10.15.2009

దివ్వీ ....దివ్వీ .....దీపావళి


దివ్వీ ... దివ్వీ దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితీ
ఎప్పుడు తిందాము చలిమిడి ముద్ద



అంటూ.... గోంగూర కాడలకి చివర తెల్లటి వస్త్రాలని కట్టి నూనిలో నానపెట్టి దీపావళికి దివిటీలు కొట్టించేది అమ్మ, టపాసులకన్న ఇవి కొట్టడానికి ఎక్కువ ఉత్సాహం చూపేవాళ్ళము నేను మా అక్క. ఎందుకంటే దీపావళికి అమ్మ పాలకోవా చేస్తుంది ..ఈ దివిటీలు కొట్టినతరువాత పాలకోవ పెట్టేది. అదెంత రుచిగా ఉంటుందంటే ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు దివిటీలు కొట్టేసి పాలకోవా తిందామ అని ఎదురుచూసేంతగా ఉంటుంది.

సంక్రాంతి రోజు వాకిలంతా ముగ్గులు కనీసం కాస్త స్థలం కూడా వదలకుండా పెట్టించేది అలాగే దీపావళికి "అటు గోడ , ఇటు గోడ మొత్తం దీపాలు పెడ్తామమ్మ " అంటే అహ.. తులసిమొక్కదగ్గిర గుమ్మాలదగ్గిర పెట్టించేది "చాలు ఇంకా కార్తీకమాసమంతా తెల్లవారుఝామున దీపాలు పెట్టాలి, కార్తీక పౌర్ణమి దీపాలు... ఆవునెయ్యి ఈరోజే అయిపోతే ఎలా" అంటూ నాకేమో మా ఇంటి పిట్టగోడలన్ని దీపాలతో వెలిగిపోవాలని కోరిక. అందుకని ఖర్చు అయితే అయ్యిందని పెళ్ళయినప్పటినుండి దీపావళికి మటుకు మొత్తం దీపాలతో అలంకరించేస్తా.. అదో ఆనందం.

ఈసారి ఇంకొంచం ముందడుగు వేసి రంగు రంగుల ప్రమిదలు కొన్నాను .. మా అక్క వాళ్ళ పాప చేసిన అందమైన దీపాలు చూస్తుంటే భలే ముచ్చటేసింది, నాకు పంపించమంటే "తప్పకుండా పిన్నీ " అంటూ పంపింది.

మరి కొత్తగా కొన్న ఈ రం
గు రంగు ప్రమిదల అందమైన డిజైన్లతో మీకందరికీ కూడా మా





దీపాళి శుభాకాంక్షలు



4 comments:

  1. దీపావళి శుభాకాంక్షలు..

    ReplyDelete
  2. దీపాలు ఎంతో అందంగా ఉన్నాయండి...దీపావళి శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. దీపాలు చాలా అందంగా ఉన్నాయండీ
    మీకూ మీకుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు !

    ReplyDelete
  4. మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...