7.22.2016

హే ఆంటీ వాంటి క్యా హై భయ్!


నేనసలు ఒప్పుకొను ఒప్పుకోనంటే ఒప్పుకోనంతే! మా పిల్లల వయసువాళ్ళు అంటి అని పిలిస్తే ఆప్యాయంగా వినిపిస్తోంది. కాని అదేంటండి మొన్నే రిటైర్ అయిన ఒ పెద్దమనిషి నిన్న గుళ్ళో "ఏంటి అంటి అసలు కనపడడం లేదు" అని పలకరింపా? నా వయసు ఎంత చిన్నబుచ్సుకుందో! ఆళ్ళనేవరికన్నా చూపించండిరా బాబు! ఎన్నాళ్ళిలా? రిటైర్ అయినవాళ్ళు అంటి అని పిలిచేలా ఉన్నానా నేను ఐ హార్ట్ ! 

2 comments:

  1. మంచి ప్రశ్నే వేసారు ..ధన్యవాదములు...ఈ "ఆంటీ" అనే పదానికి సరి అయిన అర్ధం లేదు తెలుగులో..బంధువు కాని ఇతర స్త్రీని "ఆంటీ" అని సంబోధించేస్తున్నారు... వయసుతో సంబంధం లేకుండా...ఇదొక దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి...పక్కింటివాళ్ళను "అక్కయ్యగారూ"..అనో.."అత్తయ్య గారూ" అనో పిలిచేవాళ్ళం చిన్నప్పుడు...మా ఎదురింట్లో ఒకావిడ నా భార్య కన్నా పెద్దదే అయినా.."ఆంటీ వున్నారా??" అని అడుగుతే..తల ఎక్కడ పెట్టుకోవాలొ తెలియలేదు..

    ReplyDelete
    Replies
    1. హాహా వోలేటి గారు తెలుసండి ఇది మన సంస్కృతీ కాదని. పిన్నిగారు, అత్తయగారు, అక్కయగారు, వదినగారు అని ఆప్యాయంగా పిలవడంలో ఉన్న మాధుర్యం తెలీదు.. కాని నా విషయంలో రిటైర్డ్ అంటే నాకన్నా పెద్దాయన అంటే ఈపిలుపులన్ని తెలిసినతను ఇలా పిలవడం భాదాకరమే!

      Delete

Loading...