9.29.2010

మాటలకందని భావాలు


నిజమే కొన్ని భావాలు చెప్పాలంటే మాటలు రావు. మనసు మూగబోతుంది. అదిగో అలాంటి సమయంలో ఏమి మాట్లాడాలో తెలియక , మౌనాన్ని ఆశ్రయిస్తాం. ఇదే అపార్థాలకి దారి తీసి, మనము దూరం అయిపోతున్నామేమో అని అనేసుకొంటారు మనలాంటి మనకున్న మన శ్రేయోభిలాషులు.

మన తోటి మనిషి అయితేనేమి, మన స్నేహితుడైనా, బంధువులైనా, ఎవరయినా సరే మనకి దూరంగా ఉండడం వల్ల వాళ్ళతో అనుబంధం పెరిగిపోతుంది, దగ్గరగా ఉంటే ఆ బంధం తగ్గుతుంది అని అనుకోడం మన భ్రమ. దూరాలు , దగ్గరితనాలు బంధాలకి కొలమానం కాదు. ఇదంతా ఎందుకు చెఫ్తున్నాను అంటే ఈరోజు మధ్యాహ్నం ఎఫ్.మ్ లో విన్న చిన్న సంభాషణా సారాంశమే నన్ను ఇలా ఆలోచించేలా జేసింది.
*******
communication gap.. ఎఫ్.మ్ లో ఈరోజు మధ్యాహ్నం ఈ విషయం గురిచి ప్రశ్నోత్తర కార్యక్రమం జరుగుతోంది. కమ్యూనికేషన్ గాప్ అనేది మనిషిని ఏ విధంగా కృంగదీస్తుంది అనేది చర్చాంశం. అయితే ఇలా ఈ విషయం గురించి తన సొంత అనుభవాన్ని చెప్పడానికి ఒక మేడం ఫోన్ చేసారు. ఆవిడ చెప్పిన తన సమస్య:

"నాది ప్రేమ వివాహం, ఇద్దరు పిల్లలు, ఒకరు ఇంటరు సెకండ్ ఇయరు ఇంకొకళ్ళు 10 వ తరగతి చదువుతున్నారు. నా సమస్యల్లా ఒకటే, గత నాలుగేళ్ళుగా మావారు ఏ ఉద్యోగం చేయడం లేదు, అలా ఇంట్లోనే ఉంటున్నారు. ఆఖరికి ఇంటర్ చదువుతున్న మా బాబు కూడా "డాడీ ఫ్రండ్స్ అందరూ "మీ డాడీ ఏమి చేస్తారు ?" అని అడుగుతుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది "ఇంట్లో ఉంటున్నారు" అని చెప్పడానికి " అని వాపోతున్నాడు, నాకు వాడి బాధ అర్థం అవుతోంది. మేము మాకున్న కొంత ఆస్థి తో జీవితాన్ని నెట్టుకొస్తున్నాము. ఎన్నోసార్లు నెమ్మదిగా చెప్పి చూసాను. కాని మనిషి మారడంలేదు. చిన్న వ్యసనాలకి లోబడి, ఇంట్లో ఉంటూ, అసలెందుకు తను ఉద్యోగం చెయ్యరో కూడా చెప్పకుండా ఒక విధమైన డిప్రెషన్ లో ఉన్నారు. నావైపు నుండి తప్పేమన్నా ఉందేమో అని ఆలోచించి, అసలు తన సమస్య ఏంటో నెమ్మదిగా అడిగి చూసినా చెప్పడం లేదు. ఒక మనిషి ఉన్నా లేని పరిస్థితి నాది. ఇంట్లో ఉంటూ తండ్రి చూపించే ఆప్యాయతలకి , అతను నెరవేర్చాలిన బాధ్యతలకి నా పిల్లలు దూరమైపోతున్నారు. నేను ఇదంతా నా మీద జాలి పడండి అని చెప్పడానికి కాదు, మీరెవ్వరూ జాలి పడొద్దు. కమ్యునికేషన్ గాప్ అనేది దూరంగా ఉండి మాట్లాడక ోతేనో, మరింకేవిధమైన సాంకేతికాల వాల్లనైతేనేమి, మాట్లాడడం కుదరక పోవడం కాదు, ఇంట్లో ఎదురుగుండా ఉన్న నాకు, నా భర్తకి, నా పిల్లలికి మధ్య చాలా కమ్యునికేషన్ గాప్ ఉంది. అది గమనించి , ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఎవరన్నా ఉంటే పిల్లల కోసం మారండి అని వేడుకొంటున్నాను. " అంటూ ముగించారావిడ.

చాలా బాధ కరమైన విషయం కదా ఇది. ఒక ఇంట్లో ఉంటూనే ఎవరూ ఎవ్వరితో మా
ట్లాడక పోవడం అనేది ప్చ్!
అసలు ఒకే ఇంట్లో ఒకమనిషికి ఇంకో మనిషికి అసలు సంబంధం లేదు అన్నట్లుగా ఎలా ఉండగలము.. అనేది ఎంత ఆలోచించినా అంతుబట్టదు నాకు. "మనతో ఎవరన్నా మాట్లాడక పోతే అది వాళ్ళ తప్పు, వాళ్ళు మంచి స్నేహితులని కోల్పొతారు, మనమెవ్వరితోనన్నా మాట్లాడకపోతే అది మన తప్పు, మనము మంచి స్నేహితులని కోల్పోతాము ". కాని ఇక్కడ మనం ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించేసుకొని, అంటే మన స్నేహితులైతే ఏంటి, మన వాళ్ళు అనుకొనే ఎవరయినా సరె, కొన్ని పని వత్తిడుల వల్లకాని, ఇంకేదో వ్యక్తిగత పనుల వల్ల అయితేనేమి, మనతో కాస్త దూరంగా ఉన్నంత మాత్రాన , వారు మనకు దూరం అయిపోతున్నారు అనేసుకోడం అంత సబబుగా అనిపించడం లేదు. అసలు కమ్యునికేషన్ అంటే పొద్దస్తమాను కూర్చొని, మాట్లాడుకోడమో, మెయిల్స్ రాసుకోవడమో, చాటింగ్ చేసుకోడమో కాదు. దూరంలో ఉన్నా , ఒక బంధం నిలబడేందుకు, ఒక మనసుని ఇంకో మనసు అర్థం చేసుకోడం.

ఈరోజు నేను నా ప్రియ స్నేహితుడితోనో /స్నేహితురాలితోనో మాట్లాడలేక పోయాను అంటే , దాని అర్థం వాళ్ళని నేను మర్చిపోడం కాదు. మర్చిపోడానికి చేసే ప్రయత్నమో కాదు. నా మనసు వాళ్ళకి తెలుసు. వాళ్ళ మనసు నాకు తెలుసు. మా మనసులు ఊసులు చెప్పేసుకొంటున్నాయి. అని అనుకోవాలి కాని, దూరం అయిపోతున్నామేమో అన్న భావన రాకూడదు. అలా అని, అవతలి వాళ్ళు ఆ దూరం కూడా పెంచేసుకోకూడదు. మన పని వత్తిడిలో, మన వ్యాపకాలో ఒక మనిషిని కలవలేంతగా ఉన్నాయి అంటే ఆ అవతలి మనిషి మనల్ని "మిస్" అవుతున్నారు అనే మధుర భావన కలజేయాలి కాని, ఈ దూరాన్ని పెంచేసుకొని మనం లేకపోయినా ఆనందంగా బతికేయగలరు అనేంతగా కమ్యునికేషన్ గాప్ ఉండకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే ఎంతటి ఆత్మీయులను కోల్పోయినా, ఎవ్వరు లేకపోయినా జీవితాన్ని కొనసాగించే గుండె నిబ్బరం మనిషికి ఆ దేవుడు ఇచ్చాడు. "నువ్వు లేక పోతే నేను లేను" అన్నవి మాటలే, ఏ మనిషి లేకపోయిన ఇంకో మనిషి ఉంటాడు, కాని ఆ మనిషి మనసు అతనిలో ఉండదు అది తను మెచ్చిన, తనకి నచ్చిన వారి వద్ద ఉంటుంది. ఆ భావన చెప్పడానికి మాటలకందనిది. అందుకే ..

మాటలకందని భావాలు మంచి మనసులు చెబుతాయి అంటారు.
****

7 comments:

  1. మీరు చెప్పింది అక్షరాలా నిజం
    మన చిన్ననాటి స్నేహితులని కొన్ని సంవత్సరాల తరువాత కల్సినాకూడా ఇంతకాలం మన మద్య గేప్ వచ్చిది కదా ఏం మాటలాడుతాం అని అస్సలు అనిపించదు . కలిసిన వెంటనే ఏం మాట్లాడాలో తెలియకపొయినా కొంచెం సేపయ్యేసరికి మాటల ప్రవాహానికి అడ్డుండదు . మన మనసుల్లో లోతుగా పాతుకున్న బంధాలకి దగ్గర దూరం తో సంభంధమే వుండదు .

    ReplyDelete
  2. అవును రమణిగారు, మంచి ఆలోచించవలసిన అంశాన్ని గుర్తుచేసారు...

    @లలిత గారు
    మనసుల మధ్య దూరం గురించి ఆలోచించినప్పుడల్లా నాకు గుర్తొచ్చే సంధర్భం అదే, చిన్ననాటి స్నేహితులని కలసుకోవడం. ఒక్కోసారి కలిసాక ఒక 5 నిముషాల తరవాత మాటలు ప్రవాహంలా రావొచ్చు... ఒక్కోసారి ఇతనేనా నా స్నేహితుడు/స్నేహితురాలు అన్నట్టనిపించి పోల్చుకోలేకపోవచ్చు కూడా... మనుషులు మారతారు కదా!

    ReplyDelete
  3. okka mukkalo cheppagala maatlni inta vipulanga,rayagala orpu nerpu vunnavalle blogs maintain cheyyagalaremo!! Busy livesto,yantrika jeevitaaniki alavatupadutu, padipotu, padilestu manalni manam samardinchukovadaniki itla konni vudaharanalu cheptu communication gaps gurinchi chaala chakkaga vivarinchina meeku dhanyavadamulu.

    ReplyDelete
  4. madam,
    chaala correctga chepparu.
    I liked your thinking.
    Naaku naa chinnanati mithrulu, naaku nachinavaalu, naa vaalu, naa bandhuvulu, andaru ippudu naaku chaala dooranga unna, naa deggare unntlu feel avuthunnanu.

    ReplyDelete
  5. కరెక్టుగా చెప్పారు. ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ గాప్ ని మూడో వ్యక్తి అవకాశం తీసుకుని ఇద్దరి మధ్య మరింత దూరం పెంచడం కూడా జరుగుతూ ఉంటుంది .ఇది నా అనుభవంతో చెపుతున్నాను. మంచి విషయం రాసారు .

    ReplyDelete
  6. రమణి గారు చాలా బాగా చెప్పారండీ..చివరి పేరా లో కంక్లూజన్ చాలా బాగుంది. నా మనసులోంచి తీసి రాసినంతగా..

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...