7.19.2016

రచయిత్రి హోదాని నిలబెట్టండి

ఒకప్పుడు ప్రముఖ రచయిత్రులని, రచయితలని చూడాలంటే జీవితకాలం ఎదురుచూడాలి అన్నట్లుండేవారు. సినిమా హీరో హీరోయిన్లకి సరి సమాన ప్రేక్షకాదరణ/పాఠకాదరణ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా వల్ల అందరు అందరికి దగ్గరవుతున్నారు. కాని వారి ప్రత్యేకతని కాపాడుకోగలుగుతున్నారా అంటే కించిత్ అనుమానమే. ఒకవేళ ఒకరో ఇద్దరో హుందాగా వారి రచనలు వారు చేసుకుంటూ పాఠకులకి కాస్త దూరంగా ఉన్నా మిగతా ఊరు పేరు లేని రచయిత్రులమని చెప్పుకుని ఎగిరిపడేవాళ్ళ కోవలోకి వచ్చేస్తున్నారు అనామకంగా.. నాకయితే చాలా బాధగా ఉంది.  

సోషల్ మీడియాలనుపయోగించుకుకొని నాలుగు లైన్లు రాస్తే అవి రచనలు మేము రచయిత్రులం అని అనుకునేవారి మనసు ఎటు గాలి వేస్తే అటు లొంగిపోతూ ఉంటుంది ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక పెద్దమనిషి తనను తాను అదేదో ప్రభుత్వోద్యోగిగా పరిచయం చేసుకుని, మాట మాట కదిపి తనకి పరిచయమయిన రచయిత్రుల గురించి చెప్పుకుంటూ వస్తుంటే మనసు ఎక్కడో కొంచం "అబ్బా" అని అనిపించింది. వారేమన్న ప్రముఖ అని బిరుదు తగిలించుకున్న రచయిత్రులేమో అని నేను వాకబు చేస్తే అరా కొరా అక్కడక్కడ నాలుగు కథలు రాసిన వాళ్ళు (నాలాగ) సో వాళ్ళ వల్ల "మీ రచయిత్రులు అలా, మీ రచయిత్రులు ఇలా " అంటూ .. అభం సుభం తెలియని ఎంతో మంది అపనిందలపాలవుతున్నారు. ఈ అనుభవం రెండు సంవత్సారల క్రితం నాకు జరిగింది .. అప్పుడు రాసిన పోస్ట్  (click on link) చాలా స్ట్రాంగ్ గా జవాబు చెప్పాను. ఇదిగో రెండు రోజుల క్రితం మరో రచయిత్రుల వెకిలి చేష్టలు వెలుగులోకి వచ్చాయి. వీరు చేసే ఏ చేష్ఠలు వ్యక్తిగతమయితే ఎవరికి ఇబ్బంది కలిగించనివి అయితే వారిని అనే హక్కు నాకు లేదు. కాని వారి వల్ల కుటుంబాలకి కుటుంబాలు అభాసుపాలవుతున్నాయి. ఒక పని చేసేముందో ఒకరిని ఇబ్బంది కలిగించేముందో ఒక్క క్షణం ఆలోచించండి.. ప్లీజ్ మీరు చాలా గొప్పపనులు చేసేస్తున్నాము అని అనుకుని చేస్తున్న పనుల వల్ల ఎంతోమంది "ప్రముఖ" రచయిత్రులు అభాసుపాలవుతున్నారు. ఎదుటివాడు మనల్ని చాలా చీప్ గా నేలబారుతనంతో అంచనా వేసేసి రచయిత్రులయితే సులువుగా పరిచయం పెంచేసుకోవచ్చు అనే అభిప్రాయం కలగజేసేస్తున్నారు,నిజమయిన రచయిత్రుల వ్యక్తిత్వం దెబ్బ తినేలా....  రచయిత్రీ అనే హోదాని కాపాడండి వారంటే ఉన్న అభిప్రాయానికి ముసుగులు వేయకండి.. ఏ ఒక్కరినో ఉద్దేశ్యించి  చెప్తున్న విషయం కాదు కథలు నవలలు కాస్త కల్పితం కాస్త నిజం కలగలిపి మొత్తం కల్పనే,   కాని జీవితం నిజం . నిజ జీవితాలని కథలుగా చేసుకోవద్దు. 



రచయిత్రులు అని పరిచయం చేసుకుంటున్న,  చేసుకున్న,..  ఇంకోకరు పరిచయం చేసిన వారి గురించి కొన్ని సంఘటనల విన్న నేపధ్యంలో "మేడం మీరు రచయిత్రా?  అని అడిగీనవారికి , నా సమాధానం :   కాదు నేను నామమాత్రపు రచయిత్రిని కాదు, ప్రముఖ రచయిత్రిని కూడా కాదు, నాకు తోచినవేవో రాసుకుంటూ ఉండే రమణిని. 

మన ఆడ రచయిత్రులపై (నిజమయిన) నిందలు పోవాలని మంచి రచనలు చేసేవారందరూ స్వఛ్చమయిన రచయిత్రులుగా పేరొందాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ. ... 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...