11.13.2017

వనభోజనం- మనభోజనం ఓ విశ్లేషణ

మా ఇంటికి స్కూల్ పక్కనే ఉండడంతో  మధ్యాహ్నం ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్ళేవాళ్ళం. కాని ఆ వయసులో నాకు అలా ఫ్రెండ్స్ అందరూ మధ్యాహ్నం బాక్స్ లు తెరిచి తింటుంటే మా అమ్మ కూడా అలా బాక్స్ కట్టిస్తే బాగుండును అనిపించేది. అదే అమ్మతో అంటే "ఎందుకూ ఇంటికొచ్చి వేడి వేడి అన్నం తినక వెధవ్వేషాలు వేయకు... అయినా పొద్దున్నే పూజ అవి ఏమి లేకుండా నేను వంట చేయను " అని ఖరాఖండిగా చెప్పేసింది. ఒక్క నవంబర్ నెలలో మటుకు కాస్త పులిహోర చేసి గుళ్ళో ఉసిరి చెట్టుకింద కూర్చుని తినమని పంపేది. అర్థం అయ్యేది కాదు ఎందుకలా నవంబర్ నెలలోనే గుడిదగ్గర తినడం .. అనిపించి ఒక్కోసారి ఫ్రెండ్స్ తో కూర్చుని స్కూల్ దగ్గర తాటి చెట్టుకింద కూర్చుని తినేదాన్ని. ఆ బాక్స్ ఇచ్చినప్పుడు మటుకు ఎప్పుడు లంచ్ బెల్ అవుతుందా ఎప్పడు చెట్టు కింద కూర్చుని తిందామా అని ఎదురు చూసేదాన్ని.  మళ్ళీ సంవత్సరం దాకా ఆ అవకాశం రాదు కదా.. ఇదొక బాల్య జ్ఞాపకం. 
*****
స్కూల్ జీవితం అయి కాలేజ్ జీవితాలు మొదలయ్యేప్పుడు ఇక అమ్మ రోజు బాక్స్  కట్టి ఇవ్వడం ఫ్రెండ్స్ అందరం తలాకాస్తా  పంచుకుని సరదాగా తినేవాళ్ళం. ఈ  ఉప్పోద్ఘాతం ఇప్పుడు ఎందుకు అంటే వనభోజానాలు నాకు చాలా ఇష్టం ఎక్కడెక్కడివాళ్ళమో వాళ్ళు   బంధువులయినా కావచ్చు, స్నేహితులయినా కావచ్చు, సహోద్యోగులయినా కావచ్చు అందరం కలిసి వనంలో భోజనం చేయడం. యాంత్రిక జీవితం నుండి బయటకి వచ్చి ఆహ్లాదంగా గడపడం. 

సరే, కార్తీకమాసం, దీపాలు, దీపదానం,              కార్తీక పురాణం , పుణ్యం లాంటివి స్నేహితులతో పాటించడం కష్టమే.. గత 3 సంవత్సారాలుగా కార్తిక మాసంలో ఫేస్  బుక్ స్నేహితులతో వనభోజనాలు మిత్రుల    సహాయ సహకారాలతో నిర్వహిస్తూ ఉండేదాన్ని. కిందటి సంవత్సరం బ్రేక్ చేయలేదు .... కారణాలు   గుర్తు లేదు.... ఈ సారి                  ఫేస్ బుక్ స్నేహితురాలు గీతా గడ్డం ని కలవడానికి వెళ్ళినప్పుడు  కలిసిన కొత్త మిత్రులు  లాయర్ అరవింద కృతిక, జర్నలిస్ట్ శ్రీ శౌరి  కుమార్ గారు... మాటల సందర్భంలో వీరు వనభోజానాలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని అడిగినప్పుడే  ఈ సారి వనభోజనాలకి  శ్రీకారం  చుట్టేసాం. అలా కిందటి నెల 27                    న  రూపు దాల్చిన ఆలోచన      నిన్న ఆదివారం ప్రాణం పోసుకుని పెద్దల ఆశీర్వాదంతో                విజయవంతం అయింది. 

నాదొకటే ఆలోచన వనభోజనాలు కుల భోజనాలు  కాదు. అందరం కలిసి ఉండడమే దీని వెనక ఆంతర్యం , రెండోది సామాజిక   మాధ్యమాల్లో ఉండే స్త్రీ ల గురించి ఏంతో మంది మేధావులు ఎన్నోసార్లు నాముందే   అనే మాటలు మనసుని కలిచి వేస్తాయి. వాళ్ళు పని పాట లేక ఫేస్ బుక్లో ఉంటారని, ముఖ్యంగా  చీప్ ఆలోచనలు, వాళ్ళకి క్యారెక్టర్ ఉండదని, లేదా ప్రేమిస్తున్నామని చెప్తే ఎగేసుకుని వచ్చేస్తారనే భ్రమలో ఏంతో మంది ఉన్నరు. ఫేస్ బుక్ అనే కాదు , ఏ సామాజిక మాధ్యమాల్ల్లో చురుకుగా ఉన్న స్త్రీలకి వ్యక్తిత్వం ఉంటుంది . వాళ్ళు ఎటు కీ ఇస్తే అటు ఆడే బొమ్మలు కాదు. వాళ్ళ ఆలోచనలకో , వాళ్ళ స్థాయికో ఏదిగి వారి వ్యక్తిత్వాన్ని గౌరవించండి. అని తెలపడానికి,  హితులందరూ మంచి మనసుతో కలిసి కబుర్లు చెప్పుకోవచ్చు.ఫేస్ బుక్ స్నేహితులు అందరూ  ఫేక్ స్నేహితులు కారు వారిలోని స్వచ్చమయిన కల్మషం లేని మనుషులు ఉంటారు. అన్న నిరుపణే ఈ వనభోజనాల కార్యక్రమాలు. ఈసారి అందరూ వచ్చారు. ఫేస్ బుక్  లో నేను అడ్మిన్ గా  ఉన్న  నవ్వుల కుటుంబం నుండి కూడా         పలువురు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసారు.కుల మతాలకి అతీతంగా ఫేస్ బుక్  రూమర్లకి చెక్ పెట్టె విధంగా , ఏంతో మంది   ప్రముఖుల సమక్షంలో హుందాగా జరిగాయి             ఇందిరాపార్క్ లో  వనభోజనాలు ఆనందంగా.......

హాజరయిన ప్రముఖుల గురించి తరువాత పోస్ట్.లో 

వనభోజనాల ఫోటోలో అన్ని ఒక పోస్ట్ లో  మీకోసం 






No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...