10.03.2009

జీవనితో పాటు.. నేను(మీరు, మనం) సైతం post updated

our staff 3 members = 1000.00
myself = 1116.00
from students (few) - 500 approx.
telugu bloggers - do not know
my brother : 500.00
my daughter = 100.00
my son = 100.౦౦

ఎవరన్నా ఆసక్తి ఉండి విరాళాలు ఇవ్వదలుచుకొనేవారు సంప్రదించవలసిన చిరునామ:


jeevani.sv@gmail.com
kathasv@gmail.com
s.venkateswara prasad
28/ 4 / 271, vijayanagar colony, anantapur, ap, 515001

_____________________________________________________________

వరదబాధితులకోసం జీవని తనవంతు సహాయం చేయడానికి ముందుకొచ్చి అనంతపూర్లో భారిగా విరాళాలు, వంట సామాగ్రి, తదితర వస్తువుల సేకరణకు పూనుకొంది. మరి మనం కూడా మనవంతుగా సహాయం చేద్దామని .......


హైదరాబాదులోని మరియూ కుదిరిన ఇతర ప్రాంత తెలుగుబ్లాగర్లందరికి/ (బ్లాగర్లు కాని వారు కూడా అర్హులే) మా విజ్ఞప్తి. హైదరబాదులోని మరియూ ఇతర ప్రాంతవాసులు సహాయం చేద్దామనుకొన్న తెలుగు బ్లాగర్లు వారికి తోచినంత సహాయం చేయగలమనుకొన్న పక్షంలో నన్ను మెయిల్ ద్వారా సంప్రదించగలరు. మీ మెయిల్ కి నా ఫోన్ నంబర్ పంపిస్తాను లేదా అక్కౌంట్ నంబర్ ఇస్తాను.

ముఖ్యంగా చిన్న విన్నపం. ఒక సదుద్దెశ్యంతో ఈ సహాయ కార్యక్రమం చేపడదాము అన్నది మా సంకల్పము. దయచేసి మీ అనామక(మిక) మెయిల్ ఐడిలు పంపకండి. మీరు ఫలాన బ్లాగరని ఉదహరించడం మరవకండి, బ్లాగర్లు కాని వారు సహాయం చేయదల్చుకొన్నవారు పూర్తి వివరములు పంపవలనెనని విజ్ఞప్తి. ఆయా పేర్లని తరువాతి పోస్ట్‌లో ప్రస్తావించి ధన్యవాదాలు తెలిపే సదావకాశాన్ని మాకు కలగజేయండి.

ఇక జీవని గారు: ముఖ్యంగా ప్రస్తుతం బాధితులకి కావాల్సినవి వంట సామాగ్రి, బట్టలు, కొంత పైకం, వీలయినంతవరకు ఈ సామాగ్రి, బట్టలు, విరాళాలు అందజేసే కార్యక్రమంలో ఉందాము. ఇంకా ఏమేంటి అంటే మీరు కర్నూల్ వెళ్ళేది మంగళవారం అంటున్నారు కాబట్టి అప్పటి అక్కడి పరిస్థితులని బట్టి నిర్ణయించుకొంటే బాగుంటుందని నా అభిప్రాయం.

my mail address: ramanisreepada@gmail.com

4 comments:

  1. మార్తండ గారు: మీ సందేహానికి నా సమాధానం

    సుజాత చెప్పారు...

    ఇటువంటి సమయాల్లో సహాయం వ్యక్తిగతంగా కంటే సంఘటితంగా చేయడం సులువు అవుతుంది.లోక్ సత్తా పార్టీ సహాయ కార్యక్రమాల్లోకి నడుం కట్టి దిగింది. విరాళాల సంగతెలా ఉన్నా, ఆహార పదార్థాలు(త్వరగా చెడిపోని బిస్కెట్ పాకెట్స్,రస్కులు వంటివి,ఇంకా గ్లూకోజ్ పాకెట్లు,ORSపాకెట్స్ వంటి వైద్య సంబంధ వస్తువులు),బట్టలు, దుప్పట్లు వంటివి ఇవ్వాలనుకుంటే లోక్ సత్తా పార్టీ ఫోన్ నంబర్ ని సంప్రదిస్తే, పార్టీ కార్యకర్తలు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. బాధితులకు చేరవేసే పని పార్టీ చూసుకుంటుంది. ఆసక్తి ఉండి సహాయం చేయగలిగిన శక్తి ఉన్నవారు 040-40405050 ఫోన్ నంబర్ ని సంప్రదించవచ్చు.థాంక్యూ!

    ReplyDelete
  2. రమణి గారూ మీకు వచ్చిన విరాళాలతో బ్లాగు అప్ డేట్ చేయండి, ఇతరులకు ప్రోత్సాహకరంగా వుంటుంది.

    ReplyDelete
  3. రమణి గారూ మీ ప్రయత్నాలకి అభినందనలు. మేము ఇక్కడ లోక్‌సత్తా వారి ద్వారా సహాయం అందించాము. కాలనీలలో వివిధ రాజకీయపార్టీలవాళ్లు, VHP వాళ్లు, రోటరి, లయన్సు క్లబ్బుల వాళ్లు బాగానే తిరుగుతున్నారు. ఎక్కడి వాళ్లు అక్కడే ఇస్తే సహాయం త్వరగా చేరుతుందేమో.

    ReplyDelete
  4. సిరిసిరిమువ్వ గారు: నెనర్లు. మన విదేశి తెలుగు బ్లాగర్లందరూ జీవనికి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడి తెలుగు బ్లాగర్లు కూడా.. అని నిర్ణయించుకొన్నాము. రౌడి గారి బ్లాగులో జరిగిన సుధీర్ఘ చర్చానంతరము తీసుకొన్న నిర్ణయం. జీవని కూడా సత్వర చర్యలు తీసుకొంటున్నారు. జీవని కార్యకలాపాలు నాకు ఎప్పటికప్పుడు మెయిల్ ద్వారా సమాచారమందిస్తున్నారు. ఇప్పుడు సేకరిస్తున్నది కొంత మాత్రమే,. సత్వర సహాయం కోసం నేను ఇలా నాకు తెలిసిన వాళ్ళందరిదగ్గిరా (బ్లాగర్లు కాకుండా) సేకరిద్దామని అనుకొంటున్నాను. ఇది కొంత మాత్రమే. రెండో సారి జీవని తో పాటు మీరన్నట్లుగా ఎక్కడి వారక్కడే అనే ఏకాభిప్రాయానికి వద్దాము. ఎక్కడ చేసినా బాధితులకి మన చేతనైనంత సహాయం చెయ్యాలన్న మానసిక సంతృప్తి , వారికే నేరుగా వెళ్ళాలన్న ఆలోచన అంతే.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...