1.06.2010

06/01/2010

ఉద్యోగం పురుష లక్షణం... హ ..హ .. ఎందుకో ఈ మాట అసలు నిజమేన అనిపిస్తుంది. మా అపార్ట్మెంట్లో ఒకాయన నన్ను పలకరిస్తూ నా సమాచారాలు తెలుసుకుంటూ ఉంటే "మీరేమి చేస్తారండి " అని అడిగాను. "ఏమి లేదండి, మా అక్కయ్య మానసికంగా ఎదగలేదు చూసుకోడానికి ఎవరు లేరు అందుకని ఏమి ఉద్యోగం చేయడంలేదు" అని... సమాధానం. ఏమి చెయకుండా వెనకా ముందు ఆస్తిపాస్తులు లేకుండా ఎలా వీళ్ళు సంసారాన్ని , ఈ భవ సాగరాన్ని ఈదుతారు? ఇక్కడనే కాదు, మా చుట్టాల్లో కూడా చాలామంది నాకు తెలిసినవాళ్ళు ఏ ఉద్యోగం లేకుండానే గడిపేస్తూ ఉంటారు .. ఎలా వాళ్ళు కాలం వెళ్ళబుచ్చుతారో నాకర్థం కాదు. ఇద్దరం ఉద్యోగం చేస్తుంటేనే 5 రూపాయల అప్పు పుట్టడం కష్టం ..(మాకని కాదు) కాని, అసలేమి చేయకుండా తెగ అప్పులు చేసెసి ఇంటిని అలకరించుకోడంవల్ల సుఖమేంటి? నాకు పెళ్ళయినప్పటినుండి నాలో తొలుస్తున్న ప్రశ్న ఇది. ఏమో! చెప్పలేము వీళ్ళకేమన్నా లంకె బిందెలు దొరుకుతాయని నమ్మకమేమో అనిపిస్తుంది.. :-)

సరే.. ఆయన అలా అన్నారు కదా అని, " అకౌంట్స్ అవి బాగా వస్తే .. మీకు ఉద్యోగం చూడడం పెద్ద సమస్య కాదండి, నేను చూస్తాను" అన్నా... "లేదండి నాకు బి పి ... షుగర్ అవీ ఉన్నాయి ఎదో ఆవిడ చేస్తోంది కదా కాస్త పిల్లలు ఎదిగేవరకు.. ఇలా తప్పదు " అన్న సమాధానం... :-) ఆవిడ అదేదొ చిన్న స్కూల్ లో ప్రైమరీ టీచర్.. మహా అయితె 3,000/- ఇస్తారేమో.. ఇంకా స్కూల్ కెళ్ళే పిల్లలు.. మరి ఆ ధీమా ఎంటో? ప్చ్.. నాకర్థం కారు ఇలాంటి వాళ్ళు.
****

అన్నీ కోల్పోయినప్పటికీ,జీరో బేస్డ్ స్థాయి నించీ జీవితాన్ని మొదలెట్టచ్చట.. అవునంటారా?

****


1 comment:

  1. మీరు వ్రాస్తుంది ఏ రోజుకారోజు డైరీ అయినప్పటికీ ఆ రోజుకి ముఖ్య మయిన ఆన్శాన్ని కూడా టైటిల్ లో పెడితే టపా చదవడానికి నాలాంటివారికి ఆసక్తికరంగా వుంటుంది. తేదీ + టైటిల్.

    నేను నా జీవితాన్ని చాలాసార్లు మొదటినుండీ మొదలుపెట్టాను :)

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...