10.03.2009

జీవనితో - చేయూత


చేయూతకై బ్లాగు మిత్రులకిదే ఆహ్వానం. కనీ వినీ ఎరగని రీతిలో కర్నూలో వరద అక్కడి వారిని నిరాశ్రయులని చేస్తోంది. మావల్లే , మేము చెప్పడంవల్ల, మేమున్నాము కాబట్టి అని ఒకరి తరువాత ఒకరు పోటిగా చెప్తూ వరదని రాజకీయం చేస్తున్న మీడియాని పట్టించుకోక మనమేమి చేయగలం అని ఒక్కసారి ఆలోచించి ఆచరణయోగ్యమైనవేవొ చేద్దాము రండి. సేవాకార్యక్రమాలకు తదుపరి వివరాలకి రౌడిగారి బ్లాగుని చూడండి.
*****

5 comments:

  1. మొదటి అడుగు : మా స్టాఫ్ అంతా ఒకరోజు జీతం ఇవ్వడానికి ముందంజ వేశారు...+ పాత బట్టలు దుప్పట్లు వగైరా సేకరిస్తున్నాము.

    ReplyDelete
  2. హైదరాబాద్ లో బట్టల సేకరణ పాయింటు రెడీ. కానీ ప్రస్తుతానికి మీ దగ్గరే ఉంచుకోండి. వీలైనన్ని కలెక్ట్ చేయండి. కర్నూల్ కు మీనుంచి రవాణా పునరుద్ధరణ జరగగానే వాటిని పాయింట్ వద్దకు చేరుద్దాము. ఆ మరుసటి రోజు కర్నూల్ కు తీసుకుపోదాం.

    ReplyDelete
  3. sure జీవని గారు నేను ఆ పని మీదే ఉన్నా. లోకల్గా కలెక్షన్స్ మొదలెట్టాశాము మేము మా స్టాఫ్ .

    ReplyDelete
  4. రమణిగారూ,

    మన దేశంలోని తెలుగు బ్లాగర్లు విరాళం పంపడానికి మి అక్కౌంటు నెంబరు తెలియజేయండి. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధంచి ఒక పోస్టు కొత్తగా బ్లాగులో పెట్టండి. అందులో అకౌంటు వివరాలు, పూర్తిగా ఉంచండి. మనం ఏమి చెయ్యలనుకుంటున్నామో మొత్తంకార్యాచరణ రాయండి. అభిప్రాయాలను ఆహ్వానించండి. సహాయం చేయాలని ఎందరికో ఉంటుంది. రూటు దొరక్క తికమక పదుతుంటారు. కాబట్టి క్లియర్ గా రాయండి. అలాగే మీ పోస్టును రౌడీ రాజ్యంలోనూ పోస్టు చేయండి. అక్కడా చూస్తారు. అమెరికా నుంచి వారి ప్రయత్నాలు వారు చేస్తుంటారు.

    ReplyDelete
  5. ఇటువంటి సమయాల్లో సహాయం వ్యక్తిగతంగా కంటే సంఘటితంగా చేయడం సులువు అవుతుంది.లోక్ సత్తా పార్టీ సహాయ కార్యక్రమాల్లోకి నడుం కట్టి దిగింది. విరాళాల సంగతెలా ఉన్నా, ఆహార పదార్థాలు(త్వరగా చెడిపోని బిస్కెట్ పాకెట్స్,రస్కులు వంటివి,ఇంకా గ్లూకోజ్ పాకెట్లు,ORSపాకెట్స్ వంటి వైద్య సంబంధ వస్తువులు),బట్టలు, దుప్పట్లు వంటివి ఇవ్వాలనుకుంటే లోక్ సత్తా పార్టీ ఫోన్ నంబర్ ని సంప్రదిస్తే, పార్టీ కార్యకర్తలు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. బాధితులకు చేరవేసే పని పార్టీ చూసుకుంటుంది. ఆసక్తి ఉండి సహాయం చేయగలిగిన శక్తి ఉన్నవారు 040-40405050 ఫోన్ నంబర్ ని సంప్రదించవచ్చు.థాంక్యూ!

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...