ఒక వారం రోజుల ముందు సుపర్ బజార్ లో ఏవో సరుకులు తీసుకుందామని వెళ్లాను. అక్కడ షాపింగ్ మధ్యలో అమ్మ ఫోన్ చేసింది. అమ్మా ఫలానాచోట ఉన్నా! ఇంటికెళ్ళగానే ఫోన్ చేస్తా! అని పెట్టేసాను. తరువాత మర్చిపోయాను. ఇదిగో ఇందాక ఫోన్ చేశాను. "ఆరోజనగా చేస్తాను అన్నావు ఇంతవరకు చేయలేదు , రోజు తమ్ముడిని అదుగుతూనె ఉన్నాను "అక్క ఫోన్ చేసిందా?" అని నా సెల్ లో బాలన్సు లేదు, నువ్వు చేయకపోయే సరికి నా ఫోన్ పాడయిందేమో రావట్లేదేమోఅనుకున్నా అంది! ఎంత బాధ అనిపించిందంటే ఏవో షేరింగ్స్ చూస్తున్నా! ఒక వృద్ధురాలు తన మొబైల్ షాప్ కి తీసుకెళ్ళి పాడయిందేమో చూడమనడం, అంటాబాగానేఉందిఅని వాళ్ళు చెప్పడం, మాపిల్లల ఫోన్ రావడం లేదనడం. అబ్బా ! మనసు చాలా బాధపడింది.
7.25.2016
7.24.2016
మౌనం ఎంత గొప్పదో !
సంగీతానికి వయసు అడ్డురాదని నిరూపించిన శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఎంత శ్రావ్యంగా ఉంది ఈ పాట.
చీకటి గుహ నీవు
చింతల చెలి నీవు
నాటకరంగానివే మనసా
తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో
ఎందుకు వగిచేవో
ఎందుకు రగిలేవో
ఏమై మిగిలెవో
చింతల చెలి నీవు
నాటకరంగానివే మనసా
తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో
ఎందుకు వగిచేవో
ఎందుకు రగిలేవో
ఏమై మిగిలెవో
కోర్కెల సెల నీవు
కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా!
మాయల దెయ్యానివే
లేనిది కోరేవు
ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా!
మాయల దెయ్యానివే
లేనిది కోరేవు
ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా!
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు.
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు.
7.23.2016
ఎక్కడో ఎదో ఆత్మవిశ్వాసం కొరవడింది.
మనకన్నా ఎదుటివాడు అధముడు అనుకుంటేనే మనం ఎదగ గలమా? ముందుకు సాగుదామనే సంకల్పం కన్నా, వెనక్కి లాగే శక్తి అశక్తుల్ని చేసేస్తోంది.
తలుపేసుకుంటే......ఒక భావన
నీనుంచి దూరంగా వెళ్ళగలను కాని , నీతలపులనుంచి.. నీతో గడిపిన క్షణాల నుంచి ఎంత దూరం పారిపోగలను? తలుపేసుకుంటే నీ తలపాగుతుందా? మదిలోన ఉంటె ప్రాణం ఆగుతుందా?
7.22.2016
అద్దములో నీ చెలువు తిలకింపకు ప్రేయసీ!
హే ఆంటీ వాంటి క్యా హై భయ్!
నేనసలు ఒప్పుకొను ఒప్పుకోనంటే ఒప్పుకోనంతే! మా పిల్లల వయసువాళ్ళు అంటి అని పిలిస్తే ఆప్యాయంగా వినిపిస్తోంది. కాని అదేంటండి మొన్నే రిటైర్ అయిన ఒ పెద్దమనిషి నిన్న గుళ్ళో "ఏంటి అంటి అసలు కనపడడం లేదు" అని పలకరింపా? నా వయసు ఎంత చిన్నబుచ్సుకుందో! ఆళ్ళనేవరికన్నా చూపించండిరా బాబు! ఎన్నాళ్ళిలా? రిటైర్ అయినవాళ్ళు అంటి అని పిలిచేలా ఉన్నానా నేను ఐ హార్ట్ !
:(
7.21.2016
కబాలి
రేపు కబాలి సినిమా ఏదో ఒక షో చూడకపోతే జనాభ లెక్కల్లోంచి తీసేసేట్టు ఉన్నారు బాబోయ్... ఇప్పుడు కబాలి టికెట్టే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, ఆరోగ్యశ్రీ.. etc etc :)
:) :)
:) :)
7.20.2016
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికీ ఎరుక .....
ఎదుటివారు మనల్ని తప్పించుకోడానికో, వదులుకోడానికో చెప్పే సాకులు వినేకన్నా మనమే తప్పుకుంటే ...........
7.19.2016
మనీ మనీ
ఏ ఇద్దరి ఆలోచనలు కలవవు అభిప్రాయలు ఒకటవవు.. ఒకటి రెండు కలిసినంత మాత్రాన మనల్ని వాళ్ళల్లో చూసుకుంటున్నాము అనేది భ్రమ, ఎప్పటికయినా ఎవరయినా వేరు వేరే.. ఇగోలోో , అహంకారమో అభిమానమో ఎదో ఒకటి మనిషిని మనిషిని వేరు చేసేస్తుంది వీటిని ప్రేమ జయించడం కష్టమే , కాకపోతే చాలా చోట్ల డబ్బుకి ఇవన్నీ అణిగి ఉండే అవకాశాలు ఉన్నాయి -రమణి రాచపూడి
మూగబోయిన మాటలు
పైరగాలి చల్లటి వాతావరణంలో, మల్లేపూల పరిమళాలను ఆఘ్రాణిస్తూ మనసునుండి మధురంగా రావాల్సిన మన మాటలు బంధాల మధ్య, రైలు శభ్ధాల మధ్య, పాలు, పేపర్ వాడి అరుపుల మధ్యలో నలిగి మూగబోయి మౌనాన్ని ఆశ్రయించాయి.,,,,
రచయిత్రి హోదాని నిలబెట్టండి
.
ఒకప్పుడు ప్రముఖ రచయిత్రులని, రచయితలని చూడాలంటే జీవితకాలం ఎదురుచూడాలి అన్నట్లుండేవారు. సినిమా హీరో హీరోయిన్లకి సరి సమాన ప్రేక్షకాదరణ/పాఠకాదరణ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా వల్ల అందరు అందరికి దగ్గరవుతున్నారు. కాని వారి ప్రత్యేకతని కాపాడుకోగలుగుతున్నారా అంటే కించిత్ అనుమానమే. ఒకవేళ ఒకరో ఇద్దరో హుందాగా వారి రచనలు వారు చేసుకుంటూ పాఠకులకి కాస్త దూరంగా ఉన్నా మిగతా ఊరు పేరు లేని రచయిత్రులమని చెప్పుకుని ఎగిరిపడేవాళ్ళ కోవలోకి వచ్చేస్తున్నారు అనామకంగా.. నాకయితే చాలా బాధగా ఉంది.
సోషల్ మీడియాలనుపయోగించుకుకొని నాలుగు లైన్లు రాస్తే అవి రచనలు మేము రచయిత్రులం అని అనుకునేవారి మనసు ఎటు గాలి వేస్తే అటు లొంగిపోతూ ఉంటుంది ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక పెద్దమనిషి తనను తాను అదేదో ప్రభుత్వోద్యోగిగా పరిచయం చేసుకుని, మాట మాట కదిపి తనకి పరిచయమయిన రచయిత్రుల గురించి చెప్పుకుంటూ వస్తుంటే మనసు ఎక్కడో కొంచం "అబ్బా" అని అనిపించింది. వారేమన్న ప్రముఖ అని బిరుదు తగిలించుకున్న రచయిత్రులేమో అని నేను వాకబు చేస్తే అరా కొరా అక్కడక్కడ నాలుగు కథలు రాసిన వాళ్ళు (నాలాగ) సో వాళ్ళ వల్ల "మీ రచయిత్రులు అలా, మీ రచయిత్రులు ఇలా " అంటూ .. అభం సుభం తెలియని ఎంతో మంది అపనిందలపాలవుతున్నారు. ఈ అనుభవం రెండు సంవత్సారల క్రితం నాకు జరిగింది .. అప్పుడు రాసిన పోస్ట్ (click on link) చాలా స్ట్రాంగ్ గా జవాబు చెప్పాను. ఇదిగో రెండు రోజుల క్రితం మరో రచయిత్రుల వెకిలి చేష్టలు వెలుగులోకి వచ్చాయి. వీరు చేసే ఏ చేష్ఠలు వ్యక్తిగతమయితే ఎవరికి ఇబ్బంది కలిగించనివి అయితే వారిని అనే హక్కు నాకు లేదు. కాని వారి వల్ల కుటుంబాలకి కుటుంబాలు అభాసుపాలవుతున్నాయి. ఒక పని చేసేముందో ఒకరిని ఇబ్బంది కలిగించేముందో ఒక్క క్షణం ఆలోచించండి.. ప్లీజ్ మీరు చాలా గొప్పపనులు చేసేస్తున్నాము అని అనుకుని చేస్తున్న పనుల వల్ల ఎంతోమంది "ప్రముఖ" రచయిత్రులు అభాసుపాలవుతున్నారు. ఎదుటివాడు మనల్ని చాలా చీప్ గా నేలబారుతనంతో అంచనా వేసేసి రచయిత్రులయితే సులువుగా పరిచయం పెంచేసుకోవచ్చు అనే అభిప్రాయం కలగజేసేస్తున్నారు,నిజమయిన రచయిత్రుల వ్యక్తిత్వం దెబ్బ తినేలా.... రచయిత్రీ అనే హోదాని కాపాడండి వారంటే ఉన్న అభిప్రాయానికి ముసుగులు వేయకండి.. ఏ ఒక్కరినో ఉద్దేశ్యించి చెప్తున్న విషయం కాదు కథలు నవలలు కాస్త కల్పితం కాస్త నిజం కలగలిపి మొత్తం కల్పనే, కాని జీవితం నిజం . నిజ జీవితాలని కథలుగా చేసుకోవద్దు.
రచయిత్రులు అని పరిచయం చేసుకుంటున్న, చేసుకున్న,.. ఇంకోకరు పరిచయం చేసిన వారి గురించి కొన్ని సంఘటనల విన్న నేపధ్యంలో "మేడం మీరు రచయిత్రా? అని అడిగీనవారికి , నా సమాధానం : కాదు నేను నామమాత్రపు రచయిత్రిని కాదు, ప్రముఖ రచయిత్రిని కూడా కాదు, నాకు తోచినవేవో రాసుకుంటూ ఉండే రమణిని.
మన ఆడ రచయిత్రులపై (నిజమయిన) నిందలు పోవాలని మంచి రచనలు చేసేవారందరూ స్వఛ్చమయిన రచయిత్రులుగా పేరొందాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ. ...
నన్ను నేను చదువుకోడానికి ఎప్పుడు ఇష్టపడతాను
నన్ను నేను చదువుకోడానికి ఎప్పుడు ఇష్టపడతాను. నేను డిజైన్ చేసుకున్న అందమయిన పుస్తకం నా జీవితం. నాకున్న కష్టాలయినా, సుఖాలయినా ఏమాత్రం పొంగిపోకుండా , కృంగిపోకుండా ప్రతి పేజీని ప్రేమతో అందంగా మలుచుకుంటున్నా కాని ఈ మధ్యే మరీ ఖాళీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏమి పూరించలేక కాదు కాని ఎక్కడో వ్యక్తిత్వమో , అభిమానమో మా ప్రమేయం లేకుండా సాగుతున్నావు చూడు అని హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. చేతికేవో సంకెళ్ళున్నాయేమో అనిపిస్తోంది... దేనికి తడబడుతున్నానో ఏ ప్రలోభాలకి తలవగ్గుతున్నానో ఆలోచించాలి.
7.18.2016
మన జీవన రీతి
చెమరిస్తే
కళ్ళు తుడవాలి..!
భారమైతే..
మది తడమాలి..!
మింటికెగిస్తే..
భుజం తట్టాలి..!
మన్ను కలిస్తే..
కన్ను తడవాలి..!
నవ్వడానికైనా..
ఏడ్వడానికైనా
స్వాగతించడానికైనా
సాగనంపడానికైనా
నీ వాళ్ళంటూ కొందరుండాలి..!
అరే భాయీ..
డబ్బు డాబూ ...
నడకున్నంత సేపేరా..!
పడకేసావంటే..
చేతులు మారినట్టేేరా..!
డబ్బులో ములిగిపోకు..
మనుషుల్ని మర్చిపోకు..!
డబ్బుకి పరిమితి..
మనిషికి పరిణితి..
ఇదే కావాలి నీ జీవన రీతి..!!
By vemuri Garu
తాగి నడిపితే కెరీర్ ఖతం!
డ్రంకెన్ డ్రైవ్ మీద పోలీసుల ఉక్కుపాదం: ఇదో మంచి పరిణామం
ఇకపై మద్యం తాగి బండి నడిపితే కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడ్డట్టే! పాస్‌పోర్టు రాదు. వచ్చిన పాస్‌పోర్టు మీద వీసా రాదు. విద్యార్థులకు కొత్తగా కాలేజీల్లో సీట్లు ఇవ్వరు. ఉద్యోగులైతే వ్యక్తిగత రిమార్కుల్లోకి చేరిపోతుంది. నిరుద్యోగులైతే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు బ్లాక్‌లో పెడుతాయి. డ్రైవింగ్ లైసెన్స్‌పై శాశ్వత నిషేధం విధిస్తారు. నూతన వాహనాల రిజిస్ట్రేషన్ చేయరు. ఉన్న వాహనాల ఆర్సీలను రెన్యూవల్ చేయరు. పైండ్లెన వాళ్లకు మరో చిక్కు. తాగి పట్టుబడితే పోలీసుల వద్దకు భార్యతో సహా వచ్చి ఆవిడ ముందు కౌన్సెలింగ్ తీసుకోవాలి.
-మైనర్లకు మద్యం ఇస్తే బార్ల లైసెన్సులు రద్దు
-బండి ఇచ్చే యజమాని మీద కేసు
-భార్య/కుటుంబ సభ్యుల ఎదుట కౌన్సెలింగ్
-అన్ని విషయాలు పోలీస్ డేటాబేస్‌లోకి..
-డ్రంకెన్ డ్రైవ్ మీద పోలీసుల ఉక్కుపాదం
మైనర్లకు బండి ఇస్తే పెద్దల మీద కేసులు పెడతారు. మద్యం మత్తులో ప్రమాదాలకు పాల్పడితే ఐపీసీ 304 పార్ట్ 11 సెక్షన్ కింద కేసులు పెడతారు. పదేండ్ల శిక్ష పడుతుంది. గతంలో డ్రైవర్ తాగిందీ లేనిదీ తెలుసుకునేందుకు వైద్యశాలలకు పంపితే కేసులు తారుమారయ్యేవి. ఇపుడా పద్ధతి మార్చేశారు. బ్రీత్ ఎనలైజర్లతో సంఘటన స్థలంలోనే తేల్చేస్తారు. ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియా తీయించి సాక్ష్యంగా కోర్టుకు సమర్పిస్తారు. మొత్తంగా మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాల నివారణ మీద, డ్రంకన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌ల మీద హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
లైట్ తీసుకుంటే భవిష్యత్తు చీకటే..!
డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, లైసెన్స్ లేని డ్రైవింగ్, మైనర్ డైవింగ్‌కు భారీ మూల్యమే చెల్లించవలిసి వస్తుంది. పోలీసులు ప్రతి కేసును డాటాబేస్ రూపంలో భద్ర పరుస్తారు. పట్టుబడ్డ వారి వివరాలను ఆయా విభాగాలకు పంపించడం, లేదంటే ట్రాఫిక్ విభాగం డాటాబేస్‌ను షేర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఫలితంగా ఈ కింద తెలిపిన వాటికి మీరు అర్హత కోల్పోవల్సి వస్తుంది.
-మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం చేస్తే పాస్‌పోర్టు జారీ కాదు
-పాస్‌పోర్టు ఉన్న వ్యక్తులకు వీసా కష్టసాధ్యమయ్యే అవకాశం
-ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది
-ఉద్యోగాలకు వెళ్లాలంటే క్యారెక్టర్ సర్టిఫికెట్‌లో ఈ వివరాలుంటాయి.
-డ్రైవింగ్ లైసెన్స్ రాదు, ఉన్న వారిపై శాశ్వత నిషేధం విధించే అవకాశముంది.
-వాహనాలు కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ చేయించలేరు
-మైనర్లు అయితే స్కూల్, కాలేజీల్లో అడ్మిషన్ ఇవ్వరు.
-డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఆర్సీల రెన్యూవల్ చేసుకోలేరు.
-స్కూల్/ కాలేజీ నుంచి సస్పెన్షన్ తప్పనిసరి కావచ్చు.
-బార్లు, పబ్బుల యాజమాన్యాలు లైసెన్స్ కోల్పోవాల్సి వస్తుంది.
-ప్రభుత్వం, ప్రైవేట్ ఉద్యోగులైతే ప్రవర్తన సరిగా లేదని చర్యలకు ఆదేశిస్తారు.
*****
7.17.2016
మగ చూపులా - మృగ చూపులా?
అతడు: నీ పైట నా పడవ తెరచాపకావాలా...
ఆమె: నీ చూపే చుక్కానిగా దారి చూపాలా...
మగచూపులకి సంబంధించి ఆర్టికల్ చదివాను. సినిమాల్లోనూ బయట ఆడవాళ్ళని మగవాళ్ళు చూసే విధానాన్ని విడమర్చి చెప్పారు రచయిత్రి. హుందాగా రాసారు.
కాకపోతే అనాగరిక కాలం నుండి ఇప్పటి వరకు కూడా మగవాడు చూస్తేనే స్త్రీలు ప్రతిస్పందిస్తేనే కదా సృష్టి జరిగింది ఆ క్లారిటీ ఎందుకు మిస్ అవుతున్నారు? ఆడదాన్ని వస్తువుగా పరిగణించి చూపుల వ్యాపారం జరుగుతోంది అంటున్నారు, అన్నిచోట్లా కాదు కాని కొన్ని వాణిజ్య ప్రకటన్ల్లో జరుగుతోంది వాటిని నిరసిద్దాము. ఇక అసలు మగ చూపులే లెకపోతే ఆడవాళ్ళ అందానికి న్యాయం/ఉనికి ఉందా? అందం అస్వాదించే నైజం/గుణం మగవాడికి లేకపోతే ఈ వర్ణనలు ఎలా వస్తాయి? ఏముంది కళ్ళు ముక్కు , చెవులు అని అనేస్తే సరిపోతుంది కదా! శంఖం లాంటి మెడ, కలువల్లాన్టి కళ్ళు, చంద్రబింబం అంటూ మగ చూపులే ఆడదాన్ని అందంగా వర్ణించేది ఆ రసిక హృదయం ఉండాలి కదా! మనుగడో, మానసిక ఉల్లసామో , ఆహ్లాదకరమయిన ఆనందమో ఏదయితేనేమి అదంతా కలిపితే శృంగారం అయినప్పుడు మగవాడి చూపుని మడి కట్టుకోమనడం సబబా? అదే జరిగితే అసలు ఈ శృంగార కవులు ఎలా పుట్టుకొచ్చారు? ఏ అనుభవం ఏ రసాస్వాదన లేకుండా ఆడవాళ్ళకి కాలికొన గోటి వేలినుండి తలవెంట్రుక దాక ప్యాక్ చేసేసి కలం పెట్టి శృంగార కవితలు రాసారా?
వెకిలి చూపులు వెకిలి చేష్టలు లాంటి మృగచూపులు ఉండకూడదు కాని మగచూపులు కావాలి ఏ ఆడదానికయినా.. ఎవరో అన్నారు ! సినిమాలు విజయం సాధించిన ఇంద్రసూయి, కిరణ్‌బేడి లాంటి సినిమాలు తీయాలి అని మనలో మనమాట వాళ్ళు కూడా ప్రకృతి సహకరిస్తే సృష్టి కార్యం అంటే మగచూపులు తగిలితేనే మనకి ఈరోజు కనిపిస్తున్నారు. వారు హాయిగా సంసారాలు చేసుకుంటున్నారు. వినిపించే విజయ గాధలలో సాహసకృత్యాలు చెప్తారు కాని, కనిపించే సినిమాలో హుందాగా ఒకటో రెండో సంసార తరహా సీన్స్ చూపిస్తారు.
ప్రకృతి తరువాత అంత అందమయినది స్త్రీ. నిండుగా కట్టే చీరలో కూడా మగవాడి చూపుల్ని కట్టిపడేస్తుంది మరి ఆ చూపులే వద్దంటే? పెద్దవాళ్ళెందరినో ఉదహరించి ఆఖరికి వాళ్ళు కూడా చూపుల వస్తువుని చేసేసారు ఆడదాన్ని అంటే? ప్రకృతి అందాల్ని చూడడానికి అరకులోయ , ఊటి , కొడైకనాల్ అంటూ వెళ్తాము అక్కడికె వెళ్ళి కళ్ళకు గంతలు కట్టుకుంటామా? అందాన్ని ఆస్వాదిస్తాము. సౌందర్యారాధన అది, వద్దంటే ఎలా?
(పైన ఫోటోలో : ఇక్కడ ఆమె నిండుగానే ఉన్నా అందంగా ఉంది చూపు తిప్పుకోలేని అందం కనిపించినప్పుడు అధ్యక్షుడయినా సరే, మగవాడు మరి చూస్తాడు కదా.. ఇది ఆమె తప్పు కాదు అతని తప్పు కాదు అందం తప్పు. )
****
సినిమాల ప్రస్తావన: పూలరెక్కలు, కొన్ని తేనే చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అంటూ ఏ అనుభూతి అనుభవం, చూపుల తాకిడి లేకుండానే జఢపదార్థాలుగా మడికట్టుకుని రాసారా ఈ పాటలు మడికట్టుకునే నాభి అందాలని చూపిస్తూ వర్ణించారా సినీ కవులు, ప్రొడ్యూసర్లు? సౌందర్యారాధన తప్పు కాదు. దేవాలయాలో చెక్కిన శిల్పాల గురించెందుకు మాట్లాడరు? ఏ మగ చూపులు సోకని అందాలా అవి? రమ్యకృష్ణ నాభి సౌందర్యాన్ని సుడిగుండంతో పోల్చారు, ఎంతటి పరిశీలాత్మక ఆరాధన లేకపోతే అంత ఉపమానలంకారాలు వస్తాయి? పాత సినిమాలనుండి ఇప్పటి సినిమాల వరకు నిండుగా చీర కట్టుకున్న సావిత్రి మొదలుకొని నిన్న మొన్న జయప్రద , సౌందర్య లు కూడా మగవారి చూపుల్ని కట్టిపడేసిన వారే. ఆ చూపులే లేకపొతే ఆందానికి ఉనికి ఉందా అసలు.
ఆడదాని అందాలకి ఉనికి తెచ్చే మగ చూపుల గురించి యుద్ధం చేయకండి చచ్చు పుచ్చు వాణిజ్య ప్రకటనలు వస్తున్నాయి అవేవో స్ప్రే వల్ల ఇల్లు వళ్ళు మరిచి అతనివెంట వెళ్ళింది అంటూ ఆమె మెడలో మంగళసూత్రాలని సింబాలిక్ గా చూపిస్తూ వాటిపై ద్వజం ఎత్తండి. చూపుల శరఘాతాలని మధ్యలోనే తిప్పి పంపకండి, మనకి మృగచూపులు వద్దు మగచూపులు కావాలి.
అసలిలా మగచూపులు, బ్రహ్మచర్యాలు, సన్యాసి అవతారాలు అంటే నాకు వళ్ళు మంట... సృష్టిలో ఇన్ని అందాలని ఇచ్చి ఇంత మేధస్సు ఇచ్చి సంతోషంగా జీవించమంటే సూక్తులు రీతులు చెప్తూ ఉంటారేంటో. సంసారం రంధి సన్యాసం మంచిది అని ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎలా వచ్చారో ఆ ఆంతర్యం తెలుసుకోవాలి మొదట. కామిగాని వాడు మోక్షగామి కాలేడు, రసాస్వాదన, సౌందర్యారధన, అందాన్ని అస్వాదించేలేని వాళ్ళు మగచూపుల ఆంతర్యం తెలుసుకొలేనివాళ్ళు స్పందన లేని యంత్రాలు నా దృష్టిలో.
అంచేత నే చెప్పొచ్చేదేమిటంటే... చాలవరకు ఆడవాళ్ళ పైట తెరచాప అయితే మగచూపులు చుక్కానిగా దారి చూపేవే..
*******
Subscribe to:
Posts (Atom)
Loading...