5.11.2010

శ్యామల... ఒక హాట్ టాపిక్

శ్యామల ఎవరబ్బా ఈవిడా అని అనుకుంటున్నారా? నిజానికి ఒక నెల .. రెణ్ణెల్ల ముందు దాకా నాకు తెలీదు ఈవిడ.. మీకో సెలబ్రిటీ ని పరిచయం చేస్తాము ఆవిడని మీరు ఎలాంటి స్ట్రైట్ క్వొశ్చన్స్ అన్నా వేయొచ్చు అని అదేదో టి.వి లో వస్తే ... ఎవరబ్బా ఈవిడ? పేరెప్పుడు వినలేదే అని అనుకున్నా.... ఆరోజు మర్చిపోకుండా వాళ్ళన్న టైంకి ఆ ముఖా ముఖి చూశా. ఆవిడ ఒక జోగిని... జోగిని వ్యవస్థని రూపుమాపడానికి కృషి చేస్తున్నారావిడ. ఆ కార్యక్రమంలో ముఖ్యమైన ప్రశ్నలు:

1 ప్రశ్న . అసలు జోగిని అంటే ఏంటి..

జవాబు: మాకు యుక్త వయసు రాగానే దేవుడికి ఇచ్చి పెళ్ళి చేసి ..ఆ ఊరిపెద్ద దగ్గిర మమ్మల్ని ఉంచేస్తారు.... ఇహ ఆ ఊరి పెద్ద మా ఆలన పాలన చూసుకుంటారు.

2 ప్రశ్న . మిమ్మల్ని సెక్సీ స్టార్ అని పిలుస్తుంటే మీరెందుకు ఊరుకుంటున్నారు వద్దని చెప్పొచ్చు కదా.

జవాబు: అదంతా వాళ్ళ అభిమానమండీ.. అభిమానులందరూ వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లతో పిలుచుకుంటారు. ఇప్పుడు భగవంతుడిని వివిధ రూపాలతో కొలవడం లేదా?? అలాగ.. నేను ఎవరికీ ఏమి చెప్పను.

3 ఫ్రశ్న: మీరెందుకు పెళ్ళి చేసుకోలేదు..

జవాబు: మా పెద్దలు నేను ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండడమే నాకు ఇష్టం.. మా కుటుంబ వృత్తి ఇది, నెనిలాగే ఉంటాను అన్ని దేవాలయాలకి తిరుగుతాను. దేవుడి దయవల్ల నాకింత పేరు వచ్చింది ప్రజలు నా ఆశయాలని హర్షించారు, నా అశయ సాధనని నేను మరిత ఉధృతంగా ప్రచారం చేస్తాను. ఈ వ్యవస్థ నశించాలి, మేము మనుషులమే .. మాకు హక్కులుంటాయని తెలియజెప్పుతాను...మొ...

4. జోగినుల పెళ్ళికి మీరు వ్యతిరకా?

జ: లేదు జోగినులకి పెళ్ళంటూ ... వారికీ ఒక కుటుంబమంటూ ఉండాలి, నాకు తెలిసి ఒక జోగినికి వివాహం చేశాము.. 2 నెలలకు వాళ్ళ భర్త చనిపోయారు..... ??? :(

ఇవి ముఖ్యమైన ప్రశ్నలు ఆరోజు ఇంటర్వ్యూలో..

నిన్న ఇంకో ఛానెల్ లో నాకీవడ ప్రత్యక్షమయ్యారు.. మానవ హక్కుల సంఘానికి "జోగినీ వ్యవస్థ నశించాలి " అంటూ ఒక వినతి పత్రం సమర్పించారుట. అదిగో అప్పుడు గుర్తొచ్చింది ఈ ముఖా ముఖీ ప్రోగ్రాం.

మీరు విన్నారుగా/చదివారుగా .....పూర్తిగా నేను రాసినట్లే కాకపోయినా అక్కడి ప్రశ్నలకి మటుకు జవాబులు అవి..

ఇక్కడ మనిషి అన్న ప్రతి ఒక్కరికి కొన్ని ప్రాధమిక హక్కులుండాలి . ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండాలి. అలాగే ఈవిడ ఆశయం కూడా మెచ్చుకోతగ్గదే. కాని.. తను పాటించాలి కదా, ఎవరెలా పిలిస్తే అలా పలుకుతాను, ఎవరు ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వస్తాను కాని, జోగిని వ్యవస్థ అనేదే ఉండకూడదు అని చెప్పడం... శ్యామలగారు ఒక జోగినినే, జోగినలకి పెళ్ళి చేయాలి, వాళ్ళకీ ఒక కుటుంబం అంటూ ఉండాలి, వాళ్ళకి సంఘంలో గౌరవం ఉండాలి అని ఆశిస్తున్నప్పుడు, ఎవరో జోగీనికి పెళ్ళయింది.. కాని రెండు నెలలకే భర్త చనిపోయాడు.. మా సాంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను అని సమాధానం ఎందుకు? మరి మిగతావాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? మనము మారాలి అంటే ... ఆ మార్పు వల్ల ప్రయోజనం ఆశించాలి కాని, మార్పు చెడు కాకూడదు కదా.. ఇంత చిన్న విషయం ఈ సెలబ్రిటీకి అర్థం కాలేదా? ఫోన్ చేసిన ప్రతిఒక్కరికి తన మెయిల్ అడ్రస్స్ ఇస్తూ మెయిల్ చేయమనడం?? అసలు నచ్చని వ్యవస్థ అంటూ ఒకటి ఉన్నప్పుడు దానిని రూపుమాపాలి అని నడుం బిగించిన నాయకురాలి లక్షణాలు.???..

తను మారి దీని వల్ల ఇంత ప్రయోజనం ఉంది కాబట్టి నేనిలా అడుగుతున్నాను అని చెప్పగలిగే అవకాశం ఉంటుంది కదా..

ఏంటో ! నాకిలాంటివి అర్థం కావు... అసలు ఎవరికి తెలియనివారిని పిలిచేసి, ఇలా ముఖా ముఖీ అంటూ ... ప్చ్ ! ప్చ్ ! మరీ ఇంత రేటింగ్ పిచ్చా?

జోగిని వ్యవస్థ అనేది ఇంకా ఉందా? ఉంటే మరి అది ఉండాలా ? వద్దా?? .. శ్యామలగారికి ఈ సమాధానం తెలుసా? ఈవిడ మమ్మల్ని కించపరుతోంది అని ఇంకొకావిడ పేపర్ లో స్టేట్‌మెంట్ ఇచ్చిందిట ఇటూ ఒక లుక్కేయండి.. శ్యామల జోగిని కాదు! సీనియర్ జోగిని రేవతమ్మ
*****

ముగింపు: ఆరోజు లెక్కలేనన్ని ఫోన్ కాల్స్‌తో (అందరూ మగవాళ్ళేనట) ఆ ఛానెల్ రేటింగ్ రికార్డ్ స్థాయి కి చేరుకుందిట. :) మగవాళ్ళు మీకు జోహార్లు.
*****

6 comments:

  1. మీకు తేలేని కేక ఏంటంటే అసలు ఆ శాల్తీ శ్యామల కాదు శ్యాం కుమార్. నాలుగేళ్ల కిందటే స్త్రీగా మారాడు ... అది కథ

    ReplyDelete
  2. ఇంకో విషయం.ఈ శ్యామల సెక్స్ మార్పిడి చేసుకున్న శ్యామల రావు అట.తెలుసా?

    ReplyDelete
  3. అంతా వ్రాసారు కానీ శ్యామల ఫోన్ నంబరు కానీ, ఈమెయిల్ కానీ, ఫోటో కానీ ఇచ్చారూ? మీ జోహార్ అందుకోలేకపోయాను. ప్చ్.

    ReplyDelete
  4. అబ్బ అబ్బ బలేగుంది. ఇక్కడకూడ ట్రాణ్స్ జెండర్ ప్రొఫెషనల్స్ అన్న మాట. బూతు వ్యవహారాలు టీవీల్లో చూపిచ్చుకోడానికి తెల్లోళ్ళకంటే మనమేంఇ తీసిపోయాము, మన అభివ్రుద్ది కూద చుపిచ్చుకొవల గదా

    ReplyDelete
  5. శ్రీనివాస్ గారు , చెప్పుదెబ్బలు.. గారు: ఇప్పుడే మీ ద్వారనే తెలిసిందీ విషయం. ఇప్పుడు తెలిసిన తరువాత ఆవిడలో ఏమన్నా ఆడ/మగ లక్షణాలు హావభావాలు కనిపిస్తున్నాయ అని ఆవిడని గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను కాని ఆ రూపం కూడా స్మృతిపధంలోకి రావడం లేదు అదేమిటో.. :)

    శరత్ గారు: ఈ పాటికి అటో... ఇటో తేల్చేసుకోడానికి ఆవిడ ఫోన్ నంబరో, మెయిల్ అడ్రస్సో ఎదో సంపాదించేసి ఉండాలే... మనలో మనమాట.. హైరానపడో , హడావిడి పడో మీరు రాకండి.. ఆవిడనే/అతనినే రమ్మంటే, ఎక్కడికన్నా వచ్చెస్తారట. అభిమానులు ఎలా పిలిచిన పలుకుతాను... ఎక్కడికైనా వచ్చేస్తాను అని.... ఉవాచ మరి...
    మిరియప్పొడి గారు: :)

    ReplyDelete
  6. ఏంటండి కొత్త పొస్త్ రాయలెదు? మీ పాత పొస్త్స్ అన్ని చదివెస
    చాల రెగులర్గ రాస్తారు కద

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...