4.28.2011

క్రికెట్ .. బార్య - ఏది ముఖ్యం?

ఈరోజు నాకొచ్చిన ఈ మెయిల్ ఇది.. 

THE LOVING HUSBAND


A man had two of the best tickets
for the Cricket World  Cup Final. As he sits down, another man comes along and asks if anyone is sitting in the seat next to him..

"No", he says, "the seat is empty."

"This is incredible!" said the man, "who in their right mind
would have a seat like this for the Cricket Cup Final, the biggest sporting event of the 
whole world and not use it?"


He says, "Well, actually, the seat belongs to me. My wife was supposed to
come with me, but she passed away. This is the first Cup Final we haven't been to together since we got married."


"Oh... I'm sorry to hear that. That's terrible. I guess you couldn't find
someone else, a friend or relative or even a neighbour to take the seat?"
 The man shakes his head...


......"No. They're all at the funeral."

 *****

ఎంత ప్రపంచ కప్పు అయినా ప్రపంచమంతా చేసుకునే గొప్ప సంబరమయినా...  తోడు నీడగా మనకోసమంటూ జీవించే బార్యకన్నా ఎక్కువా?  "THE LOVING HUSBAND " అనే టైటిల్ అంగీకరించలేకపోతున్నాను. :( 

8 comments:

 1. :))
  ఇలాంటి ఆలోచనా ధోరణిని కంపార్ట్‌మెంటల్ థింకింగ్ అంటారనుకుంటా. దేనికదే ఆలోచించడం. చాలావరకు నేను అలాగే చేస్తుంటాను.

  ReplyDelete
 2. శరత్ గారు : ఎదో ఒక థింకింగ్.. దేనికదేనా? ఎంత ఈజీగా అనేసారండి.. ఒక 11 మంది వెఱ్ఱిగా ఆడుకొనే ఆటని, ఏడేడు జన్మలకి "మీరే" అనుకొంటూ వచ్చే బార్యని అసలు పోల్చడమే తప్పు.. మళ్ళి దానికో "లవింగ్ హజ్బెండ్ " అంటూ టైటిల్.. కంపార్ట్ "మెంటల్" థింకింగే ఇది.. మిమ్మల్ని మీలా ఆలోచించేవాళ్ళని మీరు లేరనుకున్న ఆ భగవంతుడు కూడా రక్షించలేడు..

  ReplyDelete
 3. నేను సరిగ్గా ఆ విషయంలో అలాగే ఆలోచిస్తానని కాదు నా ఉద్దేశ్యం. ఆ టైప్ ఆఫ్ థింకింగ్ గురించి నేను ప్రస్థావించాను.

  ReplyDelete
 4. ఆలోచన విధానమైనా సరే శరత్ గారు.. ఇలాంటి ఆలోచనలతో ఆటలకి, అనుబంధాలకి ముడి పెట్టేసి, "మంచివాళ్ళు " "గొప్పవాళ్ళు" అనే పేర్లు తగిలించేసుకోడం నాకు నచ్చలేదు అందుకని..
  "చాలావరకు నేను అలాగే చేస్తుంటాను." అన్న వాక్యం నాకు కాస్త ఆవేశం తెప్పించేసిందిలెండి.. sorry :-)

  ReplyDelete
 5. రమణి గారు,
  ఇట్స్ జస్ట్ ఎ జోక్. కొంచెం బాడ్ టేస్ట్ లో ఉంది కానీ, మీరు అంత సీరియస్ గా తీసుకోవాల్సినదిగా అనిపించలా నాకు.

  ఈ ఆన్లైన్ సంభాషణల్లో/మెయిల్స్ లో, ఇదే సమస్య, సేం వాతావరణాన్ని, టోన్ ని పట్టుకోలేకపోతే, జోకులు వికటిస్తాయి. అందుకే ప్రతిసారీ ఓ డిస్క్లెమయిర్ రాయాల్సి వస్తూంటుంది, ఇది "జోకు" అని, ఆ జోకు పక్కన రాస్తే, దాని విలువ కాస్తా పోతుంది.

  నా డిస్క్లెయిమర్: పైన జోకుకి నాకు ఏ సంబంధమూ లేదు. ఇదే మొదటిసారి నేనీ జోకు చూడటం.

  ReplyDelete
 6. అబ్రకదబ్ర గారు : :-) థాంక్స్ అండీ!
  కుమార్ (N?)గారు : హహహ మీ disclaimer బాగుంది..

  ReplyDelete

Loading...