4.29.2011

డైరీలో ఈరోజు 29/04/2011...మనసులో చిన్న తృప్తి

ఈ నెల 5 వ తారీఖున ఆఫీసుకి సంబంధించిన పనికోసం రాజ్ భవన్ రోడ్ కి వెళ్ళాను. మిట్టమధ్యాహ్నం ఎండ నడి నెత్తిమీద ఉంది. ఇంకా బేగంపేట బ్యాంక్ పనిమీద వెళ్ళాలి.. అనుకుంటూ .. అక్కడ పని ముగించుకుని బయటకి వచ్చాను. రాజ్ భవన్ రోడ్ దగ్గర ఆటోలు దొరకడం తక్కువ .. అనుకుంటూ ఉండగా "ఆటో కావాలా మేడం" అని ఆగాడు ఆటో అతను. బేగంపేట వెళ్ళాలి.. అని ఆటో ఎక్కి కూర్చున్నా.. అతనిని నేనసలు గమనించలేదు ఎక్కెప్పుడు.. ఆటో ఎక్కి కూర్చున్న తరువాత "మిమ్మల్ని నేను చాలా సార్లు చూసాను నేను మీది ఫలనా కాలనీ కదా " అని అడిగాడు.. అప్పుడు గమనించా అతనిని నిజమే మా కాలని బస్టాండ్ దగ్గర చూశాను. అదే చెప్పాను, తెలిసిన మనిషిని అవడం చేతో మరి చెప్పాలనిపించిందో కాని.. ఈ నెల 25 న నాకు operation  ఉందమ్మా.. 10 యేళ్ళ క్రితం జ్వరం వచ్చింది, ప్రభుత్వాసుపత్రికి వెళ్తే పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చారు.. Date అయిపోయిందో ఏమో అది కాస్తా వికటించింది.. కాళ్ళు రెండు చచ్చుబడిపోయాయి.. రోజుకి 14 గంటలు కష్టపడ్తాను ,  ఆటో అద్దె పోగా నెలకి 1000/- రూపాయల చొప్పున పొదుపు చేస్తున్నా.. ఇప్పటికి 25,000/- అయింది. నాకోసం ప్రార్థించండి 

అని..అప్పుడు చూశాను అతని కాళ్ళు రెండు కాళ్ళు సీట్ పైన చేతి వేళ్ళంత సన్నగా పద్మాసనం వేసి ఉండడం. "మరి ఆటో ఎలా నడుపుతున్నావు " అని అడిగాను. ఒక సంవత్సరం ఇంట్లోనే ఉన్నాడుట. స్నేహితుడు వచ్చి ఇలా కాదు ఎంతో మంది వికాలంగులు ఎన్నో రకాలుగా పని చేసుకుంటున్నారు.. నువ్వు కూడా చెయోచ్చు అని మనోధైర్యం ఇచ్చాడుట.. అలా ఆటో నేర్చుకుని,కుటుంబానికి ఆసరా అయ్యాడుట.  తండ్రి రెండేళ్ళక్రితమే కాలం చేసారు. అప్పటినుండే తనే కుటుంబానికి ఆధారమట. చెల్లెలి పెళ్ళి చేసి,  ఇదిగో ఇప్పుడు తను శస్త్ర చికిత్స చేసుకుంటున్నాడు.. "నాకు ప్రత్యేకంగా మా దేవుడే..  దేవుడు ఇంకెవరు కాదు అన్న ఆలోచన లేదు మేడం.. మీరు ఎవరిని ప్రార్థిస్తారో వారినే నాకోసం ప్రార్థించండి"  అని తన కథ ముగించాడు. ఇంటికొచ్చాక ఉడతా సాయంగా నా దగ్గర ఉన్న నేను ఇవ్వగలిగినంత అమౌంట్ అతనికి  ఇచ్చి,  నా ఫోన్ నంబర్ ఇచ్చి విషయం తెలియజేమన్నాను. ఇందాకే వాళ్ళ తరపువాళ్ళు నాకు ఫోన్ చేసి.. "అంతా బాగానే ఉంది, కాళ్ళు వస్తాయో లేదో ఇంకా చెప్పలేము అన్నారుట డాక్టర్స్ .."  అని చెప్పారు. 

ఒక మంచి పని చేయగలిగాము అని .. మనసులో చిన్న తృప్తి.
*******

6 comments:

  1. hmm .. akka nenu kuda pray chestanu .. atani kosam :(

    ReplyDelete
  2. ప్రార్థించే పెదవులతో పాటు సాయం చేసే చేతులు. మంచిపని చేశారు.

    ReplyDelete
  3. ప్రార్థించే పెదవులతో పాటు సాయం చేసే చేతులు కూడా ముఖ్యం.మంచిపని చేశారు.

    ReplyDelete
  4. శరత్ గారు: :-)
    చెల్లాయ్.. మన ప్రార్థనలు ఫలించాలని నా కోరిక. Mr perfect చూసి మీరెలా స్ఫూర్తి పొందారో చదివాను. :-)
    చిలమకూరు విజయమోహన్ గారు: థాంక్స్ అండి.

    ReplyDelete
  5. chalamanchi pani sahayam cheyadam taruvata kanisam yediti vadi bada vine rojulu poyayi

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...