10.10.2009

సేవా కార్యక్రమాల్లో - నేను


నిజానికి మొదటిసారి, ఎప్పుడు అనుకోను కూడాలేదు. బ్లాగుల్లో మహిళల సమావేశాల్లో కూడా ఏదో ఇవ్వగలిగినంత ఇచ్చేసి, పరోక్షపాత్ర తప్పితే మొట్టమొదటిసారి ప్రత్యక్షపాత్ర సేవా కార్యక్రమాల్లో, రెండేళ్ళ కిందట అనుకొంట హైదరాబాదులో పెద్ద వర్షాల్లో ఇంటి
దగ్గర్లోనే చిక్కుకుపోయి మొకాలోతు నీళ్ళల్లో ప్రపంచంలో నేను ఒక్కదాన్నే ఏ తోడులేకుండా ఉన్నానని బెంబేలెత్తిపోయాను. ఆ తరువాత ఏదో అధారం దొరికి ఇంటికెళ్ళిపోయాను అది వేరె సంగతి. ఒక 10 నిముషాలు అంతలా అల్లాడిపోయాను మరి కర్నూల్ వరద బాధితులు 5 రోజులు అలా ఎవరు లేక ఆకలితో, అసహనంతో ఉన్నవారు ఎలాంటి స్థితిలో ఉంటారో అని ఆలోచించడానికే నాకు వణుకు పుట్టింది.

క్షమించండి! చెప్పాల్సినది చెప్పకుండా అనవసర ప్రసంగం అనుకొంటున్నారా? పైన నేను చెప్పిన ఆలోచనా ప్రేరణే మనం కూడా ఏంతో కొంత చేద్దామని మనసు ఉసిగొల్పింది. దానికితోడు మలక్పేట రౌడీ గారి బ్లాగులో సేవా కార్యక్రమాలు కాస్త ప్రోత్సాహాన్ని .... స్ఫూర్తిని ఇచ్చాయి. మొదలు పెట్టాను....మొదటి రెండు రోజులు డీలా పడ్డాను. ఎవరూ స్పందిచకపోయేసరికి ... నేనేమి చెయ్యలేనేమో అన్న ఒక ఆత్మన్యూనతా భావం కూడా వచ్చేసింది. ఇదే సమయంలో మార్తాండ గారి ఉత్తరం "నేను సహాయాం చేద్దామనుకొన్నాను కాని , అంతా అనుకొన్నవాళ్ళకి చేరదు సగం తినేస్తారు" అని. మనసులో మాట నన్ను కూడా అలా అపార్థం చేసుకొంటారేమో అని.. నిజంగానే భయపడ్డాను. ఇలా భయపడ్తున్న సమయంలొనే, శ్రీ వేణు శ్రీకాంత్ గారు పంపిన అమౌంట్ బ్యాంక్‌లో చేరింది చిన్నగా మొగ్గ తొడిగిందో ఆశ. పర్వాలేదు .. అని. సరే! అంతకు ముందే మా ఆఫీసులో విరాళాల గురించి వివరంగా చెప్పడంతో చిన్న చిన్న మొత్తాలు చేకూర్తున్నాయి. ఇలా పెద్ద స్పందన లేకపోయినప్పటికి నేను సేకరించినది మటుకు Rs. 25,000/-

ఇందులో ఐదుగురు (మా అక్కతో సహా) బ్లాగర్లు, మా ఆఫీసువాళ్ళు, కోచింగ్ తీసుకొంటున్న అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. మొదటినుండి అనుకొన్నదే సేకరించిన సొమ్ముతో ఎవో వారి జీవనానికి కావల్సినవి కొందామని, హైదరాబాదులో పాయింటు కూడా సి
ద్ధంగా ఉందని .. జీవని గారు కూడా అన్నారని ఇక జంకు లేకుండా వీలయినన్ని బట్టలు కూడబెట్టడం, వస్తువులు కొనడం జరిగింది. అదీ కాకుండా విరాళాలు ఇచ్చేప్పుడు చాలమంది సలహా కూడా "నగదు వద్దు ఏవన్నా అవసరమైనవి కొని ఇవ్వండి" అని. విశ్వామిత్ర - మరోప్రపంచం బ్లాగరు శ్రీ పప్పు శ్రీనివాస్ గారు కూడా ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించి మరీ నొక్కి వక్కాణిస్తూ తన వైపు నుండి 1 రైస్ బ్యాగ్, బ్లాంకెట్స్ కూడా ఇచ్చారు. వారికి బ్లాగుముఖంగా కృతజ్ఞతలు.

సరే! ఇక సేకరించిన విరాళాలతో నేను కొందామనుకొన్నవి జీవని గారు చెప్పినట్లు రైస్ బ్యాగ్స్ .. బ్లాంకెట్స్, టవల్స్ .. శనివారమన్నాను ... ఈలోపులోనే కొని ఉంచేస్తే సరిపోతుంది అని నిన్న మధ్యాహ్నమే మా ఆఫీసు వాళ్ళు వెళ్ళి ఒక 20 బస్తాల దాకా కొనేసి ఇంటి దగ్గిర వేయించేసారు, ఇక నేను బ్లాంకెట్స్, టవల్స్, కొన్ని నిత్యావసర సరుకులు, కొంత వంట సామాగ్రి కొని ఇంటికి చేరుకొనేసరికి నైట్ 8 దాటింది. ఇంటికి రాగానే మా పాప "అమ్మా మా స్కూల్ వాళ్ళందరూ రేపు కర్నూలు వెళ్తున్నారు నీ చీరలు అవి ఇవ్వు" అని... ఇటు చూస్తే జీవని గారు నాకు పాయింట్ చెప్పలేదు, సరే స్కూల్ యాజమాన్యాన్నే అడిగి నేరుగా చేరవేస్తే.... అని ఆలోచించి.. ముందు అక్కడికి స్కూల్ కెళ్ళి పాప ప్రిన్సిపల్ ని సంప్రదించి.. "బాధితులకి స్వయంగా అందాలని తాపత్రయం" అని చెప్పగా వారు అంగీకరించారు. నిజానికి వారికి ఒక వ్యాన్ కి సరిపడా సామాన్లు ఉన్నాయి... అంత రాత్రి స్వయంగా నేను వెళ్ళి మాట్లాడి రావడంతో అప్పటికప్పుడు ఇంకో వ్యాన్ అరేంజ్ చేశారు (రాజు తలుచుకొంటే..... ) అలా ఈరోజు తెల్లవాఝామున 5 గంటలకు బయలుదేరిన స్కూల్ వ్యాన్లో మా దగ్గిర ఉన్న సరుకులన్ని నేరుగా కర్నూల్ వారికి అందజేసే ప్రయత్నం జరిగింది. (అందజేశామని కబురు కూడా చేరింది ) .

ఇక కొంత అమౌంట్ మిగిలింది ఒక Rs 4000/- . అది జీవని గారి అకౌంట్ కి ఈరోజే చేరవేశాను.

ఈ విషయంలో నాకు తన సలహాల రూపేణా, స
హాయం రూపేణా సహకరించిన శ్రీ శ్రీనివాస్ పప్పుగారికి , తమ విరాళాలను అందించిన వెంకట్ గారికి, వేణు శ్రీకాంత్ గారికి, నల్లమోతు శ్రీధర్ గారికి కృతజ్ఞతాభివందనములు. రాములవారి వారధికి ఉడతా సహాయం చేసే అవకాశాన్ని కలగజేసినవారందరికీ (మా సహ ఉద్యోగులకి, మా పిల్లలికి, మా కుటుంబసభ్యులకి,[అక్క, తమ్ముడితో సహా] బ్లాగర్లకి, స్కూల్ వారికి,అందరికి ) కృతజ్ఞతలు .


*********

(అకౌంట్ నంబరు ఇక్కడ గోప్యం. స్లిప్ లో వేశాము. )



@ జీవని గారు మీ మెయిల్ కాస్త ఆలస్యంగా చూశాను (మీరు ఫోన్ చేయించెప్పటికే..కొనాల్సినవన్నీ కొనేయడం జరిగింది). అయినా మిమ్మల్ని కూడా నిరాశపరచలేదనే అనుకొంటున్నాను, మీరయినా బాధితులకే చేరవేస్తారు నేనైనా బాధితులకే కాబట్టి, మిగిలిన అమౌంట్ మీరు నా పేరుతో సూచించవద్దని మనవి.

బ్లాగర్ల (పైన ఉదహరించిన వారు) పేరుతో మిగిలిన మొత్తాన్ని స్వీకరించండి.
******

6 comments:

  1. ఎవరైతేనేం లేండి, బాధితులకు సరిగ్గా సహాయం చేరిందా లేదా అన్నదే ముఖ్యం! మంచి పని చేశారు. అభినందనలు, మీకు సహకరించిన ఇతర బ్లాగర్లు, స్నేహితులకు!

    ReplyDelete
  2. బాగుందండి మీ ప్రయత్నం. బియ్యం , వస్తురూపంలో సహాయం చెయ్యడం మంచి ఆలోచన.

    ReplyDelete
  3. పోకిరీ మహేష్ బాబు స్టైల్: "సహాయం ఎవరు చేసారనేది కాదు అక్కయ్యా! బాధితులకి చేరాల్సింది చేరిందా లేదా అనేది పాయింటు" :))

    ReplyDelete
  4. అభినందనలు రమణి గారు. విలువైన సమయాన్ని శ్రమను ధారపోసి బాధితులకు చేరవేసినందుకు అందరికీ దన్యవాదాలు.

    ReplyDelete
  5. మీ చేయూత ఎంతోమందికి ఊరట నిస్తుంది అభినందనలండీ ...మీకూ ...మీతో చేయికలిపినవారికీ ...

    ReplyDelete
  6. సుజాతగారు, శివగారు, వేణూగారు, కొత్తపాళీగారు, పరిమళం గారు : థాంక్సండి.

    రౌడి గారు: తమ్ముడూ!!! అయితే వాకే.. :))

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...