7.18.2016

మన జీవన రీతిచెమరిస్తే
కళ్ళు తుడవాలి..!
భారమైతే..
మది తడమాలి..!
మింటికెగిస్తే..
భుజం తట్టాలి..!
మన్ను కలిస్తే..
కన్ను తడవాలి..!
నవ్వడానికైనా..
ఏడ్వడానికైనా
స్వాగతించడానికైనా
సాగనంపడానికైనా
నీ వాళ్ళంటూ కొందరుండాలి..!
అరే భాయీ..
డబ్బు డాబూ ...
నడకున్నంత సేపేరా..!
పడకేసావంటే..
చేతులు మారినట్టేేరా..!
డబ్బులో ములిగిపోకు..
మనుషుల్ని మర్చిపోకు..!
డబ్బుకి పరిమితి..
మనిషికి పరిణితి..
ఇదే కావాలి నీ జీవన రీతి..!!

  By vemuri Garu
2 comments:


  1. డబ్బుకి పరిమితి ... మనిషికి పరిణితి
    బాగుందండి

    ReplyDelete

Loading...