11.14.2017

వనభోజనం - మన భోజనం 2. ఆనంద్ మోహన్ ఓరుగంటి గారుతమ తమ  రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరుప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగు వారిలో ముఖ్యులు శ్రీ ఆనంద్ మోహన్ వోరుగంటి గారు. 


ఆయన ఎదుర్కున్నప్రతిబంధకాలు, సంక్లిష్టపరిస్థితులు, అనుభవించిననిర్భందాలు, పడినఆవేదన, చేపట్టినదీక్ష, చేసినకృషి, సాధన, కనపరచినపరకాష్ట, సాధించినవిజయాలు, ఆ విజయరహస్యాలు ఆటుపోట్ల అనుభవం నుండి ఎంతో విశ్లేషణా శక్తి పెంపొందించుకున్నారు. అవగాహన కూడా బాగా దృఢపడింది. లోతైన ఆలోచనలతో క్షీర సాగర మదనంలా సంగీత సాగర మదనం చేయసాగారు. రాగ భావంలో ఉన్న నిగూఢ నిక్షిప్తార్ధలను ఆకళించుకున్నారు. వీరి సంగీత నైపుణ్యం తారా స్థాయికి ...చేరుకొని ఏర్పడ్డదే సంగీత క్షీర సాగరం. "సంగీత క్షీర సాగరం"  నిర్వహణలో త్యాగరాజ గాన సభలో ఎన్నో సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. 

వన భోజనాల కార్యక్రమం ఉంది అనగానే  "ఎక్కడ" అని తానె అడిగి వచ్చి అద్భుతమయిన్న తన గాత్రాన్ని మనకి వినిపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఉన్నది కొంచం సేపే అయినా మర్చిపోలేని అనుభూతిని ఇచ్చి, అందరినీ ఆశీర్వదించారు బాబాయ్ గారు శ్రీ ఆనంద్ మోహన్ ఓరుగంటి గారు. 
No comments:

Post a Comment

Loading...