8.01.2016

మన గోదారోళ్ళు !

ఫేస్ బుక్  స్నేహాలని మోసం చేస్తుంది, స్నేహాలని  కబళిస్తుంది. నమ్మినవాళ్ళని నట్టేట్లో ముంచుతుంది. ఫేస్ బుక్ ఒక మానియా, ఒక ఫాబియో, ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు.  చేతిలో సెల్ ఉంటె చాలు ఫేస్ బుక్, చాటింగ్, స్టేటస్ అప్డేట్స్ అంటూ యువత పెడదారి తొక్కుతున్నారు. మరి ఇలాంటి నేపధ్యంలో ఫేస్ బుక్ తనని కాపాడి తనకి పునర్జన్మ ఇచ్చింది అని ఒక వ్యక్తీ చెప్తుంటే ఎలా ఉంటుంది? నడిరోడ్డుమీద దిక్కుతోచని స్థితిలో ఆక్సిడెంట్ కి గురి అయినప్పుడు ఏ బంధువులు, ఏ కుటుంబ సభ్యులు గుర్తు రాలేదు తన ఫేస్ బుక్ స్నేహితుడు గుర్తురావడం , ఆ మిత్రుడు అలాగే స్పందించడం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఇది.

రాంబాబు, ఇ వి వి ఫేస్ బుక్ స్నేహితులు. ఇ వి వి గారు ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ కి అడ్మిన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్ కేవలం హాస్యం కోసమే... ఇందులో ఆడవాళ్ళందరూ సోదరీమణులుగా, మగవాళ్ళు బావా బావమరుదులుగా పిలుచుకునే అచ్చతెలుగు గోదావరి వాస్తవ్యులు. ఇక్కడ వేళాకొళాలే తప్ప, వ్యంగ్యాలు, అపహాస్యాలు ఉండవు. అందరు సరదాగా హాస్యం పంచుకుంటూ స్నేహంతో  మనసారా నవ్వేస్తారు. హాస్యం, నవ్వుకోడం, ఒకరినొకరు ఆట పట్టించుకోడం ఇది  ఒక కోణం..
మరోకోణం నిన్నే తెలిసింది.


అర్థ రాత్రి ఈ గ్రూప్ సభ్యుడు రాంబాబు గారు ఘోర కారు ప్రమాదానికి గురి అయ్యారు. అంత అచేతనావస్థ లో కూడా రాంబాబు గారు తన ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడం, అక్కడ చుట్టూ చేరినవారు కూడా “హోప్  లేదు సర్ తొందరగా రండి“ అనడం.. ఆందోళనతో ఉన్నఫళంగా ఇ వి వి గారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 


అక్కడ పరస్థితి వాళ్ళు చెప్పినట్లుగానే ఉంది. వరసగా 4 ఆసుపత్రులు అతని కండిషన్ చూసి చేర్చుకోము అని చెప్పగా ఎట్టకేలకు బొల్లినేనిలోని ఆసుపత్రిలో జాయిన్ చేసుకుని అతనికి ప్రాణదానం చేసారు. ఈ సందర్భంగా ఇ వి వి గారిని అభినందిస్తూ గ్రూప్ లో అనేక పోస్ట్ రావడం నేపద్యంలో తానే స్వయంగా ఏమి జరిగిందో ఇలా చెప్పారు ఇక్కడ కువైట్ ఎన్నారైస్ (please click on this word)  లో  చదవండి మీరు కూడా.. 

6 comments:

 1. మీరు వ్రాసిన విషయం బాగుంది.ఈ వీ వీ గారికి అభినందనలు.పోస్ట్ టైటిల్ లో గోదారోళ్ళు...అని పెట్టడమేమిటి ? ఆ గ్రూప్ లో అందరూ గోదారోళ్ళే ఉంటారా ? గోదారోళ్ళు ఇతరులకి కూడా సహాయం చేస్తారా ? గోదారోళ్ళకి మాత్రమే సహాయం చేస్తారా ? ఎందుకైనా మంచిది తెలుసుకుందామనీ !

  ReplyDelete
 2. హాహాహ నిహారిక భలే డౌట్ అడిగారు. "కమీషనర్ కి కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వా అంటే టైప్ లో " నిజానికి అది గోదావరి జిల్లా గ్రూప్ సో ఆ గ్రూప్ లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి అలా మేన్షన్స్ చేసాను. "వాళ్ళు ఇంకొకళ్ళకి చేయరా? " ఎవరయినా వాళ్ళ పరిదిలో ఉన్న ఎవరికయినా పర్మితులననుసరించి ఎంతయినా చేస్తారు సహాయం చేయడా నికి ప్రాంతీయత , కులం, మతం అవసరం లేదు. చెప్పాగా మీరు ఊహిచినట్లు ఆ గ్రూప్ లో అనరు గోదావరి వాళ్ళే ఉండడంతో అలా ప్రత్యేకించి చెప్పాల్సివచ్చింది.

  ReplyDelete
 3. ఈ ఇవివి లాంటి వారు "ఎందరో మహానుభావులు" కోవలోకి వస్తారని చెప్పాలి. తను చేసిన మంచి పని గురించి పబ్లిసిటీ తనకిష్టం లేదనడం తన గొప్పతనం (humility).

  ReplyDelete
  Replies
  1. అవునండి.. మంచితనానికి మరో పేరు..

   Delete
 4. పాపం ఇవివి గారు పబ్లిసిటీ వద్దని ఎంతగా అనుకున్నారో అంతగానూ పబ్లిసిటీ మొదలయినట్లుంది. ఎలా తెలిసిందో గానీ ABN ఆంధ్రజ్యోతి ఛానెల్ వారు నిన్న సాయంత్రం ఆరు గంటల వార్తల్లో ఈ సంఘటన గురించి ఓ పదినిమిషాల దాకా చెప్పారు, మీరూ చూసే ఉంటారు. ఇతర ఛానెల్స్ ఎవరన్నా కూడా చెప్పారేమో తెలియదు. ఏమయినప్పటికీ అలా వార్తల్లో చెప్పి మంచి పనే చేశారు. నన్నడిగితే ఇటువంటి మానవతా కార్యాలకి పబ్లిసిటీ తప్పకుండా ఇవ్వాల్సిందే అంటాను.

  ReplyDelete
  Replies
  1. అవునండి చూసాను. కువైట్ ఎన్నారైస్ అంతర్జాతీయ పత్రిక, అందులో చూసి మొత్తం స్ప్రెడ్ అయింది. మొదట మనద్వారానే పబ్లిసిటి మొదలయింది. లోకల్ లో తెలియకుండా అలా ఎలా ఇస్తారు అంటూ మీడియావాళ్ళు పోటి పడ్డారు దాదాపు అన్ని పేపర్స్ లో వచ్చింది నిన్న. చూసాను. గ్రూప్ పేరు గోదారోళ్ళ కితకితలు .. గ్రూప్ లో కూడా ఇవే పోస్ట్లు.

   Delete

Loading...