4.14.2011

శైలిని బట్టి ఫొటో ఉంటుందా? ఫోటోని బట్టి శైలి ఉంటుందా??

ఒక్కోసారి చికాకుగా ఉంటుంది. బోర్ కొడుతుంది.. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాము. ఏమి తోచదు, ఎవరు ఉండరు ఇంట్లో.. ఉంటేమటుకు ప్రశాంతంగా ఉంటామేంటి ఇలా చికాకు తలకెక్కినప్పుడు.. అక్కడికి ఎందుకలా చికాకు పడ్తావు.. కయ్.. కయ్ అని అరుస్తావు పిల్లలు, శ్రీవారు కూడా అంటునే ఉన్నారు.. ఏమిటో పొద్దుటునుండి ఇలాగే ఉంది.. ఎక్కడికన్నా వెళ్దామా అంటే ఈ ఎండల్లో ఏమి వెళ్తాము వద్దనేశారు.. ఎప్పుడో అడక్క అడక్క అడుగుతాము.. వద్దంటే మండిపోతుంది. అదే జరుగుతోంది నాకు,

ఇలా కాదని ఇదిగో ఇక్కడ ఒకసారి అలా బ్లాగులవైపు తొంగి చూశానా.. ఆన్లైన్ స్నేహితురాలొకరు.. "చూశార అక్కడ మీ ఫేస్ బుక్ లింకెవరో ఇచ్చారు " అంటూ మెసేజ్, ఎక్కడబ్బా.. నా ఫేస్ బుక్ ఏమి అన్యాయం చేసింది?  వ్యవహారం లింక్  పెట్టేదాకా వెళ్ళింది అని చూస్తే.... ప్చ్..


ఆ పోస్ట్‌కి, నా శైలికి లింకేంటో.. ఉందిపో.. నా శైలికి, నా ఫేస్ బుక్ ఫొటోకి సంబంధమేమిటో.. శైలిని బట్టి ఫొటో ఉంటుందా? ఫోటోని బట్టి   శైలి ఉంటుందా??  ఇలాంటి ప్రశ్నలు మదిలో ఉదయించి చికాకుని మరికాస్త పెంచేస్తున్నాయి.







దేవుడా!!  నాకాస్త ఇలాంటివి కొంచం అర్థం చేసుకునే బుద్ధిని ప్రసాదించు అని దేవుడిని దండం పెట్టుకోడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి నాది. :(

(అవునూ ..మనలో మన మాట నా ఫేస్ బుక్ లో ఫొటో అందరికీ కనిపిస్తోందా? నా లెక్క ప్రకారం కనపడకూడదు మరి.. తెలిసినవారేవరయినా కొంచం తెలియజేస్తారా ...కనిపిస్తుందా లేదా అన్నది)

4 comments:

  1. ఏమోనండి. నాకయితే ఫేస్‌బుక్ ఎక్కవుంటే లేదు - ఆ ఫోటో చూద్దామన్నా. ఇదివరలో ఎకవుంట్ వుండేది కానీ ఈమధ్యే తీసేసాను. మీరిచ్చిన లింక్ అయితే నాకు పనిచెయ్యలేదు.

    ReplyDelete
  2. అక్కా ఆ లింక్ పని చెయ్యడం లేదు .. కొంచెం పని చేసే లింక్ ఇస్తే చూసి కన్ఫర్మ్ చేస్తాను :)

    ReplyDelete
  3. హి హి హి.. ఆ కామెంట్ చూసినప్పుడు నేను కాసేపు లింకెంటా బుర్ర గొక్కున్నా...తరువాత అర్ధం అయింది.. సదరు వ్యక్తి కి ఎదయినా విషయం తెలిస్తే అది నాకు తెలుసొహొ అని చెప్పుకునే వరకూ నిద్ర పట్టదు. కనీసం సంధర్భం వచ్చే వరకూ కూడా ఎదురుచూడలేడు... :-)))
    మనలొ మనమాట ఇంతకు ముందొక సారి ఫొటొ లింక్ ఇచ్చాడు... ఇంచుమించు ఒక సంవత్సరం క్రితం ... ఎవరొ బ్లాగర్ల మీటింగ్ లొ మీరు ఉన్నారు అంటూ (అది మీ బ్లాగ్ లింక్ అనుకుంటా)...

    అవును ... నేను చూసినప్పుడు మీ ఫేస్ బుక్ లొ ఫొటొ కనిపించింది.

    ReplyDelete
  4. శరత్ గారు:ఫేస్ బుక్ కొంచం బోరే.. ఇంతకు ముందు అసలు ఇందులో ఏమి చేస్తాము అనిపించింది.. ఈమధ్యే కాస్త తెలిసి కేవలం ఫ్రండ్స్ కోసమన్నట్లుగా నా ఫొటో ఒకటి తగిలించానులెండి.. ఆ లింకే అక్కడ సదరుపోస్ట్ వ్యాఖ్యల్లో కనపడుతోంది. లింక్ మార్చాను ఇప్పుడు పనిచేస్తుందేమో చూడండి.

    కావ్య: అక్కా అని అప్యాయంగా పిలిచిన చెల్లాయ్!!! పనిచేసే లింక్ ఇచ్చాను చూడండి అక్కడి పోస్ట్ లింక్.. ఆ లింక్ కామెంట్స్లో నా ఫేస్బుక్ లింక్ ఇచ్చారు... చూసి ఆంటీ అంటారో, అమ్మమ్మ అంటారో.. హిహిహి..

    మంచుగారు: హహహ .. నిజమే కదా.. ఫొటో కేవలం స్నేహితుల కోసమే అన్న ఆప్షన్ పెట్టానండి అయినా ఎలా కనపడుతోందో మరి.. భవిష్యత్తులో ఇలా చూపించాలి అని కాబోసు.. మళ్ళీ మార్చానులెండి.. చూడాలి మరి.. మీరు చూసినప్పుడు నా ఫోటోలో నా శైలి కనపడిందా? లేక నా శైలిలో ఫోటో కనపడిందా??

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...