నేను నా దేశాన్ని మరే దేశంతో పోల్చలేను కాని, నా చిన్ని ప్రపంచంలో నా పరిధిలో నేను చెప్పాలనుకొన్నది చెప్దామని చిన్ని ప్రయత్నం. మనకెప్పటినుండో ఉన్న సామెత "భారతీయుడు సగర్వంగా తలెత్తుకొని, స్వదేశంలోనే తెలివితేటలని ఉపయోగిస్తే భారత దేశం ప్రగతిపధంలోకి రాగలదు కాని తలొంచుకొని ఎక్కువ సంపాదనకోసమో, మరింకో లాభాపేక్షో మొత్తానికి పెట్టే బేడా సర్దుకొని విదేశాలల్లో మన తెలివితేటల్ని కుదువ పెట్టి బానిస బతుకు బతుకుతున్నాము" అంటారు . మన దేశంలో మన ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ మన బాస్ ఏదన్నా అంటే కోపం నషాలానికి అంటుంది కాని, పక్కదేశంలో మనల్ని తప్పుపడితే మరింత తలొంచుకొని బతికేస్తాము మనము మనకలవాటయిన .. పక్కదేశంవాళ్ళు అలవాటు చేసిన బానిస బతుకు కదూ ఇది ..
"ప్రపంచంలోనెలకొన్న ఆర్థికమాంద్యం (financial recession) ఇంకా కొనసాగుతుందని, దీనికిగాను చాలామందిని ఉద్యోగాలలోనుంచి తొలగించాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా తెలిపారు"
ఈ ఆర్థికమాంద్యం అమెరికా నుండి మా ఆఫీసు తలవాకిట కూడా వాలింది, మాకు తెలిసినవాళ్ళ రూపేణా... "ఏదన్నా జాబ్ చూడగలరా మావారు అమెరికా నుండి వచ్చేస్తున్నారు, ఇద్దరం సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నవాళ్ళమే, ఇండియాలో తప్ప ఎక్కడ చూసినా చేస్తాము." అని ఎందుకు ఇండియా అయితే ఏమయ్యింది అని నా అనుమానం , అడగకపోతే ఇక అది అలాగే తొలిచేస్తుందని, "ఎందుకు? ఇండియాలో అయితే ఏంటి సమస్య" అని అడిగేశాను. "అమ్మో ఇండియాలోనా చాలా తక్కువ ఇస్తారు, అసలు ఉండలేము ఇక్కడ, అక్కడ అలవాటు పడినవాళ్ళు ఇక్కడ ఉండలేము..". 23 ఏళ్ళు ఇండియా లో గడిపి పెళ్ళయి 5 సంవత్సారాలుగా అమెరికాలో ఉంటున్న ఓ అతివ ఉవాచ. వినగానే నవ్వొచ్చింది నాకు. ఇక్కడ కష్టాలనుభవించి అక్కడికెళ్ళి సుఖాలని అలవాటు చేసుకొంటాము. కాని కష్టాలని గుర్తుపెట్టుకోపోకపోతే ఇదిగో ఇలానే ఉంటుంది, సుఖపడి కష్టపడలేము.
మన భారతదేశంలో కూడా కష్టపడి పైకొచ్చినవారి జాబితా చాలానే ఉంది. ఏ ధనవంతుడిని కదిలించినా, ఒకప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేసాననో, పేపర్లు వేసేవాడిననో, పచ్చళ్ళు అమ్మాననో, చీరలమ్మానో మనకి వారు పడ్డ కష్టాలు ఏకరువు పెడ్తారు. మన ఇండియాలోనే కాక ఎక్కడయినా సరే కష్టానికి తగ్గ ఫలం ఎప్పుడూ దక్కుతుంది. కాకపోతే ప్రతిచోటా వచ్చే అడ్డంకులని ఇగో పొరల్లో కప్పుకోకుండా ఎదిరించగలిగితే ఎక్కడయినా విజయం సాధించగలమని నా నమ్మకం. ఇక ఏపనయినా పనిచేయగలిగే ఈ ధనవంతులు తమ పిల్లలు తమలా కష్టపడకూడదు అని ఆలోచిస్తారు కాబట్టి, వారి పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలు చేయనివ్వకుండా వాళ్ళ సంస్థల్లోనో సంపాదించే అవకాశం కల్పిస్తారు కాబట్టి, ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదం మధ్యతరగతి వాళ్ళకి వర్తిస్తుంది. పిల్లలు కష్టపడకూడదు కాని వాళ్ళకి రూపాయి విలువ, కష్టం తెలిస్తే చాలు అనే ఆలోచన..... ఆ ఆప్యాయత మన భారతీయులకి ఆభరణం. వారి ప్రేమాభిమానాలతో పిల్లలికి కష్టం తెలియకూడదంటూనే కష్టాలు నేర్పుతారు. ఒక పెద్ద సినిమా నటుడు తన కొడుకు కష్టం తెలియాలని కాలేజ్ కి బస్లోనే వెళ్ళమని ఆదేశించారట.
మనకీ తెలుసు కష్టాలు సుఖాలు. కాకపోతే మనకి మనం ఎప్పుడు నచ్చము, మనల్ని మనం ఎప్పుడు ఇష్టపడము. "పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు" అని ఈమధ్య ప్రతిచోట నిరూపణ అవడం బాధాకరమైన విషయమే.
మనం మన తెలుగు మాట్లడకూడదు, మన చదువులు మనకోసం కాదు , ఎక్కడో దేశం కాని దేశంలోని ఏదో ప్రాజక్ట్ వర్క్ ని ఉద్దరించడానికి. మనం వేసుకొనే దుస్తులు మనవి కాకూడదు, ఇదే మన ఆచారం మన సాంప్రదాయం. మనం మారము, మారి మన తెలుగు మాట్లాడితే.... మన దేశాన్నే పొగిడితే , మనకొసమే ఉంటే మన మెళ్ళో ఇంకెన్ని బోర్డ్‌లు తగిలిస్తారో ...
ఈ మధ్యకాలంలో నాకు అమితంగా నచ్చిన వ్యాఖ్య, నా దేశంపై నాకున్న మమకారాన్ని మరింతగా ఇనుమడింపజేసింది. అందుకే ఈ వ్యాఖ్య ఇక్కడ పొందుపరుచుకొన్నాను.

తాడేపల్లి said... *******
౧. భారతదేశంలో జఱిగే అనేక విషయాలపై భోగట్టా సేకరించే సంస్థలు గానీ, వ్యక్తుల విజయాల మీద పుస్తకాలు/ వ్యాసాలూ రాసేవారు గానీ, రాస్తే కొని చదివేవారు గానీ ఎవరూ లేరు. అదొక్కటే కాదు, ఈ దేశంలో ఏ విషయం మీదా మీకు గణాంకాలు గానీ, వివరాలు గానీ లభించవు. అందుచేత ఇతర దేశాల్లో మాదిరే కష్టించి పైకొచ్చినవాళ్ళు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నప్పటికీ అది మనకి తెలియక మనమీద మనమే తప్పుడుగా వ్యాఖ్యానించుకుంటున్నాం. నేను వ్యక్తిగతంగా చాలామందిని చూశాను. వారిలో నా బాస్ లున్నారు. నా దగ్గఱ చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. నా బంధువులున్నారు. నా స్వస్థలం గుంటూరులో నా పరిచయస్థులలోంచి అలాంటివారిని కనీసం ఒక వందమందిని చూపించగలను. అలా దేశమంతటా ఉంటారు. ఉన్నారు కాబట్టే ఈ దేశం 1950 ల నాటి సోషలిస్టు వ్యవస్థకి భిన్నంగా ప్రభుత్వ సంస్థల హస్తాల్లోంచి బయటపడి ఈనాడు పాఠశాలలూ, వైద్యశాలలనుంచి కంప్యూటర్లూ, ఎయిర్ లైన్సుతో సహా అన్ని రంగాల్లోను స్వదేశీ ప్రైవేట్ సంస్థల ద్వారా నడుపుకునేటంత గొప్ప శక్తిసామర్థ్యాల దిశగా పయనించగలిగింది. కష్టపడకుండానే అంత ప్రైవేట్ పెట్టుబడి ఎలా పోగుపడుతుంది ?
౨. నిజానికి భారతీయులతో పోలిస్తే అమెరికన్లు వట్టి సోమరిపోతులు. వాళ్ళు ఆ సోమరితనాన్ని వ్యక్తిగతాల వెనుకా, హక్కుల వెనుకా దాచుకుంటారు. వాళ్ళలో కొద్దిమంది శ్రమజీవుల్ని చూసి. చూపించి అమెరికన్ లంతా ఏదో సాధించేస్తున్నారంటే నేను నమ్మజాలను. అయితే దాన్ని ఒక వ్యక్తిగత అభిప్రాయంగా గౌరవిస్తాను. భారతదేశంలో 24 గంటలూ పనిచేసే హోటళ్లున్నాయి. 24 గంటలూ పనిచేసే వైద్యులున్నారు. 24 గంటలూ పనిచేసే పోలీసులున్నారు (నిజానికి మన పోలీసులకి పనిగంటలూ, సెలవులూ లేవనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు చెబుతున్నాయి). అర్ధరాత్రి ఫోన్ చేసి అడిగినా doubts clarify చేసే లెక్చరర్లున్నారు. ఏరి చూపించండి ఇలాంటివాళ్ళని కనీసం ఒక్కఱిని అమెరికాలో ? ఇక్కడే కాక అన్ని దేశాల్లోను భారతీయులు కష్టించి పనిచేసే జాతిగా గుర్తింపు పొందారు. నా ఉద్దేశంలో భారతీయులు పని కోసం వారాంతాన్ని కోరుకుంటారు. తద్భిన్నంగా అమెరికన్లు వారాంతం కోసమే పనిని కోరుకుంటారు.
౩. భారతీయులు తమ తరువాతి తరాలకోసం సంపాదించడం, అందునిమిత్తం పొదుపు చేయడం చాలా మంచి విషయం. ప్రపంచమంతా అమెరికన్ల మాదిరే కేవల వర్తమాన వాదులై జీవితాన్ని నమిలేసి తుక్కులా ఊసిపారేస్తే భావితరాల గతి అధోగతే. భావితరాల పట్ల ఏ రూపంలో బాధ్యత గలిగి ఉండడమైనా ప్రోత్సాహనీయం. అలాంటి బాధ్యతాభావం ఉంది కనుకనే ఇండియా అమెరికాలాగా దివాలా ఎత్తలేదు. ఎందుకంటే ఇక్కడ కంపెనీలకే కాక కుటుంబాలక్కూడా నికరమైన Asset base ఉంది. అమెరికన్ల మాదిరి అది చెక్కకొంపల తుక్కు Assets కావు. అదీగాక భారతీయులు ఎంతో అవసరమైతే తప్ప అప్పుచేయరు. అదే వారిని ప్రపంచవ్యాప్తమైన ఆర్థికమాంద్యం నుంచి రక్షఱేకులా కాపాడింది. ఇటీవలి విదేశ వాణిజ్య పరిణామాల ఫలితంగా భారతదేశంలో వృద్ధిశాతం (growth rate) తగ్గిపోయింది. కానీ వ్యవస్థ మాత్రం అలాగే చెక్కుచెదఱకుండా ఉంది. ఈ సందర్భంగా భారతీయుల పొదుపు వారి సంపాదనలో 33 శాతం అని చెప్పుకోవడానికి నేను గర్విస్తాను.
అమెరికన్లకి దేశం పట్లనే కాదు, కనిపెంచిన తల్లిదండ్రుల పట్లా, భార్యాబిడ్డల పట్లా కూడా ఏ విధమైన బాధ్యతా లేదు. వాళ్ళని చూసి మనమెందుకు నోరు వెళ్ళబెట్టాలో నాకర్థం కాదు. బాధ్యత లేనివాళ్ళు శ్రమజీవులు కావడం అసాధ్యం. పాపం, వాళ్ళు నిజంగా అంత శ్రమజీవులే అయితే అమెరికాలో శరీరశ్రమ అవసరమైన అన్నిరకాల బండలాగుడు పనులకీ హిస్పానిక్కులే ఎందుకు దిగుతున్నారో, ఒక్క స్థానిక అమెరికన్ కూడా ఎందుకు మూటలు మొయ్యడో తెలుసుకోవాలని ఉంది. స్థానిక US పౌరులు నడ్డివంగని, మడత నలగని వైట్ కాలర్ పనులు తప్ప ఇంకేమీ చెయ్యడానికి ఎందుకు ఇష్టపడరో నాకు తెలుసుకోవాలనుంది.