7.25.2016

ఇప్పుడే ఒక గంట ముందు జరిగిన ఒక యదార్థ సంభాషణ /సంఘటన

 ఒక వారం రోజుల ముందు సుపర్ బజార్ లో ఏవో సరుకులు తీసుకుందామని వెళ్లాను. అక్కడ షాపింగ్ మధ్యలో అమ్మ ఫోన్ చేసింది. అమ్మా ఫలానాచోట ఉన్నా! ఇంటికెళ్ళగానే ఫోన్ చేస్తా! అని పెట్టేసాను. తరువాత మర్చిపోయాను. ఇదిగో ఇందాక ఫోన్ చేశాను. "ఆరోజనగా చేస్తాను అన్నావు ఇంతవరకు చేయలేదు , రోజు తమ్ముడిని అదుగుతూనె ఉన్నాను "అక్క ఫోన్ చేసిందా?" అని నా సెల్ లో బాలన్సు లేదు, నువ్వు చేయకపోయే సరికి నా ఫోన్ పాడయిందేమో రావట్లేదేమోఅనుకున్నా అంది! ఎంత బాధ అనిపించిందంటే ఏవో షేరింగ్స్ చూస్తున్నా! ఒక వృద్ధురాలు తన మొబైల్ షాప్ కి తీసుకెళ్ళి పాడయిందేమో చూడమనడం, అంటాబాగానేఉందిఅని వాళ్ళు చెప్పడం, మాపిల్లల ఫోన్ రావడం లేదనడం. అబ్బా ! మనసు చాలా బాధపడింది.

మనల్ని ప్రేమించేవాళ్ళని మనం పట్టించుకోము.
మనం ప్రేమిచేవాళ్ళు మనల్ని పట్టించుకోరు. 
ఇదేనేమో ప్రేమ అంటే.


3 comments:

 1. ఇంకెప్పుడూ అమ్మని మర్చిపోకండే? తరచూ ఫోన్ చేస్తూ ఉండండి ..

  ReplyDelete
  Replies
  1. తప్పకుండా అండి థాంక్ యూ.

   Delete
 2. చాలా బాగా చెప్పారండి. మా అమ్మ నాన్న కూడా అదే అంటుంటారు.. కనీసం వారానికి ఒక్కసారి ఫోన్ చేసి బాగున్నాము అని చెప్తే చాలు అని. కానీ అప్పుడప్పుడు పనుల ఒత్తిడితో మర్చిపోతుంటాం, ఇది అతి పెద్ద తప్పు. తప్పక ఫోన్ చేయాలి వారానికి ఒక్క సారైనా.

  ReplyDelete

Loading...