతో మనసుని సొంతం చేసుకో.... మనకి ఎన్ని సాంకేతిక సౌకర్యాలు వచ్చినా మనం సొంతంగా తయారు చేసుకుని ప్రేమగా పిల్లలితో, మనవాళ్ళతో, పంచుకునే అనుభూతులే ఎప్పటికి నిలిచేవి. అధూనికత అలసట తీర్చడానికే గాని సోమరితనం పెంచడానికి కాదు. 
ఉంటాను అమ్మలు... వీలయినప్పుడల్లా నీతో ఇలా నా అనుభూతులని పంచుకుంటూ ఉంటా....

ప్రేమతో 
మీ 
అమ్మ. 
**********

కూతురికి పెళ్ళయితే తల్లి తన అనుభవసారాన్ని , అక్షరరూపంలో లేఖగా మార్చి తెలిపే ప్రయత్నం ఈ లేఖా సాహిత్యం... ప్రతీ కూతురికి ఉపయోగపడుతుంది అన్న ఆశతో...

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...