7.19.2016

నన్ను నేను చదువుకోడానికి ఎప్పుడు ఇష్టపడతాను
నన్ను నేను చదువుకోడానికి ఎప్పుడు ఇష్టపడతాను. నేను డిజైన్ చేసుకున్న అందమయిన పుస్తకం నా జీవితం. నాకున్న కష్టాలయినా, సుఖాలయినా ఏమాత్రం పొంగిపోకుండా , కృంగిపోకుండా ప్రతి పేజీని ప్రేమతో అందంగా మలుచుకుంటున్నా కాని ఈ మధ్యే మరీ ఖాళీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏమి పూరించలేక కాదు కాని ఎక్కడో వ్యక్తిత్వమో , అభిమానమో మా ప్రమేయం లేకుండా సాగుతున్నావు చూడు అని హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. చేతికేవో సంకెళ్ళున్నాయేమో అనిపిస్తోంది... దేనికి తడబడుతున్నానో ఏ ప్రలోభాలకి తలవగ్గుతున్నానో ఆలోచించాలి.

No comments:

Post a Comment

Loading...