1.10.2010

10/01/2010

"నాన్న" బ్లాగులో అరెసెల కత చెప్పి నోరూరించేశారు. అరెసెలు పత్తి పని , భోగి రోజు చక్ర పొంగలి, సంక్రాంతి బొబ్బట్లు, కనుమ గారెలు అని ఫిక్స్ అయి ఉన్నాము, తీరా చూస్తే ఇక్కడ అరిసెలు గట్రా చెప్పేసారు సరే మెన్యూ లోకి అరిసెలని చేర్చెసాను. చేర్చడం "విజ్జీ" :-) కాని చేయడం?? అనుకొన్నదే తడవుగా ఈనాడులో కూడా "ఒహొరె అరిసెలుల్లా" అని వ్యాసం, ఇంక లాభం లేదు అరిసెలు తినాల్సిందే అని కఛ్చితంగా నిర్ణయించేసుకుని, అక్కా!! .. అమ్మా !! అంటూ సెల్ కి పని చెప్పాను, ఇద్దరినుండి తలో చెయ్యి వేస్తాము చేసేసుకుందామని గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. హమ్మయ్య అని అరిసెలు తినేసినంత సంబరం వచ్చేసిందంటే నమ్మండి.. సంబరం అరిసెలకనే కాదు..

అప్పట్లో... అసలు సాధారణంగా పండగ అంటే హడావిడి మా ఇంట్లోనే ... జనవరి నెల మొదట్లోనే "కాంతమ్మగారు మైసూర్‌పాక్ చేసిపెట్టండి", " కాంతమ్మగారు కాస్తా ఈ మెంతులు బాగు చేసి ఇవ్వండి" , "కాంతమ్మగారు ఈ పిండివంటలో ఇంత చక్కెర సరిపోతుందా " అంటూ ఇరుగుపొరుగు అమ్మకోసం చేసే సందడితో , పండగ హడావిడితో, నెల ముందు నుండి ఇల్లు కడుక్కోడం , ఇత్తడి సామాన్లకి బంగారు పూత వేసినట్లుగా తోమడం, బాయ్‌లెర్ ప్రహసనం, ఎంత హడావిడిగా ఉండేదో మా ఇల్లు. అలాంటిది ఇప్పుడు ఉద్యోగాలు, ఎదో కాస్త పులిహోర పరవాన్నం చేసుకుని పండగలు అయ్యాయి అనిపించేస్తున్నారు, అలాగే పండగలకి కుటుంబ సభ్యులు కలవడం అనేది తగ్గిపోయింది. సెల్ ఫొన్ శుభాకాంక్షలు, కలిసి చెప్పుకునే శుభాకాంక్షలని అధిగమించాయి మరి ఈ సంధర్భంలో ఇలాంటి పిండివంటలకోసమంటూ మళ్ళీ నలుగురూ కలవడం... "అరిసెలు ఒక్కటే కాదే.. బొబ్బట్లు కూడా" చేసేసుకుందామనుకోడం... పండగంటే ఇలా ఎక్కడెక్కడో ఉన్న అందరం కలవడమే కదూ.. :-)
****

ఒక మాట...ఒక స్పర్శ..స్నేహపురస్కారంగా ఒక సానుభూతి..మనిషి మనిషికీ మధ్య ప్రేమా, ఆప్యాయతా, కరుణతో కంటినిండా చిప్పిల్లిన నీళ్ళూ మనసునిండా సంతృప్తి...విషాదానికీ ఆనందానికీ తేడాలేకపోడం...ఇంతకన్నా ఏమి కావాలి జీవితానికి? డబ్బు,పదవి,రికమండేషన్లు మెటీరియలిస్టిక్ దృక్పధం...రోజువారీ జీవితం...మనిషి మనిషికీ మధ్య ఉండే బంధంతో పోల్చుకుంటే ఇవి ఏపాటివి?

****



2 comments:

  1. పల్లెలోనే ఆప్యాయతలు ఎక్కువ వుంటాయి కాబట్టి ఇండియా వచ్చినప్పుడల్లా కొన్నిరోజులయినా పల్లెవాసం, పల్లె నిద్ర చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈసారి ఏదయినా పండక్కి పల్లెలోనే వుండేటట్లుగ చూసుకుంటాను.

    ReplyDelete
  2. మాది పల్లె వాసం కాదు శరత్ గారు పట్నవాసమె... ప్రస్థుత వివాదాల మహానగరం హైదరాబాదు మాది, కాని ఇలాంటి ప్రత్యేక సమయాల్లో ఆంధ్రా హడావిడి వచ్చేస్తుంది మాకు. మా ఇంటి చుట్టుపక్కల అందరూ వాళ్ళే మరి. :-)

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.

Loading...