9.25.2010

"పక్కింటి మంత్రం " -వావ్! వాట్ ఆన్ ఐ(అవు)డియా!

ఎదురింటి మంగళ గౌరి వేసుకొన్న గొలుసు చూడు, ... ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగు పడ్డారు నగా నట్రా టి.వి గట్రా అంటూ ....నేనేరోజన్నా బాధపడ్డానా? మరి చూడండి! నిన్న కాక మొన్నే కదా మీకు, నా చిటికెన వేలు నలిగి ఎంతో బాధపడిపోతూ, కందిపచ్చడి ఎలా చేసానో .. దాని రుచి ఎంతో బాగుంది అని చెప్తూ , మావారు గుటుకు గుటుకు అంత అంత ముద్దలు చేసుకొని తిన్నారని చెప్పానా! ఇదిగో! ఈ రెండు రోజులనుండి అదేమిటో నేనెమి చేసినా "ఉప్పు ఎక్కువయ్యింది అనో ,"కారం తక్కువ వేసావనో" వంకలు పెట్టడం మొదలు పెట్టారు. అయినా ఆయనని ఏమి లాభం! మా అమ్మ చెప్పనే చెప్పిందిలెండి "పెరటి చెట్టు వైద్యానికి పనిరాదని" హు! నేను వింటేగా..

"ఈ మధ్య ఇలా మారిపొయారెంటబ్బా? నాకయితే అన్నీ బాగానే వుంటున్నాయి" అని అనుకొని పిల్లలిని అడిగాను. "కూరలు అసలేమి బాగుండడం లేదామ్మా"? అని "చాలా బాగంటున్నాయమ్మా, మా ఫ్రండ్స్ అందరికి నువ్వు చేసే వంట ఎంతిష్టమో" అంది మా పాప. నేను ఆశ్చర్యంగా "మీ ఫ్రండ్స్ కా?? మరి నువ్వేమి తింటున్నావు?" అని అడిగితే "మా ఫ్రండ్స్ తెచ్చుకొన్నది", చల్లగా చెప్పింది . అదిగో! అప్పుడు వెలిగింది నా కళ్ళముందో వెలుగు. ఎంటా?? అని చూసుకొంటే నా జ్ఞాన నేత్రం తెరుచుకొంది. కళ్ళు ఒకసారిగా విచ్చుకొని కనువిప్పు కలిగింది.

ఒహ్! ఇదన్నమాట అసలు సంగతి! ఇంతవరకు అసలు తెలియనేలేదని ఎంతో మధనపడిపోయాను. ప్చ్! ఇక లాభం లేదని, ఆ రోజు నుండి నేననుకొన్న పధకాన్ని అమలులో పెట్టాను. ఇహ చూసుకొండి! ప్రతి రోజు "ఈ కూర ఎంత బాగుందో!" " ఏంటి ఈ పప్పు అబ్బో! అమోఘం! అద్భుతం! అసలు కూరలంటే ఇలా వుండాలి" అంటూ, మావారు తెగ పొగిడేస్తూ తింటుంటే, నిజం చెప్పొద్దు! నా కళ్ళళ్ళో ఆనందబాష్పాల లాంటి కళ్ళనీళ్ళు కాస్త అసూయతో..ఇంకాస్త ఈర్షతో!

కాని మనసులో ఎక్కడో చిన్న అనుమానం, హఠాత్తుగా ఎప్పుడైన అసలు నిజం తెలిసిపోతే?? లేదా కూరలు అవి తెగ నచ్చిపోయి ఈయన ఏ డైమండ్ నక్లేస్సో,లేదా ఇంకేదో వజ్రపుటుంగరమో తెచ్చేసి, నా కళ్ళు మూసేసి "ఏమి తెచ్చానో చెప్పుకో చూద్దాము" అని గారం చేసేసి "నాకు తెలీదు మీరే చెప్పండి" అని నేను మారాం చేస్తే, నా ముందు ఆ ఫలాన ఉంగరమో, నక్లేసో చూపించేసి....."నీకు కాదుగా నాకు రోజు ఎంతో బాగా కూరలు అవి చేసి పెడ్తున్న పక్కింటి పిన్ని గారికి, ఎదురింటి ఆంటి కి, వెనకింటి వెంకయమ్మగారికి" అని చెప్తే?..

నాకెందుకో నా ఊహలలో, ఎదురింటి, పక్కింటి, వెనకింటి వార్ల పిన్నిగార్లు, ఆంటిగార్లు అందరు వంటి నిండా నగలతో మావారికి బోల్డూ థాంక్స్ చెప్పేస్తున్నట్లుగా ..

ఇదండీ సంగతి!! మీకర్ధమయిపోయిందిగా నా ప్లాన్. రోజు నేను చేసే వంటకాలన్ని పక్కింటి పిన్నిగారు చేసారనో, లేదా ఇంకెవరో చేసారనో చెప్తూ , ఈరోజు వరకు నా పతి భక్తిని నిరూపించుకొంటూ వస్తున్నాను. ష్!! మీరు చెప్పకండీ ప్లీజ్! అయినా నాకు తెలుసు లెండి! మీకందరికి కూడా పొరిగింటి పుల్ల కూర రుచి గానే వుంటుంది గా! కాబట్టి చెప్పరు.

కాని , ఏ మాటకామాట చెప్పుకోవాలి.నా కల ఎప్పటికైనా నేరవేరుతుందన్న నమ్మకం నాకుంది. మావారు తప్పకుండా మారిపోతారు, ఎప్పటికైనా నా వంటలన్నీ ఇదివరకటిలా మెచ్చేసుకొని, నాకో గొప్ప వజ్రాల నక్లేస్ తెచ్చేసి "ఒహొ! మేఘమాలా.. చల్లగ రావేలా.. మెల్లగ రావేలా .. నిదురపోయే రామచిలక బెదరిపోతుందీ..కల చెదరిపోతుందీ.. అని పాడేసుకోని, నిద్రపోతున్న నన్ను లేపకుండా, సుతారంగా నా మెడకి అలకరించేస్తారని చిన్ని చిన్ని ఆశ. చూద్దాము! ఇంకెన్నాళ్ళో ఈ పక్కింటి మంత్రం.

9 comments:

 1. బాగుంది. ఇది చదువుతుంటే నామిని గారి "మా ఇంటి తీగూర ఇజీకోల్టు పొరుగింటి పుల్లగూర" (సినబ్బ కతలనుండి) గుర్తుకొచ్చింది.

  ReplyDelete
 2. అస్సలు చుట్టు పక్కల ఏ గజలక్ష్ములూ, మంగళ గౌరులూ లేని చోటికి వెళ్ళిపోతే??
  ఐనా .. రోజూ ఓ కూరా, ఓ పప్పు, ఓ పులుసు ఈ పక్కింటామె ఇచ్చిందీ, ఆ ఎదురింటామె ఇచ్చిందీ అంటే మీ వారు ఎలా నమ్మేస్తారండీ?
  చేవ్రాలులాగా బొటనవేలి ముద్రలాగా, శ్రీమతి వంటలో పర్సనల్ టచ్ ఆయనకి తెలీదా?

  ReplyDelete
 3. సిరిసిరి మువ్వగారు: నెనర్లు

  కొత్తపాళీ గారు: నెనర్లు. మరీ ఇరుగు , పొరుగు లేకుండా అడవిలో ఏముంటామండీ? ఎదో ఇలా సర్దుకుపోవాలి కాని. చేవ్రాలు, బొటన వేలు ముద్ర అంటూ మీరు అవిడియాలు ఇచ్చేస్తే కొంచం కష్టమే సుమండీ. అవన్నీ తెలిసేసుకొని మావారు అసలు నిజం కనిపెట్టేస్తే? ..

  ReplyDelete
 4. రమణిగారు,

  మీరు మరీను. సినిమాల్లోలాగా మనం చేసిన వంటలు పక్కింటోళ్ళు ఇచ్చారని చెప్తే నమ్మేస్తారేంటి మన మొగుళ్ళు. పాతబడితే అలాగే అందరు మొగుళ్ళు అంటుంటారు కాని. మీరు ఇలాగే కంటిన్యూ ఐపోండి. అయ్యో పాపం అని మంచి మంచి రుచులు చేసి పెడుతుంటే ఇలాగే కామెంట్లు చేస్తారు. నచ్చకుంటే కొన్ని రోజులు బయటనుండి కూరలు కొనుక్కురమ్మనండి. లేదా హోటల్ నుండి తీసుకురమ్మనండి. అప్పుడు గాని మన రుచులు తెలియవు (బాగుండవు).
  నా స్వంత అనుభవం ఇది. నేను ఇలాగే చేస్తాను.తినండి. లేకుంటే మీరే చేసుకోండి. నేను కూడా తింటాను అని తెగేసి చెప్తాను మావారికి, పిల్లలకు.

  ReplyDelete
 5. జ్యోతిగారికి: నెనర్లు. ఏదో మీరు భుజం తట్టి ప్రొత్సహిస్తున్నారు కాబట్టి, కొంచం ధైర్యం తెచ్చుకొని, మీరన్న మాటలని ఒక స్ఫూర్తి గా తీసుకొని, ఈరోజునుండి నా పధాకనికి స్వస్తి చెప్పదల్చుకొన్నాను. "నేను చేసినవి తింటే తినండి లేకపోతే లేదు అంతే" అని ఖరా ఖండీగా చేప్పేయ్యదల్చుకొన్నాను. తేడాలొస్తే మీరందరూ వున్నరన్న ధైర్యమన్నమాట. ప్చ్! ఈ వారం రోజులనుండీ ఉహల్లో, కలల్లో బోల్డు నగలు,థాంక్స్ లు ... ఏమి చెప్పమంటారు నా సంగతి. మొత్తానికి భరోసా ఇచ్చేసారు హమ్మయ్య!

  ReplyDelete
 6. "వారం రోజులనుండీ ఉహల్లో, కలల్లో బోల్డు నగలు,థాంక్స్ లు ... ఏమి చెప్పమంటారు నా సంగతి."
  ఆ .. ఏముందీ, చెందనా, త్రిభువం దాస్ జావెరీ .. ఇలా జువెల్రీ షాపుల రాంగు రఘుల ప్రకటనలన్నీ కత్తిరించి ఫ్రేములు కట్టించి ఇంటినిండా గోడలకి పెట్టేయండి :-)

  ReplyDelete
 7. post adurs. manaki poruginti ruchulu enduku nachutayante manadi manam roju thini okate taste ayi bore kotti pakkintollayi nachhutayi. ade appudapudu proginti vallayi thinte konchem vere taste vachhi nachhutayi anthe logic.

  mi kalalu ade necklace mi husband tondaralano tisukaravalani korukuntunna :)

  ReplyDelete
 8. భలే ఐవిడియా సుమండి .

  ReplyDelete

Loading...