1.01.2010

01/01/2010

కొత్త సంవత్సరం.. కొత్తగా ఏమి అనిపించలేదు నిన్న ఎలా ఉందో ఈరోజు అలానే ఉంది. ఇంట్లో కాలేండర్ మారింది, ఆఫీసులో సంతకం చేస్తున్నప్పుడు మటుకు డేట్ పొరపాటున 2009 పడ్తోంది రెండుసార్లు అలా జరిగిన పొరపాటు మూడో సారి జరగకుండా జాగ్రత్త వహించడం కొంచం కష్టమయ్యింది.
ప్రతీ సారి ఈ కొత్త సంవత్సరానికో, లేదా సంక్రాంతి పండగలకో నాకు గుర్తోచ్చేది మా అమ్మా వాళ్ళ ఇల్లు. పెద్ద వాకిలి.. సాయంత్రం 4 గంటలనుండే అమ్మ హడావిడీ ముగ్గెయ్యాలి అని.... కనీసం రవంత స్థలం కూడా ఖాళీ లేకుండా ముగ్గులు పెట్టండార్రా అని పోరేది . అన్నీ "ముగ్గులెందుకమ్మా " అని సరదాగా అనేసినా, రాత్రంతా ముగ్గులు ...రంగులతో .... నడుము పడిపోయినా, చేతులు కొయ్యబారిపోయినా ...అక్క నేను కలిసి ముగ్గులు పెట్టి , అందరికీ మా ముగ్గుల ద్వారా న్యూ ఇయర్ విషెస్ చెప్పి పడుకొనేవాళ్ళము. ఇప్పుడు ముగ్గుల సందడి అంత లేదు. ఉన్నా ఆ సరదా అంతా ఇక పిల్లలిదేగా.. :-)

కొత్త సంవత్సరానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారుట. ఏముంటాయి... నిన్నటిదాక ఎలా ఉన్నామో అలాగే ఉంటాము ఆర్థికంగా ఎదగాలి అంటేనో, దానికో నిర్ణయం తీసుకోడానికోఅయితే కొత్త సంవత్సరం అవసరమేముంది. మంచి నిర్ణయాలకి ప్రతిరోజు మంచిరోజే.

ఎదో మంచి నిర్ణయం తీసుకోవాలి .. అది ఒక ఆనవాయితి అని అంటున్నారు కాబట్టి ఈసారి నేను తీసుకున్న నిర్ణయం ఒక డైరి రాయడం.. ఇలా బ్లాగులో, అందుకే ప్రత్యేకంగా జనవరి మొదటినుండి కాకుండా 28 డిసెంబర్ నుండే ప్రారంభించాను. చూద్దాము, ఎంతవరకు నిర్విఘ్నంగా సాగుతుందో, మనసులో ఏదో అనుకుంటాను దానికి సంబంధించి రాద్దామనుకుంటూనే వాయిదా వేసెస్తాను తీరా కాస్త తీరిక దొరికి రాద్దామని కూర్చున్నప్పుడు అనుకున్న పాయింటు కాస్తా హుళక్కి. అందుకే ఆలోచన వచ్చిందే తడవు ఇక్కడ డైరీలా అమలు చేసేస్తున్నాను. ముఖ్యంగా రేపొద్దున్న నా పిల్లలకన్నా పనికొస్తుందన్న ఆలోచన అంతే. మన ప్రతీ ఆలోచనని లేదా మనగురించి ప్రతిసారి పిల్లలికి చెప్పలేము వాళ్ళే తెలుసుకుంటారు. రేపొద్దున్నఇవి చదువుకుని అమ్మ అలోచనలు ఇవి అని..

"ఒక మనిషి కష్టం లో ఉంటే ఆదుకోడానికి ప్రాణస్నేహమే అక్కర్లేదు,మమూలు స్నేహం చాలు,ఇంకా ఎదగగలిగితే మానవత్వం చాలు." ... నిజమే కదా.. :-)


7 comments:

  1. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. బావుందండీ మీ నిరవధిక డైరీ కార్యక్రమం. నాకూ ఇలాంటి ఆలోచనే వచ్చింది కానీ అన్ని రోజులు వ్రాయాలనుకోలేదు. అప్పుడప్పుడు వ్రాయాలనుకున్నాను. ఇప్పుడు ఆ కొన్ని రోజులు వ్రాసినా మిమ్మల్ని కాపీ కొట్టినట్టవుతుంది. హ్మ్మ్

    నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
    ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని. మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
    భద్రాచల నరసింహ క్యాలండర్ – 2010 ఈ కింది లింకులో
    http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
    ధన్యవాదములు
    - భద్రసింహ

    ReplyDelete
  4. రమణి గారూ నూతన సంవత్సర శుభాకాకంక్షలు
    మీ కొత్త ఆలోచన బ్లాగు డైరీ ' బావుంది . నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను

    ReplyDelete
  5. మీకు మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. నూతన సంవత్సర శుభాకాంక్షలు .

    ReplyDelete
  7. మీకూ మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...