4.27.2011

డైరీలో ఈరోజు 23/04/2011...బ్రాహ్మల వేట :-)

Brahmin chief justices between 1950 to 2000: 47%
ఏంటి ఈ వేట అని కోపం వస్తున్నట్లుంది చాలా మంది పెద్దలకి.. నిజమేనండి ఈరోజు మే(నేను)ము బ్రాహ్మల వేటకే వెళ్ళాము. ఆదివారం అంటే రేపు పొద్దున్నేమో సత్యనారయణ వ్రతమని బంధువులు పిలిచారు.. పొద్దున్నంతా ఆ హడావిడి రేపు వ్రతానికి వెళ్ళాలి అని , సాయంత్రం 5 అవుతుండగా స్నేహితురాలి ఫోన్.. "రాగలరా కొంచం నాలుగు సందులూ తిరిగి వెతికి పట్టుకుందాము"  అని.. అదేమంత పెద్ద పనా కాస్త నాకు వాకింగ్ చేసినట్లుంటుందని సరే అనేశా.. అనుకున్నట్లుగానే సాయంత్రం 6.30  కల్లా స్నేహితురాలు వచ్చింది. రాత్రి 9 దాకా ఈ చివరనుండి ఆ చివరదాకా జల్లెడ పట్టి వెతికితే ఒక 30 కుటుబాలు కనపడ్డాయి.. మా స్నేహితురాలి అత్తగారు నందికేశ్వర స్వామి నోము నోచుకుంటున్నారుట ఆ నోముకి సంబంధించిన కార్యక్రమానికి ఈ పిలుపుల వేట. మొత్తానికి తెలిసిన తెలియని 30 బ్రాహ్మణ కుటుంబాలని పిలిచాము. వేట ముగిసాకా ఈ బ్రాహ్మలకి సంబంధించి  తర తరాల ప్రశ్నలు మదిలో కదలాడాయి. అవే ఇవి.

ఇక్కడో ముఖ్య గమనిక: బళ్ళో చదువుకునే రోజుల్లో అయితే వరమణి టీచర్  మాటల ప్రభావం వల్ల అసలు మీ కులం ఏదంటే... ఛ!  కులం అలా బహిరంగంగా అడగకూడదు/చెప్పకూడదు  అన్న ఒక నియమావళి పాటించేదాన్ని. కాబట్టి అప్పుడు కుల పట్టింపు లేదు.

స్కూల్ చదువుకునే రోజుల్లో :

మేరి టీచర్ : ఏంటి నువ్వు గుడ్డు తినవా?
నేను : లేదు టీచర్ నేను పప్పు మాత్రమే తింటాను..
మేరి టీచర్ : అందుకే అలా రివటలా ఉన్నావు. ఇంతకీ మీరు కోమట్లా బాపనోళ్ళా?
నేను : ఎమో టీచర్ వరమణి టీచర్ చెప్పొద్దన్నారు.. (సదరు వరమణి టీచర్ మా చేత క్రమం తప్పకుండా ఏసు క్రీస్తు పాటలు పాడించేవారు మా అందరి దైవం అని... ఎందుకలా అన్నది కాస్త జ్ఞానం వచ్చాక తెలిసింది :-) )
*****

కాలేజ్ రోజుల్లో :

రావోయ్  కాంటిన్లో టిఫిన్ చేద్దాము స్నేహితురాలు పద్మ  పిలుపు
నేను : బయట ఎక్కువగా తినొద్దని అమ్మ చెప్పింది.. వద్దు పద్మా! ప్లీజ్...
పద్మ : మన బ్రాహ్మిన్స్ అంతా ఇంతే అన్నిటికి హద్దులు పెట్టేస్తారు.. మాలో ఇంత లేదు.. అవును ఇంతకీ మీరు వైదీకులా? నియోగులా? ద్రావిళ్ళా?
నేను: బ్రాహ్మిన్స్ లో ఇన్ని రకాలు ఉంటాయా? ఇంటికెళ్ళిన తరువాత అమ్మని అడగడం.. అమ్మ ఏ బ్రాహ్మిన్స్మి?
అమ్మ: అవి శాఖలమ్మా...

సో బ్రాహ్మిన్స్లో మళ్ళీ ఇంకొటేదో...
*********
ఉద్యోగ పర్వంలో: కాస్త లోకజ్ఞానం అలవడి.. కొన్ని సినిమాల ప్రభావంతో,  బంధువుల  కుటుంబంలో జరిగిన ప్రేమ వివాహలా అవగహనతో వాళ్ళేవరో నాకు ముక్కు మొహం తెలియనివారు కుల వివక్షతో మాట్లాడుతున్నప్పుడు.. కించిత్  బాధ.. సినిమాల్లో ప్రత్యేకంగా చులకన చేయబడ్డ కులంగా మరింత మనసు చివుక్కుమనిపించే రోజులవి.
సహొద్యోగి: భలె ఉన్నారు మీరు కమ్మాసా?  కమ్మాస్ ఇంత height  ఉంటారు..
నేను : లేదండి మేము శాకాహారులం (అప్పటికి కొంచం ఫీలింగ్ ప్చ్ !  ఏంటి ఇదో పెద్ద క్వాలిఫికేషన్ లా చెప్పడం అని)
సహొద్యోగి: ఓహ్ మీరు బాపనోళ్ళా (అదే చులకన) అయితే మాతో ఎక్కువ మాట్లడరేమో.. అవును తమిళ్ బ్రాహ్మిన్సా , కన్నడ బ్రాహ్మిన్సా? తెలుగు......
నేను : తెలుగు...
ఇలా బ్రాహ్మిన్స్, మళ్ళీ అందులో శాఖలు, అదికాస్త మళ్ళీ ప్రాంతీయాలు..భాషలు  :-)
*****

ఇవన్నీ చాలవన్నట్లు ఇహ ఇప్పుడు ఈరోజు జరిగిన మా వేటలో ప్రతి ఒక్కరూ అడిగిన ప్రశ్న..
మీరా!!  చిన్నప్పటినుండి చూస్తున్నాను మనవాళ్ళేనా ముఖపరిచయం అంతే.. మిమ్మల్ని చూసి మనవాళ్ళనుకోలేదు.. అవునింతకి మీరు ఆంధ్రా బ్రాహ్మిన్సా.. తెలంగాణ  బ్రాహ్మిన్సా? 

హైదరబాదులో ఉన్నందుకు కొత్తగా ఇంకో ప్రశ్న ఆంధ్రానా? తెలంగాణనా అని?
సమాధానం ఏమి చెప్తాములెండి.. చిన్నగా నవ్వేసి "ఏముందండి నాలో ఆర్భాటం కనిపిస్తే ఆంధ్ర, లేకపోతే తెలంగాణ అనేసుకొండి.. ఏదయినా పర్వాలేదు అని.."  ఇలా వెళ్ళినప్పుడు నా పేరు, నా ఉనికి మర్చిపోవాలేమో.. ప్చ్.. !
********

6 comments:

 1. బాగా చెప్పారు. :)
  ఇతరమతాల వారికి పంటిలో రాళ్ళు. త్వరగా మతాలు మారరు, మారనీరు.
  స్వంత మతం వాళ్ళకు డబ్బు లేని ఈ జీవులు సాఫ్ట్ టార్గెట్స్.

  అతి బ్రాడ్ గా ఆలోచించే స్వంత కులం వాళ్ళకు కులం గూర్చి మాట్లాడటం వెనకబాటుతనం.నేనూ మీలానే కులం చెప్పేదాన్ని కాదు చాలారోజులు. ఇతరులకు ఫేవర్ చెయ్యటం ఇతరుల గొప్ప చెప్పటం, నెమ్మదిగా ఇతరులను ఫాలో అవ్వటం బ్రాడ్ మైండ్ గా భావించేదాన్ని :) కానీ మనం తప్ప అందరూ ఏదో కులపోళ్ళో. :) వాళ్లది ఇతరులపై రుద్దాలని చూసేవారే. నేను మాంసం మానమని ఒక్కళ్ళకు కూడా చెప్పలేదు. కనీసం పక్కన తినటానికి కూడా అబ్యంతర పెట్ట లేదు. కానీ లెక్కలేనంత మంది తినమని సలహా మాత్రం ఇచ్చారు. మా అన్నయ్య వాళ్ళనైతే బలవంతం కూడా చేసేవాళ్ళు.

  ఇవి చాలవన్నట్లు ఇప్పుడిదో కొత్తది. పెద్దవారి చలవ. అయినా రెచ్చేవాళ్ళుంటే ఎవరైనా రెచ్చకొడతారు. చాలా తెలివిగల కులమంటారు ఇదేనా తెలివి, ఎవర్ని బడితే వాళ్ళని నమ్మటమే. హేమిటో.

  ReplyDelete
 2. "ఏముందండి నాలో ఆర్భాటం కనిపిస్తే ఆంధ్ర, లేకపోతే తెలంగాణ అనేసుకొండి.. ఏదయినా పర్వాలేదు అని.."

  బాల్యం నుంచి ప్రారంభించి current affairs తో ముగించారన్నమట మీ వేట. చాలా బాగుంది :)

  ReplyDelete
 3. బ్రాహ్మణులు, బ్రాహ్మలు, బ్రామ్మలు, బ్రేమ్మలు, బెమ్మిగాళ్లు, బేపనోళ్లు, బాపనోళ్లు, బొమ్మన్ లు.....యెలా సూచించినా పట్టించుకోని జాతి ఇదొకటే! యే కులం వాడిని ఆ కులంతో, యే వృత్తివాణ్ని ఆ వృత్తితో రిఫర్ చెయ్యడం నేరం! చివరికి ముష్టివాడు, ముష్టిది అన్నా, "గౌరవంగా పిలవలేరూ?" అంటున్నారు! ప్చ్!

  ReplyDelete
 4. బాగుందండి కులాన్ని అభిమానించిన తప్పు కాదు. కులం గురించి పక్కన పెట్టిన తప్పు కాదు ఎవరిష్టం వారిది . కాని కులం వద్దు అని నిటులు చెబుతూ తమ కులం, తమ మతం గొప్పదని చాటే డబుల్ స్టాండర్డ్ వాళ్ళతోనే తంటా. వీలుంటే ఇది చదవండి http://amruthamathanam.blogspot.com/2011/04/blog-post_25.html

  ReplyDelete
 5. కృష్ణశ్రీ గారి కామెంట్ అదుర్స్!మోహన్ బాబు ఓ సినిమాలో "బ్యాంబర్లు" అనికూడా అంటాడండోయ్!"బాంబర్లు" కూడా వుంది.కొద్దిగా ఇంగిలిపీచు స్టైల్లో "బాపన్స్", "బెమ్మీస్" కూడానూ!
  www.putchas.blogspot.com

  ReplyDelete

Loading...