4.28.2011

డైరీలో ఈరోజు 28/04/2011.. ఎవరు అయితే ఏంటటా? .. (పెళ్ళి అయిన తరువాత)

పిల్లలిద్దరికి సెలవలేమో సరదాగా నలుగురం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. మాటల మధ్యలో మా పాపకి మా ( అక్క, తమ్ముడు, అన్నయ్య ల)  పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి అన్న అంశం తీసుకొచ్చింది. అన్ని చెప్తూ ఉన్నా.. పెద్దమ్మ ఇలా, పెద్దమావయ్య అలా అని.. ఇహ మా విషయం వచ్చేసరికి అక్కడ నేనొక్కదాన్నే అయితే మా పరిచయం ఇలా జరిగింది.. పెళ్ళి ఇలా అయింది అని చెప్పేసేదాన్ని కాని, మా శ్రీవారు కూడా ఉండడంతో తన త్యాగ గాధ కూడా పిల్లలికి చెప్పుకోవాలనిపించిందో ఏంటో మరి... నాకయితె విని విని విసుగొచ్చింది కొన్ని సంధర్భాల్లో  చిఱ్ఱెత్తుకొచ్చి ఇప్పుడెందుకు ఆ గొడవ మనకి పెళ్ళి అయింది అని కూడా కసురుకున్న  సందర్భాలు ఉన్నాయి,  అహ.. వినరు కదా ... మళ్ళీ  మొదటికి ... ఈసారి పిల్లలు బలి.. :-) బలి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే..... వినబోతు/చదవబోతు సందేహమెందుకు. చదవండి మీరే.

ఈ విషయంలో మా శ్రీవారనే కాదు ఇలా చాలామందిని చూశాను.. ఎంతమంది నన్ను చేసుకుంటామని వచ్చారో కాని ఏమి చేస్తాము మీ అమ్మకి మాటిచ్చేశాను అని అదేదో ఘోరమైన తప్పిదం చేసినట్లుగా వాపోతూ ఉంటారు.. అదిగో అలాగే మా నవమన్మదుడు  కూడా మా పిల్లలికి తన వెనకో ముందో ఎంతమంది క్యూ కట్టి ఉన్నారో చెప్పుకొస్తున్నారు. 

"మీ తాతయ్య వాళ్ళ స్నేహితుడికి మాటిచ్చరమ్మా.. వాళ్ళ అమ్మాయిని కోడలిగా చేసుకుంటానని..వాళ్ళు ఎన్నో వేలో లక్షలో ఇస్తామన్నారు అంటూ ... (ఎదో సినిమా కథ గుర్తు రావడంలేదు మీకు.. నాకయితే మావారు చెప్పేది ప్రతీది ఒక సినిమా కథే.. వాళ్ళ పిల్లలు అమాయకులు అనుకుంటారో, బార్య అమాయకురాలనుకుంటారో కథలు వినిపించేస్తూ ఉంటారు :-) ) ఇలాంటివి వింటుంటే నాకయితే ఒళ్ళు మండిపోతుంది "పోని ఇప్పుడుమటుకు మించిపోయిందేముంది.. హ్యాపీగా చేసేసుకు రండి కాస్త నాకు పని భారం తగ్గుతుంది అని అంటూ ఉంటాను" మొన్నెప్పుడో ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదు అని వాపోతుంటే.. మా మన్మధుడులాంటి భర్త దొరకలేదుట మరి..

ఆ పెళ్ళి కాలేదని చెప్పిన ఆవిడని నేను చూడలేదు కాని, ఇంతకు ముందు అంటే మా పెళ్ళయిన కొత్తలో.. ఒకటి రెండు సార్లు బయటకి వెళ్ళినప్పుడు.. ఎదురయి  నవ్వో, పలకరించో వెళ్ళే ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని, చూపించి నా పతిదేవుడు.. "నీకు తెలుసా ఇప్పుడు నవ్వింది చూడూ ఆ  అమ్మాయిని నాకిచ్చి చేద్దామనుకున్నారు".. "ఇదిగో ఇప్పుడు మాట్లాడింది చూడు ఆ  అమ్మాయి నాకు లైన్ వేశేది..కాని ఏమి చేయను అప్పటికే మీ పెద్దవాళ్ళకి మాటిచ్చేశాను"  అంటూ ఉండేవారు..

రోడ్ మీద కాబట్టి నిభాయించుకుని మౌనంగా ఉండేదాన్ని.. ఎందుకంటే ఆ చూపించే అమ్మాయిల్ని ముందు అర్జంట్గా నాతో పోల్చేసేవారు.. అక్కడ మండేది. నేనెలా ఉంటానో నాకు బాగా తెలుసు.. మరి వెనక్కి తిరిగి చూడాలి అనేలా కాకపొయినా హోమిలీ గా ఉంటానని తెలుసు.. మా వారు చూపించేవాళ్ళు నాకన్నా  వయసులో పెద్దవళ్ళో, మరి ఏమో మరీ ముదురు ముఖాలతో.. వంటి మీద కండ లేనట్లుగా సన్నగా పీలగా.. అసలే జన్మలోను వీళ్ళు తినలేదేమో అన్నట్లుగా.. ఉండేవారు.. (వాళ్ళను కించపరచడం నా ఉద్దేశ్యం కాదని గమనించగలరు.. అందం ఆకారం దేవుడు ఇచ్చినవే వాటిని మనము మార్చుకోలేము..)  మనం ఎంచుకునే అందమో మనసో ఆకారమో మన హుందాతనాన్ని ప్రస్ఫుటింపజేయాలి కాని.. వాళ్ళవరినో నాతో పోల్చేసి .. "చూడు నీకు మాటిచ్చాను కాబట్టి లేకపోతే వాళ్ళనే చేసుకునేవాడిని " అనే లెవెల్ లో మాట్లాడుతుంటే మండిపోతుంది.

ఇలా ఎవరినో చూడలేని వాళ్ళని చూపించి, జీవితంలో ఎదో పోగొట్టుకున్నవాళ్ళల్లా   మాట్లాడుతుంటే అనిపిస్తుంది.. నాదే రాంగ్ ఛాయిసా? లేక తన ఆలోచనలా అని.. పెళ్ళి అయిన తరువాత ప్రతి మగవాడికి పక్కింటి వాళ్ళే అందంగా కనపడతారు  రంభలాంటి తన బార్య కన్నా , పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు మావారి విషయంలో మటుకు ఈ నానుడి నిజమే.. ప్చ్.. వీళ్ళని ఎలా మార్చాలి ఎన్నిసార్లు చెప్పినా వినరు అనిపిస్తుంది.. :(
 ******

నోట్: ఫోటోలన్నీ  మావారిమీద... అలా మాట్లాడేవాళ్ళమీద కోపంగా, కసి గా పెట్టినవే.. మా మన్మధుడు చేసుకోబోయి మిస్ అయిన మిస్సులు మటుకు అచ్చు ఇలాను ఉండరు... ఇంతకన్నా అందంగా కూడా ఉండరు ... 

7 comments:

  1. చెప్పాలంటే గారు: కోపమా కోపమున్నరా.. పిల్లలు అడిగినప్పుడు పెళ్ళిముచ్చట్లు మధురమైన అనుభూతిలా చెప్పగలగాలి కాని.. అదేదో పెళ్ళి చేసుకుని నన్ను ఉద్దరించేస్తున్నట్లు మాట్లాడితే కోపం రాదా.. అందుకే అలా రాసాను..... కనీసం చదివిన తరువాతైనా మారతారేమో అని.. చూద్దాము.
    ఒక పోస్ట్కో వచ్చే కోపాలకో మారడం జరగదులెండి.. :)

    ReplyDelete
  2. HHmmmm...వీళ్ళు మారతారు అనుకోవడం భ్రమ.

    "బాధె సౌఖ్యమనే భావన రానీయవోయ్" ..సరదాకి అన్నాను లెండి.ఎవరూ ఎవరినీ మార్చలేరు రమణి గారూ.మన ఆడవాళ్ళము ఒకవేళ మారినా వాళ్లు కూడా మారతారేమో అని ఆశిస్తూనే మారతాము (ఏవో ఒకటి రెండు విషయాలలో లెండి) తప్ప "త్యాగ రాణి" లాగ "నీ సుఖమే కోరుకున్నా" అనుకుంటూ మారము కదా.

    వాళ్ళకి ఆ మాత్రం కర్టసీ కూడా ఉండదన్నమాట.

    ReplyDelete
  3. తెలుగింటమ్మాయి గారు (ఆవకాయ): మీ బ్లాగు ఇప్పుడే చదివాను, మాంచి భోజనానికి ముఖంవాచిపోయామని మీరు చెప్పిన తీరు భలే ముచ్చటేసింది. మా ఇంటికి వచ్చేయండి.. అరిటాకు వేసి మరీ ఆంధ్ర భోజనం.. మీరిచ్చిన title మెంతి బద్దలతో సహా(మేము మెంతికాయ అంటాము) అరిటికాయో లేకపోతే పనసపొట్టు ఆవపెట్టిన కూరా.. కొబ్బరి మామిడికాయ పచ్చడి, ముద్దపప్పు, నెయ్యి, కందిపచ్చడి, పెరుగు మామిడి పండు తో వడ్డించడానికి రేడీ..మా చుట్టాల్లో పెళ్ళిళ్ళల్లో వంటవాళ్ళు బాగా చేస్తారండి.. ఇలా కలగాపులగం కూరలు కాకుండా..

    ReplyDelete
  4. ఆత్రేయ గారు రమ్మన్నారు,ఇప్పుడు మీరు కూడా...కాసుకోండి మరి ఎప్పుడో ఠాప్ మని దిగబడి మీరు రాసినవన్నీ చేసిపెట్టండి అంటా,ఇక మీ ఇష్టం..పిలిచేసారు కదా :)). తూచ్ అంటాలు లేవు మరి.

    ఇంకా మీరు చెప్పిన కూరలతో చక్కటి పెళ్ళి భోజనం వడ్డించేవాళ్ళు కూడా ఉన్నారా....?గ్రేట్ అండీ బాబూ..మగ పెళ్ళి వాళ్ళ డిమాండు పక్కన బెడితే ఆడ పెళ్ళి వాళ్ళకే మనసొప్పట్లేదు కదా ఓ పది రకాల ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కూరలు,చాట్ లు వగైరా వగైరా పెట్టకపోతే.

    ReplyDelete
  5. మీరు ఇంకా కోపం గానే ఉన్నారా, కామెంటు పెట్టాలంటే భయంగా ఉంది. ఎందుకులెండి మళ్ళీ వస్తాను. :):)

    ReplyDelete
  6. ఆవకాయగారు: తప్పకుండా

    సుబ్రహ్మణ్యం గారు : శ్రీవారు ఈ పోస్ట్ చదివి..అవును నిజమే మా ఆవిడ ఎంత మంచిది ఏ జన్మలో, ఏ బంగారు పూలతో, ఏ దేవుడిని కొలిచానో నాకిలాంటి నైఫ్ కాదు కాదు వైఫ్ దొరికింది అని మురిసిపోయి .. ఈ నాటి ఈ బంధమేనాటిదో అని పాడుకుంటూ.. "ఓ చెలి కోపమా" .. అని అనేదాకా ఇలా ఖ్ఖ్ఖోపంగానే ఉంటాను.. అయితే ఈ కోపం శ్రీవారివరకు మాత్రమే.. మీకస్సలు భయం వలదు..

    కాకపోతే .... మీరు కూడా ఇదే బాపతయితే మరి అటునుండి వచ్చే ప్రమాదం నేను చెప్పలేను కదా..కాబట్టి మీరు కూడా తక్షణం అటునుండి నరుక్కొచేయండి.. అందరం హ్యాపీస్ :-)

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...