10.12.2009

మరణం తధ్యమని....తెలిసినా...


బాధ ఎక్కూవయితే ఏమి చెయ్యాలి? మాటల్లో చెప్పలేని బాధ, ఒక్కసారి ఒకే ఒక్కసారి గట్టిగా ఏడ్వాలనిపించే బాధ, భోరున ఏడ్వాలనిపిస్తోంది, కాని నేనలా ఏడిస్తే వింతగా చూస్తారు, అసలు నీకేంటి అంత సంబంధం ఏడావల్సినవాళ్ళు ఏడ్చి ఏడ్చి సొమ్మస్లిల్లి పడిపోయారు. వాళ్ళనే ఓదార్చలేకపోతున్నాము మళ్ళీ నువ్వెందుకు?? పరిచయం కూడా పెద్దగాలేదు అని.. నా వైపు వింతగా చూస్తారని ఏడవలేకపోయాను. సాధారణంగా ఏడవను, నాదేప్పుడు మౌనరోదనే, ఏడుపుని నటించడం నాకిష్టంలేని పని, అవతలి మనిషి నాకు బాగా తెలుసా లేదా అన్నది కాదిక్కడ సమస్య, అతనెలాంటి వాడో నా మనసు అంచనా వేసేసి మరీ ఏడుస్తుంది. లేకపోతే మౌనంగా ఉంటూ చుట్టుపక్కల వారిని గమనిస్తుంది. ఇక్కడ భోరున ఏడ్చేసి , పక్కకి వెళ్ళి, నవ్వుకోడాలు, అప్పుడే చూస్తున్నట్లుగా పలకరింపులు, అనవసరమైన పరామర్శలు అన్నిటికి మించి అదోరకంగా ఏడవడం నాకు రాని విద్యలు.

******

జోస్యుల సత్యనారయణ మూర్తిగారు, ఇద్దరున్నారు ఈ పేరుతో నాకు తెలిసినవాళ్ళు. ఒకరు స్వయాన మా పిన్నిగారి అల్లుడు, ప్రస్తుతం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు. రెండోవారు మా పిన్నత్తగారి అల్లుడు, కువైట్ సంపాదించగలిగినంత సంపాదించేసి , ఇక పిల్లలు చేతికందొస్తే 'కృష్ణా ..రామా... ' అనుకొంటాను అంటూ ఈ మధ్యే ఇండియా వచ్చేసారు. 'కృష్ణా ...రామా ' అనుకోడానికి ఆయనేమన్నా చాలా పెద్దాయన అనుకొంటారేమో, పూర్తిగా 40 ఏళ్ళు ఉండవు. ఇద్దరు పిల్లలు.

కువైట్ వచ్చినప్పటినుండి దాదాపు ఒకటే ఆలోచన, ప్లాట్
కొనాలి, ఇల్లు కట్టుకోవాలి. ఏలా కుదిరిందో, లేక ఎవరన్నా కుదిర్చారో తెలీదు కాని, నాగారంలో ఇల్లు కట్టుకొంటున్నారు. ఇంకా పూర్తి అవలేదు వాళ్ళు ఉండడానికి కట్టుకొని దగ్గర ఉండి కట్టిద్దామనుకొన్నారేమొ మొన్న ఫిబ్రవరిలో గృహప్రవేశం చేశారు. ఎవరో, ఎప్పుడో , ఎక్కడో , ఏదో పెళ్ళిలో అన్నారనుకొంట, "జోస్యుల వారు వాళ్ళ బార్యని ప్రేమగా కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకొంటారు" అని ఆమధ్య "ఐ సి ఐ సి ఐ" ఎవరో తెలిసిన వాళ్ళుంటే మా ఆఫీసుకొచ్చి మరీ ఇన్స్యూరెన్స్ చేయించారు. "ఏంటన్నయ్యా ఎవరిపేరు? " అంటే "నాకెందుకమ్మా? కనీసం జలుబంటే ఏంటో తెలీదు, తనకోసమే గబుక్కున తనకేమన్నా అయితే ఉంటాయి కదా " అని.... ఇలా ఈ ఒక్కటే ఆధారంగా చేసుకోడంలేదు, చాలా , చాలా సంఘటనల ఆధారంగా చెప్తున్న విషయాలివి, బార్యంటే అమితమైన ఇష్టం, అత్యంత గారాబం వెరసి అనీర్వచనీయమైన ప్రేమ. ఇలా ప్రేమున్నవారినే ... కువైట్ అంటూ దూరంగా ఉంచేసి, ఆ దూరాన్ని అలా అలవాటు చేసి, ఆ ప్రేమని ఇనుమడింపజేస్తాడేమో!! ఆ భగవంతుడు అనిపిస్తోంది.

మరి ఇప్పుడు తను మీరు కువైట్లో ఉన్నారనుకొంటుందా? లేక ఇకా తిరిగిరాని చోటుకి వెళ్ళారనుకొంటుందా? ఆ ప్రేమకి ఫలితం ఇదేనా? ఆ పిల్లలు? డబ్బుకి ప్రేమ తెలుసా? ప్రేమించాలి , ఆప్రేమకి డబ్బు కావాలి అని అంత దూరం వెళ్ళి సంపాదించారు మరిప్పుడు?

మా అన్నగారు (పిన్నత్తగారి అల్లుడు) నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇలా....
అందుకే భోరున ఏడ్వాలనిపిస్తోంది. మూర్తి అన్నయ్యా.. మీకు నా అశ్రు నివాళి.

మరణం తధ్యమని....తెలిసినా...జనన మరణ చక్రమాగదూ ... అంటారిందుకేనేమో..

****

11 comments:

 1. Sucks bigtime! Dont have enough courage to think about the estranged family members.

  ReplyDelete
 2. మూర్తిగారికి నా అశ్రునివాళి.

  ReplyDelete
 3. మూర్తి గారికి అశ్రు నివాళి.

  ReplyDelete
 4. మూర్తిగారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నా.మూర్తిగారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి .

  ReplyDelete
 5. అయ్యో,చదువుతుంటేనే మనసంతా చేదుగా అయిపోయింది రమణి గారూ! రౌడీ చెప్పినట్లు కుటుంబ సభ్యుల పరిస్థితి ఆలోచించడానికి ధైర్యం చాలడం లేదు. మూర్తి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  ReplyDelete
 6. మూర్తి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  ReplyDelete
 7. రౌడిగారు, సుజాతగారు: నిన్నటినుండి భయం నన్ను అంటిపెట్టుకొని వెళ్ళడంలేదు,కుటుంబం గురించి అలోచిస్తూ.. మనసుని బలవంతంగా వేరే విషయాలకి మరల్చుతున్నా, మళ్ళీ అటే వెళ్తోంది. ధైర్యం తెచ్చుకోవాలి తప్పదు అని నచ్చచెప్పుకొంటున్నా.....ప్చ్!
  చిలకమూరి విజయమోహన్ గారు, శివ గారు, వేణుగారు, భాస్కర్ రామరాజు గారు: నేనూకూడా మూర్తి గారి ఆత్మకు శాంతి కలగాలని .....

  ReplyDelete
 8. మూర్తి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  ReplyDelete
 9. మొన్న పేపర్ లో చదివినప్పుడే చాల బాధ గా అని పించింది ,మీ చుట్టాలని చదివాక మరింత బాధగా అనిపించింది . కనీసం జలుబంటే ఏమిటో తెలీదన్నా యి రోజుల్లో గారెంటీ లేదు .అన్నాళ్ళు భార్య పిల్లలకి దూరం గా వుండి ఇంకా తన సొంత ఇంటిలో సంతోషం గా వుండవలసిన టైం లో?ఏంటో హమ్మయ్య యి రోజు బతికే వున్నాం అని ప్రతి రోజు బోనస్ లాగే ఫీల్ అవుతూ బతికేయ్యలేమో

  ReplyDelete
 10. ఆయనెవరో నాకు తెలియకపోయినా మనసంతా దిగులావరించేసిన్దండీ...మూర్తి అన్నయ్యగారికి నివాళులు !వారిభార్యకు మనోధైర్యాన్నిమ్మని భగవంతుడ్ని ప్రార్దిస్తున్నా!

  ReplyDelete
 11. రవిగారు:
  "హమ్మయ్య యి రోజు బతికే వున్నాం అని ప్రతి రోజు బోనస్ లాగే ఫీల్ అవుతూ బతికేయ్యలేమో"

  చాలా కరెక్ట్ గా చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు అలానే ఉన్నాయి. ఇంటినుండి బయటకి వెళ్ళేవాళ్ళూ ఇంటికొచ్చేదాకా భయంగానే ఉంటోంది.

  పరిమళంగారు: నిజమేనండి, దిగులు గుబులు ఏమిచేయాలో తెలియని పరిస్థితి.

  ReplyDelete

Loading...