5.04.2010

ఎవరా నలుగురు? అయినా... నాకెందుకులెండీ ..

ఆమధ్య పోటిలకి.... ఆధిపత్యానికి తట్టుకోలేక, ఎవరో చిన్న హీరో ఆత్మహత్య చేసుకోబోయి, చావు తప్పి కన్ను లొట్టపోయి, "మా సినిమాలనికూడా ఆదరించండి" అంటూ .....సినీపరిశ్రమ ఎవరో నలుగురి పెద్దల చేతిలో ఉంది కాపాడండి.... అని మానవహక్కుల సంఘానికి పిర్యాదు చేసారుట. సరే, ఆ కథ ఏమి జరిగిందో కాని, బ్లాగుల్లో కొత్తవారి పరిస్థితి ఆ చిన్నహీరోలాగే ఉన్నట్లుగా ఉంది.

నేను వచ్చిన కొత్తలో అనుకుంట ఒక్కో ఒక్కో బ్లాగు చదువుకుంటుంటే స్ఫురించిన విషయం, బ్లాగుల్లో అంశాలు వేరు వేరు ... కాని వ్యాఖ్యలు మటుకు అన్నిటికి ఒకటే, హహ్హహహ సూపర్, చాలా బాగా రాశారు. అంటూ అన్నిటిలోను అనుకుని కాపీ పేస్ట్ చేసినట్లుగా.. అదేదో సినిమాలోలా, (ముందు హీరోయిన్ని అడిగిన ప్రశ్నలకి చెప్పిన సమాధానాలు తరువాత వచ్చే కమేడియన్ చెప్తే , ఆవిడ చెప్పిన జవాబులే ఇతనూ చెప్పాడుగా ... ఇతనికి కూడా మన కాలేజ్లో సీట్ ఇవ్వాల్సిందే అని అటెండర్ మంకుపట్టు పట్టినట్లు), అక్కడ ఏమి రాసీనా వ్యాఖ్యలు రాయాల్సిందే అని ఎవరో చెప్పినట్లుగా వస్తాయి కామెంట్లు. ఒక నలుగురి పేర్లు మటుకు కామన్‌గా... అసలు పోస్ట్ చదువుతారా ?? అన్నదే నాకు కించిత్ అనుమానం అప్పట్లో, చదవరని తరువాత తెలిసింది, నాసిరకం, చౌకబారు వ్రాతలకి ఆహా !! ఒహో !!! అని పొగిడేసేవాళ్ళని చూస్తుంటే అసలు అలాంటి వాళ్ళ వ్యాఖ్యలు మనకొద్దులే అనిపిస్తుంది.
నా పాత బ్లాగులో అనుకుంట ఎదో కథలో నాకు నాచ్చని అంశాలని ప్రస్తావిస్తూ రాసినప్పుడు , మధ్యలో వచ్చే జయదేవ అష్టపది అర్థం అందరికీ తెలీదు, కొంత అన్నా ఆ అష్టపది అక్కడ వాడిన వివరణ ఇవ్వాలి అని చెప్తూ , రచయిత/రచయిత్రి తను రాసే పదాలు సామాన్య పాఠకుడు చదివే అందుబాటులో రాయగలగాలి అంటే ఒక మెట్టు దిగాలి (పాఠకుడి పరిజ్ఞాన స్థాయికి రావాలి ) అని రాశాను. దానికి అప్పట్లో అందరూ కాస్త నామీద కినుక వహించారు " ఎంతమాట ... ఎంతమాట రచయితని మెట్టు దిగమంటావా " అని.. కాని, అదే కథలో ఒకపాత్ర ద్వారా వేరే ప్రాంతీయ భాష మాట్లాడించడం?? అన్ని ప్రాంతీయాలు వాడినప్పుడు, మరి అష్టపది అర్థం చెప్పడం తప్పేమి కాదు కదా అని అప్పట్లో చిన్న వాదన జరిగింది.

మరి ఇలాంటివన్నీ పట్టించుకునే అలాంటి గొప్ప ప్రతిభావంతులు , సూక్ష్మగ్రాహులు అయిన ఆ పాఠకులు రచయిత్రులు/రచయితలు... ఈరోజు అర్థం ... పర్థం, సరైన వ్యాకరణం లేని పోస్ట్‌లకు వ్యాఖ్యలు రాయడం నిజంగా హాస్యాస్పదం. తినగ తినగ వేప తీయగుండు అని అన్నట్లు, అవతలి వారి వ్యాకరణల్లేని ఆ భాషకి వీళ్ళు కూడా చదివీ ...చదివీ అలవాటు పడిపోతారేమో... మన సినీ పరిశ్రమలో వారసులను చూడడం మనము అలవాటు చేసుకున్నట్లుగా.. అంతేనేమో..:-)

అయినా నాకెందుకులెండీ .. "వేలుమీద గోరు మొలిచింది వెఱ్ఱిమొగుడా వేరుండు" అన్నట్లు... రమణి ఏదో రాసేసింది బ్లాగులకి దూరంగా ఉండు అనేస్తారేమో...

తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటివీ బ్లాగు గోలలు. ఎదో ఆలోచన వచ్చింది అవునా... నిజమేనా.. నా ఈ ఆలోచన అని అడగడమే తప్పితే వెరే ఏ ఉద్దేశ్యం లేదు. :-)
******

13 comments:

  1. ఈ బాణం ఎవరిమీద ఎక్కుపెట్టారు చెప్మా?

    అయినా నాకెందుకులెండీ :))

    ReplyDelete
  2. అసలు కెబ్లాస పుట్టిందే దీనివల్ల కదా? కానీ ఇప్పుడు కొత్తవారికి అలాంటి ఇబ్బందులు ఉన్నట్టులేవు - 2009 గొడవలలోనే ఎవరి పరిమితులు వారికి ( ఏదో ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే) తెలిసొచ్చాయనే అనుకుంటున్నా.

    2009 కొత్తల్లో ఉన్నట్టు జూనియర్ల "రేగింగ్" అయితే లేదు

    ReplyDelete
  3. హహ్హహహ సూపర్, చాలా బాగా రాశారు
    :))

    ReplyDelete
  4. నేనూ కొత్తే .. ఆ నల్గురెవరొ చెప్పి పున్యం కట్టుకొంది. వ్యకరనం అంటే యెంతి?

    ReplyDelete
  5. రౌడీ గారు : మీరు కొంచం "ప్రమాదవనం" నుండి బయటకి రండి సర్, ఎక్కడా వ్యాఖ్యలు చదువుతున్నట్లు లేదు. ఒకసారి ఒక వారం ముందుకు రీల్ తిప్పుకుని వ్యాఖ్యలు చదవండి తెలుస్తుంది ప్రమాదవనంలో చిక్కుకుని ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారేమో :-)

    శరత్ గారు:sossssooooo ఆ నలుగురులో ఒకరు దొరికారన్నమాట. కొత్తలో మీరు కూడా ఇలాగే రాసినట్లున్నారు మొహమాటానికో మరి ఏ గ్రూప్ సభ్యులుగానో.. ;-)

    రాణిగారు : థాంక్స్ అండీ :-)

    ReplyDelete
  6. sorry for the mistakes. తెలుగు టైప్ ఇంకా కొత్త.
    వ్యాకరణం అంటే sentence construction? idiom?

    ReplyDelete
  7. భలే రాశారు .... whatever it is

    ;-)

    ReplyDelete
  8. "అర్థం ... పర్థం, సరైన వ్యాకరణం"

    ఏమోనండీ, కామెంట్లు వేసేముందు ఇవన్నీ నేను పెద్దగా చూడను - ఆలోచించను. నాకు ఆ టపాలో కొద్దిగా ఏమయినా నచ్చితే కామెంటుతాను, బాగా నచ్చకపోతే మెంటుతాను.

    ReplyDelete
  9. ఎవరండీ ఆ నలుగురు? నాకెప్పుడూ తగిలినట్టులేరు?
    అయినా నేను బ్లాగు మొదలెట్టింది ఈ సంవత్సరంలోనేగా, గత సంవత్సరంపు గొడవలైతే తెలిసే అవకాశం లేదు, ఒకే ఒక్క గొడవ తప్ప (అదేమిటో మీకు నేను చెప్పక్కర్లేదు, మీరూ బాధితసంఘ సభ్యులే).....ఆ నలుగురెవరో చెప్పి పుణ్యం కట్టుకోరాదూ, ఊరికే ఇలా ఊరించక.

    ReplyDelete
  10. మిరియప్పొడి గారు ఇంతకుముందెప్పుడో మీ వ్యాఖ్య నా బ్లాగులో చూశాను. అందుకనే అలా కావాలని రాసారనుకున్నాను. ఎలా రాసినా చాలా థాంక్స్ అండి.

    అబ్రకదబ్రగారు: చాలారోజుల తరువాత కనిపించారు.. థాంక్స్.

    శరత్ గారు : :-)

    సౌమ్య గారు: తెలుసుకుని ఏమి చేస్తారు? ఇదివరకు బ్లాగుల్లో అందరూ మనవాళ్ళే అని అనేసుకుని, నలుగురితో నారాయణ .. గుంపులో గోవిందా అన్నాను. తెలిసిన తరువాత టచ్ మి నాట్ అంటూ నా మానాన నేను రాసుకుంటూ గడుపుతున్నాను. సరదాగా నలుగురితో ఉం... టూ ఎంచక్కా సంఘ సేవ (ప్ర పీ స స ) చేసుకోడమే ఉత్తమం కదా. ;-)

    ReplyDelete
  11. ఏంటో మీరు ఒకటి చెప్థె నాకు రెండు దౌబ్త్స్ వస్తున్నై.
    నెను ఇప్పుదె బ్లొగ్ తెరిచను. ముసెసుకుని వెల్లిపొవదం మంచిది అంతారా?

    ReplyDelete
  12. మిరియప్పొడి గారు: :) ఏ అర్థాలు తీసుకోకండి హ్యాపీగా బ్లాగు రాసుకొండి.... ఇక్కడ అందరూ స్నేహితులు, హితం కోరేవారు..

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...